Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మన నడవడిక పదిమంది కనుచువారి
నడత మార్చుకొను విధముగ నలరవలయు
నపుడు వేల్పుల వౌదు మీ యవనిపైన ఁ
జూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: మన ప్రవర్తనను చూసి పదిమంది తమ ప్రవర్తనను మార్చుకునే విధంగా మనల్ని తీర్చిదిద్దుకుంటూ ప్రకాశించాలి. అపుడు ఈ భూమీద మనమే దేవతలం కాగలమన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవు ఈలోకానికి ప్రబోధించుదినకరా!

తే.గీ. మదుల నుండియునజ్ఞానమదియుజ జెదరి
పోయి విజ్ఞాన సుమములు పూయవవలయు
నవియుఁ దావులు వెదజల్ల హాయిఁ గొల్పుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మన మనస్సులలోని అజ్ఞానం చెదరిపోయి విజ్ఞాన సుమాలు పూచి అంతటా పరిమళాలను వెదజల్లి నప్పుడే ఎంతో హాయి కలుగుతుంది. ఆ పొందే హాయి సమాజ శ్రేయస్సుకు, దేశపురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు దినకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262