Others

నాకు నచ్చిన చిత్రం.. అంతస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవం దృష్టిలో మానవులంతా సమానమే. సమాజమే మనుషుల్ని వర్గాలుగా, కులాలుగా విడదీసింది. అయినా మానవాతీతమైన ఒక శక్తి వీటి ప్రమేయం లేకుండానే ఏకత్వం వైపు అడుగులు వేస్తుంది. అలాంటి శక్తివంతమైన అంశం ప్రేమ హృదయాలలో ఉన్నదన్న సందేశం ఈ చిత్రం ద్వారా చెప్పారు. జమీందారు గుమ్మడి అంతస్తులకు బానిస. తాను తన తప్పును ఒప్పుకోలేడు. కలవారు దోచుకోవడంవల్లే లేనివారు ఈ ప్రపంచంలో గణనీయంగా పెరిగారు. ఈ దోపిడి కేవలం సిరి సంపదలకే పరిమితం కాలేదు. మాన ప్రాణాలను కూడా బలి తీసుకునే స్థాయికి ఎదిగింది. కురుక్షేత్ర సంగ్రామంలా మానవ జీవితంలో ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంది. జమీందారు మదిలో ఓ పాపభీతి పాగా వేసివుంది. కామాంధుడై ఒక సామాన్యురాలిని ప్రేమించాడే కానీ సమాజంలో ఆమెకు ఉన్నమైన స్థానం కల్పించలేకపోయాడు. ఇంటికి దీపమై వెలగలేని ఆ ఇల్లాలు వెలయాలుగా ఓ బిడ్డని కని కన్నుమూసింది. ఆ పాప భీతితో ఉన్న జమీందారును అంతస్తులు మెట్ల కిందకి జార్చేస్తున్నాయి. తన పొరపాటును సరిదిద్దుకోలేక తనకులేని క్రమశిక్షణ కొడుకులకు నేర్పాలనుకున్నాడు. అందులో భాగంగానే ఓ కొడుకును పోగొట్టుకున్నాడు. చివరికి మరణశయ్యపై తన మనసులోని ఆవేదనను కొడుకువద్ద వెళ్లబోసుకున్నాడు. తన గుర్తుగా ఎక్కడో పెరుగుతున్న ప్రియురాలి కూతుర్ని ఆదరించమని వేడుకున్నాడు. తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ తనయుడు ఎన్ని త్యాగాలు చేశాడు? తండ్రి చేసిన తప్పిదానికి ఎన్ని అగచాట్లు పడ్డాడు.. అన్న కథనంతో హృదయాలకు హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించారు. అంతస్తుకు మించిన అభిమానం, ఆప్యాయత కోసం ఎదురుచూచే అభాగ్యురాలి కూతురిగా భానుమతి నటన అద్భుతంగా ఉంటుంది. చిత్రంలో మాటలు పసందుగా, పాటలు వీనుల విందుగా, మధురంగా సాగుతాయి. దులపర బుల్లాడా, దుమ్ము దులపర బుల్లోడా అన్న పాట ఈ చిత్రంలో ఉన్నా ప్రేక్షకులలో ఉన్న వికారాలను దుమ్ము దులిపేలా సాగుతుంది. అందుకే ఈ సినిమా అంటే నాకు ఇష్టం.

-విఆర్ రావు, సైదాబాద్