Others

పౌరసత్వ చట్టం సవరణ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీజీ ప్రభుత్వంలో బిల్లులు చట్టసభల్లో శరవేగంతో ఆమోదం పొందుతున్నాయి. తాజాగా పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యాంగం అవహేళనకు గురి అయిందని కాంగ్రెస్ పార్టీ రంకెలు వేస్తున్నది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ను అసెంబ్లీ కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడక్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం దగ్గరనుంచి పౌరసత్వ చట్ట సవరణ బిల్లు వరకు మోదీ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా అమిత్‌షా గృహ మంత్రిగా చక్కబెడుతున్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకమని కొన్ని పక్షాలు అపప్రచారం చేస్తున్నాయి. శరణార్థులకు, చొరబాటుదారులకు తేడా తెలియని అయోమయం రాజకీయ వర్గాల్లో, మేధావుల్లోనూ నెలకొని వుంది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో హిందువుల సంఖ్య ఏడాదికేడాది తక్కువైపోతుంటే భారత్‌లో 1947లో 9.8 శాతం వున్న ముస్లింల సంఖ్య 2011కు 14.2 శాతానికి చేరింది. ఆయా దేశాలలో అనేక రకాల అణచివేతలకు గురియై వెతలు నిండిన జీవితాలతో మాతృదేశం భారత్‌కు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చిన శరణార్థులకు నిలువనీడనివ్వడం భారత్‌లో ప్రభుత్వం కర్తవ్యం. బెంగాల్‌లో చొరబాటుదారులైన రోహింగ్యాలను అక్కున చేర్చుకుంటున్న మమతకు సహజ భారత పౌరులపట్ల ప్రేమ లేదా? బిల్లు ఆమోదం తరువాత బెంగాల్‌లో రోహింగ్యా ముస్లిం మూకలు చెలరేగిపోయి భారత్‌ను ఆకమిస్తాం అంటూ నినాదాలు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. మమత కళ్ళుమూసుకుపోయాయా? అస్సాంలో చొరబాటుదారులవల్ల ఇప్పటికే 9 జిల్లాల్లో ముస్లిం బహుళ సంఖ్యాక ఖిల్లాలైనాయి. ఆ చొరబాటుదారులకు ఇక్కడ ఓటరు కార్డులు, రేషన్ కార్డులు పంచి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నేడు హిందూ శరణార్థులకు పౌరసత్వమిచ్చే బిల్లు ఆమోదంపొందితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి? ఇదేనా సెక్యులరిజం. కాఫిర్లను ఖతం చెయ్యమని బలవంతంగా మతం మారమని అనేక రకాల బాధలను భరించిన హిందువులు శరణార్థులై భారత్‌కు పారిపోయి వచ్చారు. మయన్మార్ నుంచి 2 కి.మీ సరిహద్దులో వున్న చైనాకు వెళ్ళని రోహింగ్యాలు, 1769 కి.మీ దూరంలోవున్న భారత్‌కు ఎందుకు వస్తున్నారు? ఇది ధర్మసత్రమా? మయన్మార్‌లోనే వారిని తన్ని తరిమివేయడం జరిగింది. చైనాలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి. కనీసం వారికి నమాజ్ చేసుకునే స్వేచ్ఛ లేదు. చైనా ప్రభుత్వం వారిని కట్టడి చేసింది. కాని భారత్ మాత్రం అందరికీ అడ్డాకావాలని కాంగ్రెస్ ఇతర పక్షాలు కొన్ని భావిస్తున్నాయి. అసలు దేశ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ. మతం పేరున దేశాన్ని 1947లో విభజించాలన్న బ్రిటీష్‌వారి ఆలోచనకు గంగిరెద్దులా తలలూపింది కాంగ్రెస్ నేతలు. పాకిస్తాన్‌లోనే ముస్లింలలో అన్ని వర్గాలకు సమాన ఆదరణ లేదు. షియా, ముస్లింలతోబాటు అహ్మదీ, వహాబ్‌లకు సమాన గౌరవం లేదు. అందరం సమానమని పాకిస్తానీయులమని డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించిన ప్రభుత్వ మహిళా అధికారి జన్నత్ హుస్సేన్ నెకోకారాపై పాకిస్తాన్‌లో విద్యార్థులు దాడిచేసి ఆమెతో క్షమాపణ చెప్పించారు. ఇక హిందువుల పరిస్థితి అక్కడ ఎలా వుందో ఊహించుకోవచ్చు. 71,25,350 చ.కి.మీ అఖండ భారతం అనేక ముక్కలై 39,47,700 చ.కి.మీ భూభాగం మనం కోల్పోయినప్పటికీ, కోల్పోయిన కొన్ని భూభాగాలలో మన దేశీయులకు తిప్పలు తప్పలేదు. ప్రతి విషయాన్ని మతం కోణంలో చూడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. మోడీ భగవద్గీతను వివిధ దేశపర్యటనల్లో ఆ దేశాధినేతలకు అందజేస్తే దాన్ని మతతత్వం అంటూ రభస చేయడం వారికి పరిపాటి. దేశంలో కపిల్ సిబల్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకులు, శేఖర్ గుప్త, రాజ్‌దీప్ సర్దేశాయి, బర్భాదత్ వంటి జర్నలిస్టులు కన్హయ్యకుమార్, ఉబర్ ఖలీద్ వంటి విద్యార్థి నేతలు భారత్‌లో ముస్లింలు భద్రంగా లేరని వాపోతుంటారు. మరి అక్రమ చొరబాటుదారులైన ముస్లింలకు ఇక్కడి పౌరసత్వం కోసం వీరెందుకు వాదిస్తుంటారు? ఇదంతా బూటకపు సెక్యులరిజం కాదా? పౌరసత్వ చట్ట సవరణ బిల్లులో ఎక్కడా ముస్లింల గురించి ప్రస్తావన లేదని గృహ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లో ముస్లింలు మైనారిటీలు కాదు కనుక శరణార్థులుగా వచ్చిన సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, పార్శీ, జైన్, హిందూ శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చే విషయం బిల్లులో వుందని, ఇది ఇక్కడి ముస్లింలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని ఆయన లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రపంచంలో 50కిపైగా ముస్లిం దేశాలు, 120కిపైగా క్రైస్తవ దేశాలున్నాయి. కానీ హిందువులకున్న ఒకే ఒక్క దేశం భారతదేశం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌ల నుంచి తరిమివేయబడ్డ హిందువులు భారత్‌కు కాక ఇంక ఎక్కడికి వెళ్లగలరు. రోహింగ్యా ముస్లింలకు 65 ముస్లిం దేశాలు ఆశ్రయం నిరాకరించాయి. ఆశ్రయం పొందిన మయన్మార్‌లో రోహింగ్యాలు 3 లక్షల మంది బౌద్ధులను నరికి చంపారు. అందుకే అక్కడినుంచి బంగ్లాదేశ్ మీదుగా వారు భారత్‌కు చేరుతున్నారు. అస్సాంలో తరుణ్ గోగొయ్ ముఖ్యమంత్రిగా వున్నపుడు బంగ్లాదేశ్‌నుంచి వచ్చిన బెంగాలీ హిందువులకు, బౌద్ధులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరి ఇపుడెందుకు యు టర్న్ తీసుకుంది?
1950లో నెహ్రూ-లియాకత్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువుల హక్కుల పరిరక్షిస్తామని లియాకత్ చెప్పారు. కాని 1951-70 మధ్య 40 లక్షలమంది హిందువులు పాకిస్తాన్ వదిలిపెట్టారు. 1951 నుంచి 2018 వరకు హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2012లో కమ్యూనిస్టు పార్టీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ నుంచి బెంగాలీ హిందూ శరణార్థులకు పౌరత్వం ఇవ్వాలని కోరుతూ ఉత్తరం రాసింది. మరిపుడెందుకు బిల్లును వ్యతిరేకిస్తోంది? 1950లో ప్రధాని నెహ్రూ, ఆయనకు ముందు మహాత్మాగాంధీ, 1964లో గుల్జారీలాల్ నందా అందరూ శరణార్థులకు పౌరసత్వాన్ని కోరినవారే, సమర్థించినవారే, ఇస్తామని వాగ్దానం చేసినవారే.
1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తరువాత రెండులక్షలమంది హిందువులు చంపబడ్డారు. కాని నేటికే రెండు కోట్లమంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్‌లో వుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని సమర్థిస్తోంది? మక్కామసీదు పేలుళ్ళలో కూడా రోహింగ్యాలున్నారని మీడియా వార్తలు ప్రసారం చేసింది. పౌరసత్వ చట్టసవరణ బిల్లును అంగీకరించక కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తోంది. దేశభక్తుడైన సావర్కార్‌ను కూడా ఈ రాజకీయ యాగీలోకి లాగిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుంది. కేరళలో ముస్లింలలీగ్‌తో, మహారాష్టల్రో శివసేనతో అవకాశవాద కుర్చీ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లనుంచేకాక శ్రీలంక, టిబెట్, ఉగాండా, ఇతర దేశాలనుంచి కూడా అనేకమంది హిందూ శరణార్థులు భారత్‌కు చేరారు. నెహ్రూ - లియాకత్ ఒప్పందం మాదిరినే ఇందిరాగాంధీ-ముజిబూర్ రహమాన్‌లమధ్య ఒప్పందం కూడా మూలబడింది. సరిగ్గా అమలుకు నోచుకోలేదు. రాజ్యాంగం అధికరణ 14 ఈ బిల్లుకు ఏ మాత్రం సంబంధంలేని విషయం. ఇది నేషనల్ రిజిష్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) నిర్థారించే విషయం. ఆయా దేశాల్లో మైనారిటీలు కాని ముస్లింలు భారత్‌కు వచ్చేది కేవలం వలసదారుల పేరున పబ్బం గడుపుకోవడానికే.. తృణమూల్ వంటి రాజకీయ పక్షాలు వారిని తమ ఓటు బ్యాంకులుగా పరిగణిస్తున్నాయి. రాజకీయాల ముందు జాతీయవాదం సవాళ్ళను ఎదుర్కొంటోంది. 2014 డిసెంబరు వరకు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ప్రతిపాదిత చట్టం ద్వారా మంజూరు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఎన్.ఆర్.సి.ని సుప్రీంకోర్టు సూచన మేరకు అమలుచేయడం కూడా మోదీ ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించింది. దీనివరకు 1971 తరువాత వచ్చిన అక్రమ వలసదారులను అనుమతించేదిలేదు. అంతకుముందు వరకు వచ్చిన వలసదారులంతా మస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారే. కేంద్రం మత ప్రాతిపదికన ఈ చట్టం తెచ్చి వుంటే 1971 ముందు వచ్చినవారిని కూడా సాగనంపేందుకు సవరణబిల్లు తీసుకొచ్చేది. కానీ కేంద్రం అలా చేయలేదు. కేంద్రం తెచ్చిన ఈ బిల్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాలకు కనువిప్పు కావాలి. ధైర్యం వుంటే ఇలాంటి చట్టం ఆ దేశాల్లో వారూ చేయాలి. కానీ వారికి ఆ అవసరం లేదు. అక్రమ వలసలను భారత్‌లోకి ప్రోత్సహించడం, సీమాంతర తీవ్రవాదానికి సహకరించడం తప్ప పాకిస్తాన్‌కు మరో విద్య తెలియదు. లోక్‌సభలో 48 మంది సభ్యులు ఈ బిల్లుపై చర్చించారు. దేశంలో మైనారిటీ విద్యా సంస్థలకు అనుమతులిస్తున్నారు. వాజ్ యాత్రకు రాయితీలిస్తున్న తీరును గమనించి దాన్ని రద్దుచేసి వారి సంక్షేమం కోసం ఆ ధనాన్ని వినియోగించడం జరుగుతోంది. దేశ విభజన నా శవం మీద జరుగుతుందని గాంధీ, అదొక ఫెంటాస్టిక్ నాన్‌సెన్స్ అని నాడు నెహ్రూ అన్నాడు. కానీ విభజనను ఆపలేకపోయారు. ఆ విష ఫలితాలు దేశాన్ని నాటికీ పట్టిపీడిస్తున్నాయి. కోట్లలో వున్న అక్రమ వలసదారులెక్కడ? వేలల్లో వున్న ఈ శరణార్థులెక్కడ? ఈ మధ్యకాలంలో 566 మంది ముస్లింలకు కూడా పౌరసత్వమిచ్చినట్లు అమిత్ షా అన్నారు. తిస్లీమా నస్రీన్ కూడా అందులో ఒకరు. భారత్‌లోని పౌరుల భద్రతతో బాటు పరాయి దేశాల్లో వున్న మన వారి భద్రత గురించి కూడా ఈ బిల్లు ఆలోచిస్తున్నదనేది ఓ విస్తృత ప్రయోజనంగా అర్థం చేసుకోవాలి.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 9676190888