Others

ఆధ్యాత్మిక క్రమశిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిదానిలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులు చర్చిస్తే రెండవ దానిలో దక్షిణాఫ్రికాలో భారతీయ వ్యాపారుల చరిత్ర వివరించాడు. వాటిని అనుసరిస్తూ ఆ తర్వాత రాసిన ‘గ్రీన్ ఫాంప్లెట్’ వాస్తవ గణాంకాలను తెలిపేదిగా ఉంటుంది. దీన్ని ప్రచురించిన మొదటి నెలోనే సవరించిన రెండో ముద్రణ ప్రచురించాల్సి వచ్చింది. ఆ కరపత్రం సారాంశం దక్షిణాఫ్రికా వార్తాపత్రికలలో ప్రచురితమై అక్కడి యూరోపియన్లలో ఆగ్రహావేశాలు రగిల్చింది. దక్షిణాఫ్రికాలో గాంధీ అడుగుపెట్టగానే ఆయన మీద దాడులు జరిగాయి. సంక్షిప్తీకరణలో తన భావాలు వక్రీకరించబడ్డాయని గాంధీకి ఆ చేదు అనుభవం ద్వారా తెలిసింది. తన భావాలను సంక్షిప్తంగా చెప్పడంలో గాంధీకి మంచి నైపుణ్యం ఉంది. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని చాలా తీర్మానాలను ఆయనే రాశాడు.
‘ఎ గైడ్ టు హెల్త్’ అనే పుస్తకంలో గాంధీ ఆహారంతో చేసిన ప్రయోగాలన్నీ ఉన్నాయి. ‘ఇండియన్ ఓపీనియన్’ అనే గుజరాతీ పత్రికలో రాసిన వ్యాసాలకు అది ఆంగ్ల అనువాదం. అది భారతదేశంలోనూ, విదేశాలలలోనూ పాఠకుల ఆదరణ పొందింది, ఇతర యూరోపియన్, భారతీయ భాషలలోకి అనువాదమైంది. మనసులోకి ఏదైనా ఆలోచన రాగానే ఒక నిబద్ధతతో ఎవరైనా హేళన చేస్తారేమో అనే ఆలోచన లేకుండా అక్షర రూపంలో పెట్టడం గాంధీ అలవాటు. అలా రాసే అలవాటువల్లే ఆయన కదిలే ట్రాముల్లోనూ, ఊగే ఓడల్లోనూ కూడా ఏదో ఒకటి గిలుకుతూ ఉండేవాడు. మొత్తం ‘గ్రీన్ ఫాంప్లెట్’ను ఆయన 1896లో భారతదేశానికి ఓడలో ప్రయాణిస్తూ రాశాడు.
ఆధునిక నాగరికత మీద తీవ్ర విమర్శగా ఆయన రాసిన ‘స్వరాజ్ హింద్’ మొత్తాన్ని 1909లో ఇంగ్లాండు నుంచి దక్షిణాఫ్రికాకు ఓడలో ప్రయాణిస్తుండగా రాశాడు. ఆయన దానికి స్టీమరు కాగితాలను వాడుకున్నాడు. కుడిచేత్తో రాయడానికి అలసట వచ్చినపుడు ఆయన ఎడం చేత్తో రాసి 10 రోజుల్లో పుస్తకాన్ని పూర్తిచేశాడు. టాల్‌స్టాయ్ దాన్ని చదివి ‘అహింసాయుత నిరసన’ (పాసివ్ రెసిస్టెన్స్) అనే భావన భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఎంతో అవసరం’’ అన్నాడు. ‘కన్‌స్ట్రక్టివ్ ప్రోగ్రాం’ పేరుతో భారతదేశ నిర్మాణం మీద రాసిన చిన్న పుస్తకం మొత్తం రైలు ప్రయాణంలో రాశాడు. ఆయన రాతప్రతిలో కొట్టివేతలు, దిద్దుబాట్లు చాలా తక్కువగా ఉండేవి. మార్పులు చేయాల్సిన అవసరం అరుదుగా కానీ వచ్చేది కాదు. ‘సత్యంతో నిబద్ధమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ’ వల్లే అది సాధ్యవౌతుందని ఆయన చెప్పేవాడు.
ఒక భావాన్ని వేరొక భాషలోకి అనువదించడానికి పదాలను ఎన్నుకోవడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది. ఆయన ఒక పదాన్ని గానీ భావాన్ని కానీ అక్షరాలా అనువదించేవాడు కాదు, ‘డెత్ డాన్స్’ను ఆయన ‘పతంగ నృత్య’గా అనువదించాడు. తన ప్రగాఢ విశ్వాసాలను ప్రతిబింబిస్తున్నట్లుగా రస్కిన్ రాసిన ‘అన్ టు ది లాస్ట్’ ఆయనకు అనిపించింది. ఆయన దాన్ని ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీ భాషలోకి స్వేచ్ఛగా అనువదించారు. కారెల్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ కెమెల్ పాషా’లో కొన్ని భాగాలను ఆయన గుజరాతీలోకి అనువదించాడు. ఆయన రాసిన ‘ది స్టోరీ ఆఫ్ సత్యాగ్రహి’ అనేది ప్లాటో రాసిన ‘డిఫెన్స్ అండ్ డెత్ ఆఫ్ సోక్రటీస్’కు స్వేచ్ఛానువాదం. ఆశ్రమ భజనావళిని, భారతీయ రుషులు రాసిన కొన్ని శ్లోకాలను ఆయన దక్షిణాఫ్రికా జైలులో ఉండగా ఆంగ్లంలోకి అనువదించాడు. ఇవి ‘సాంగ్స్ ఫ్రం ది ప్రిజన్’గా ప్రచురితమయ్యాయి.
గాంధీ తన ఆత్మకథను గుజరాతీలో రాశాడు. ఆయన బలమైన, సరళమైన శైలి గుజరాతీని ప్రజల భాషగా మార్చేసింది. దీని ఆంగ్లానువాదం ‘మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్’ను చాలామంది ప్రసిద్ధవ్యక్తులు ఒక మంచి సాహిత్య రచనగా గుర్తించారు. ఒక ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని విశదీకరించడమే కాక, ఆయన తల్లిదండ్రులూ, భార్య, స్నేహితుల అక్షర చిత్రాలు, నాటకాలూ సన్నివేశాలు, ఉత్కంఠను కొనసాగించిన విధానం, సాధారణ సంభాషణలను కూడా పాఠకుల ఆసక్తి తగ్గకుండా రాసిన విధానం ఆ పుస్తకంలోని విశిష్టతలు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614