AADIVAVRAM - Others

కళ్లజోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మసకబారిపోతున్న బతుకునో
మారు స్పష్టంగా చూడాలనుకున్నా...
మంచు శిల్పాలౌతున్న గతకాలపు జాడల్ని
ఓ మాటు తేరిపారా వీక్షించాలనుకున్నా..
అదిగో ఆ క్షణమే
నా కళ్ల వాకిట్లో ఓ అద్దాల భవంతి వెలిసింది!

చెవుల పునాదులపైకెక్కి
ముక్కు దూలం ఆసరాగా
నా జీవిత సన్నివేశ వర్ణాలను కెలీడియో స్కోప్ చూపసాగింది!
ఆ రెండు గాజు తలుపుల వెనుకా వయసుడిగిన నా తలపుల రెటీనాలు కొత్త కాన్వాసులై ఏవో కొన్ని
తడి చిత్రాల్ని గీస్తాయి!
నాలోని మంచి చెడుల్ని
పెద్దగా చూపిస్తూనే నడిచొచ్చిన తోవంతా
పెరిగిన గరిక మొక్కల్నీ..
చెరుకు ముక్కల్నీ పరికిస్తూ
నా మనసుని సంతులన త్రాసై తూస్తుంటాయి!
పారేసుకున్న జ్ఞాపకాల పక్షులు
కొన్ని ఎప్పుడైనా ఆ పారదర్శక
గవాక్షాలపై వాలగానే...
నాలో సంతోష పచ్చదనాలకు జీవం పోస్తాయి!
ఒక్కో స్మృతినీ రెండేసార్ల తడిమి
చూసుకుంటూ మురుస్తాయి!
అప్పుడప్పుడూ నే లోతుగా
స్పృశించని విలువల దృశ్యాలు మసకతెరల్ని
ప్రసవిస్తుంటే..
ఆ స్వచ్ఛతా కటకాలు
నాకు ఆలోచనాలోచనాలౌతాయి!
నన్నొదిలెళ్లిన చూపుల బంధాలు నాకు దూరమైనా..
ముందున్న బతుకు బాటను
ఆశతో చూపిస్తూ
నా పాదాలకు దీపాలౌతాయి!
ఒక్కోసారి కళ్లజోడుని
ఎక్కడో పెట్టి మర్చిపోతే...
జీవిత దర్శినిని ఎక్కడో పారేసుకున్న భావన!
అప్పుడు నేను బాల్యంలోకి
పాక్కుంటూ వెళ్లి
నా రెండో బాల్యాన్ని వెతుక్కుంటాను!
తను దొరగ్గానే పాత స్నేహితుణ్ణి
కావలించుకున్నంత ఆనందం
మరలా నా కలల్ని దొరకబుచ్చుకున్నంత సంబరం!
కాటికెళ్లే వరకూ ఏదో ఒక సత్యాన్ని
దర్శించేందుకు..
నన్ను నేను తరచి చూసుకొనేందుకూ
నాకో విజ్ఞతల జోడి కళ్లజోడు రూపంలో కావాల్సిందే!
*

-డి.నాగజ్యోతి శేఖర్ 9492164193