Others

సత్యాగ్రహమూ ఆయుధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలాదిమంది మహిళలు పరదాల చాటునుంచి బయటకు వచ్చి ఉప్పు తయారీలో పాల్గొన్నారు, దేశ సేవలో మగవారికంటే తామేమీ తీసిపోమని నిరూపించుకున్నారు. వారు విదేశీ వస్త్ర దుకాణాలు, మద్య దుకాణాల వద్ద ధర్నాలు కూడా చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి అహింసనూ, సహాయ నిరాకరణాన్ని గాంధీ విస్తృత స్థాయిలో వినియోగించాడు.
తన అహింసా పోరాటాలను వర్ణించేందుకు గాంధీ తరచుగా యుద్ధరంగపు మాటలనే ఉపయోగించేవాడు. ‘‘నేను యుద్ధానికి బయలుదేరాను; ఒక సైనికుడికి తుపాకీ ఎంత ముఖ్యమో మీకందరికీ (సత్యాగ్రహులకు) రాట్నం అంతే ముఖ్యం; ఏకులే మీ తూటాలు, రాట్నమే మీ తుపాకీ; స్వాతంత్య్రాన్ని తుపాకులతో రక్షించలేం, కానీ చేతితో వడికిన నూలు కట్టల ఆకారంలో వున్న తూటాలతో అడ్డుకోవచ్చు. మీరు ధరసాన ఉప్పు కర్మాగారం మీద దాడి చెయ్యాలి, దాన్ని తర్వాతి కాలంలో ధరసాన యుద్ధం అని పిలుస్తారు. యుద్ధంలోని హింసాత్మకమైన, వినాశకరమైన ఆయుధాలను వదిలేద్దాం, దానిలోని ధైర్యం, సాహసం, దేశభక్తి, సామర్థ్యం, త్యాగం- ఈ మంచి లక్షణాలను మాత్రం తీసుకుందాం’’ ఇలా ఉండేవి ఆయన మాటలు.
గాంధీకి పిరికితనానికంటే అహింసనే ఇష్టపడేవాడు. కానీ బండ బలానికన్నా, ఆత్మబలానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ‘‘ఆటంబాంబువల్ల అహింస మీద మీకున్న విశ్వాసం చెదిరిపోయిందా?’’ అని అడిగినప్పుడు, ‘‘దానివల్ల నాకు అహింస మీద వున్న విశ్వాసం సడలలేదు సరికదా, సత్యం, అహింస అనే రెండు అంశాలే ప్రపంచంలో అన్నిటికన్నా బలమైన శక్తులని నమ్మకం పెరిగింది. ఆ శక్తులతో పోల్చినపుడు ఆటంబాంబు ప్రభావం చాలా తక్కువ’’ అన్నాడాయన. అహింస ద్వారా సాధించిన స్వాతంత్య్రం, భూమి మీద దోపిడీకి గురవుతున్న జాతులన్నిటికీ తమకు కూడా స్వాతంత్య్రం త్వరలోనే వస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.
ఎం.కె.గాంధీ రచయితగా చాలా పుస్తకాలు కనిపిస్తాయి కానీ వాటిలో చాలా వాటిని ఆయన పుస్తకాలుగా రాయలేదు. సత్యము- అహింస, స్వదేశీ-చరఖా అనే అంశాలమీద ఆయన రాసిన వ్యాసాలు, మహిళలను, విద్యార్థులను, రాకుమారులను ఉద్దేశించి ఆయన చేసిన ఉపన్యాసాల సంకలనాలే పుస్తకాలుగా ప్రచురించారు. ఆయన చాలామంచి రచయితగా గుర్తింపు పొందాడు. ఆయన ఒక నిర్దిష్టశైలి మీద శ్రద్ధ పెట్టలేదు, వినసొంపుగా ఉండేందుకై అందమైన మాటలను ప్రయోగించాలని చూసేవాడు. తన ఆశలు, విశ్వాసాలు, దుఃఖాలు, నిరాశలు ప్రతిబింబించే బలమైన శైలి ఆయనకుండేది. ఆయన రచనాశైలి కూడా ఆయన జీవనశైలిలాగే సరళంగా, సంక్షిప్తంగా, నిరాడంబరంగా ఉండేది. గాంధీ లేఖలు సూటిగా, చక్కటి ఆంగ్ల భాషలో ఉంటాయనీ; తాను వాడుతున్న పదాల విలువను పూర్తిగా అర్థం చేసుకొని ఆయన ప్రయోగిస్తారనీ చాలామంది బ్రిటీష్ వైస్రాయిలు అంగీకరించారు. ఆలోచనారహితమైన ఒక్కమాట కూడా ఆతని నోటినుంచి కానీ, కలం నుంచి కానీ బయటకురాదని గాంధీ చెప్పుకొనేవాడు. రౌండు టేబుల్ సమావేశాల్లో గాంధీ ప్రకటనలకు సిద్ధం చేసిన ఒక ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ ‘‘గాంధీలా ఇంగ్లీషు విభక్తుల (ప్రపోజిషన్స్) మీద పట్టు సాధించిన భారతీయుడిని మరొకరిని చూడలేదు. నేనెంతో కష్టపడి ప్రకటన సిద్ధం చేసిన తర్వాత, గాంధీ నేను రాసినదాన్ని అలా చూసి ఒకటి రెండు విభక్తులు మార్చేవాడు. దానితో నేననుకున్న భావంపోయి గాంధీ అనుకున్న భావం వచ్చేసేది’’అన్నాడు.
బహుశా గొప్ప ఆంగ్ల రచయితల పుస్తకాలను బైబిలును జాగ్రత్తగా చదవడంవల్ల ఆయన చెవులకు సరైన పదప్రయోగంలో శిక్షణ లభించిందేమో. ఆయన విస్తృతంగా చదివేవాడు, చదివినదాన్ని జీర్ణం చేసుకొనేవాడు.
ఆయన కౌమార దశలో ఉండగా రచయితగా తన మొదటి ప్రయత్నంగా భారతీయ విద్యార్థులకోసం ‘లండన్ గైడ్’ అనే చిన్న పుస్తకం రాశాడు. దానిలో లండన్ గురించి ఉపయోగపడే వివరాలున్నాయి. ఆ తర్వాత కాలంలో రెండు కరపత్రాలు రాశాడు. ‘‘యాన్ అప్పీల్ టు ఎవిరీ బ్రిటన్’, ‘ఇండియన్ ప్రాంఛైజీ’.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614