Others

ఎటైనా... నేను ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలను బట్టి నటీనటులను ఎంచుకుంటే అదొక రకం. కాని -హీరోలు, నటీనటులను బట్టి కథలు రాసుకుంటే ఇదో రకం. ఇలా రెండువైపులా కథలు రాయగలిగిన వాళ్లకు అవకాశాలకు కొదువ ఉండదంటున్నాడు దర్శకుడు అంజన్ కె కల్యాణ్. తొలి చిత్రం అత్తారిల్లుతో పరిశ్రమను ఆకట్టుకున్న
దర్శకుడితో ఈ వారం చిట్‌చాట్.
**
మీ నేపథ్యం?
యాదాద్రి వద్ద సంస్థాన్ రాజాపేట. డిగ్రీ వరకూ చదువుకుని బొమ్మలు వేయడం హాబీ కనుక ఆర్ట్, యానిమేషన్‌లో డిప్లమో చేశా. అనేక చిత్రాలకు 2డి యానిమేషన్ చేసిన అనుభవం ఉంది.
దర్శకుడిగా నిర్ణయం?
చిన్నప్పటి నుంచే దర్శకుడు బాపు ప్రేరణ. ఆయన బొమ్మలు వేస్తూ దర్శకుడు అయ్యాడు. అలా నేనూ అవ్వాలనుకున్నా.
ఇష్టమైన జోనర్?
అన్నీ ఇష్టమే. నవరసాలు పండిస్తేనే ఏ జోనరైనా హిట్టవుతుంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఏ జోనర్ పనికొస్తుందో ఆ జోనర్ నాకు ఇష్టం.
ఇపుడంతా హారర్, లవ్ జోనర్లేగా?
హారర్, లవ్ జోనర్ అయినా అందులో నవరసాలు ఉండాల్సిందే. మనం ఎంచుకున్న రసాన్ని చక్కగా పండిస్తే చాలు.
తొలి చిత్రం హారరేగా?
నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి తీసుకున్న కథ అది. దర్శకుడిగా నిరూపించుకోవడం కోసం అమ్మానాన్నలే నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తీశా. విడుదలయ్యాక మంచి అప్లాజ్ వచ్చింది.
నటీనటులను బట్టి కథా?
కథలను బట్టి నటీనటులను తీసుకుంటే న్యాయం జరుగుతుంది. అలాకాకుండా హీరోలను బట్టి కథ రాసుకున్నా స్క్రీన్ ప్లే చక్కగా రాసుకోవాలి. అప్పుడు ఆ కథకు న్యాయం జరుగుతుంది. ఇలా రెండు వైపులా కత్తి పదునులా రచయిత రాయగలగాలి.
పరిశ్రమలో సమస్యలు?
కొత్తవారికి కథ చెప్పడానికే సమస్య ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అన్ని చోట్లా ఉంది. పరిచయాలే మనకు అవకాశాలను ఇస్తాయి. మాట్లాడేలా చేస్తాయి. అలా, మాట్లాడితేనే అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న సమస్యలే. కానీ, ఒక్కోసారి ఇబ్బంది పెడతాయి.
దర్శకుడంటే?
సమాజ సంఘటనలను ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ప్రేక్షకుడికి చెప్పగలగాలి.

-శేఖర్