Others

టాన్‌ను తొలగిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ ఎండలో తిరగడం వల్ల శరీరం రంగుని కోల్పోయి, చర్మం టాన్‌కు గురికావడం మనందరికీ తెలిసిన విషయమే.. అయితే సన్ టాన్ నుంచి రక్షణ పొందేందుకు కాస్మొటిక్ ప్రొడక్ట్స్, బ్లీచింగ్ వంటి విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇలాంటివి వాడటం చర్మానికి హానికరం. కాబట్టి సహజమైన చిట్కాలను వాడటంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, సన్ టాన్ కూడా తొలగిపోతుంది. సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల, ఎండలో తిరగడం వల్ల, కాలుష్యం వల్ల కూడా సన్ టాన్ వస్తుంది. యు.వి. కిరణాలు శరీరంపై పడటం వల్ల కూడా సన్ టాన్ వస్తుంది. ఎక్కువ ఆటలు ఆడేవారికి మరియు కలుషిత వాతావరణంలో తిరిగేవారికి టాన్ ఎక్కువగా ఏర్పడుతుంది. బయటనుంచి వచ్చిన తరువాత స్నానం చేయకుండా అశ్రద్ధ చేస్తే టాన్ మరింత పెరిగే అవకాశం ఉంది. బయటి నుంచి వచ్చిన తరువాత స్నానం చేసి, ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా సన్ టాన్‌ను తొలగించుకోవచ్చు.
* నిమ్మరసం, అలోవెరా, కీరా రసాలను సమాన పాళ్ళలో తీసుకుని ముఖానికి పూసి పదిహేను నిముషాల పాటు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగడం వల్ల ముఖంపై ఉన్న టాన్ తొలగిపోతుంది.
* తేనె, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పూసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగినా టాన్ తొలగిపోతుంది.
* శనగపిండి, పసుపులను సమాన నిష్పత్తిలో తీసుకుని ఇందులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పూసి ఆరిన తరువాత నీటితో తడిపి వలయాలుగా రుద్దుతూ కడిగితే ముఖంపై ఉన్న టాన్ తొలగిపోయి తేటగా మారుతుంది.
* బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులా తయారుచేసి చేతులకి, ముఖానికి, మెడకు, ఎక్కడైతే టాన్ ఉందో అక్కడ రాయడం వల్ల టాన్ పోయి చర్మానికి ఉండే సహజరంగు వచ్చేస్తుంది. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* తేనెను, నిమ్మరసాన్ని కలిపి పేస్టులా తయారుచేసి ఎక్కడైతే టాన్ ఉందో అక్కడ ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పది, పదిహేను నిముషాలు ఉంచి తరువాత చల్లని నీటితో కడగాలి. కడిగిన వెంటనే కాటన్ టవల్‌తో తడిని గట్టిగా తుడవకుండా నెమ్మదిగా తడిని గుడ్డతో పీల్చుకునేట్లు అద్దాలి. సన్ టాన్ పోగొట్టుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతి.
* వెనిగర్, నీరు సమాన నిష్పత్తిలో తీసుకుని బాగా కలపాలి. చేతులను ఈ నీటిలో ఐదు నుంచి పది నిముషాలు ఉంచి తీసిన తరువాత చల్లని నీటితో చేతులను కడగాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే చేతులపై ఏర్పడిన టాన్ తొలగిపోతుంది. ఎండలో, వాతావరణ కాలుష్యంలో బండి నడిపేవారికి చేతులపై ఏర్పడిన టాన్‌ను పోగొట్టుకోవడానికి ఇది చక్కటి చిట్కా.
* సన్ టాన్‌ను తొలగించుకోవడానికి నిమ్మరసం, దోసకాయ రసం, గులాబీ నీటిని కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు, చేతులపై అప్లై చేయాలి. పది, పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం సన్ టాన్‌ను తొందరగా పోగొట్టడానికి సహకరిస్తుంది. నిమ్మరసాన్ని సన్ టాన్ ఉన్న దగ్గర రాస్తూ మసాజ్ చేసి పది, పదిహేను నిముషాల తర్వాత ఆ సొల్యూషన్ అంతా ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. నిమ్మలోని సిట్రిక్ ఆసిడ్, గులాబీ నీళ్లలోని చల్లదనం సన్ టాన్ తొలగించేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని తయారుచేసుకుని వారం రోజుల పాటు రిఫ్రిజిరేటర్లో కూడా నిలువ చేసుకోవచ్చు.
* టొమాటో రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగినట్లయితే ముఖం తేటగా వచ్చి.. కాంతులీనుతుంది. *