Others

నిష్పక్షపాత వైఖరికి దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రికేయుడు
19 ఏళ్ల వయసులో ఇంగ్లాండుకు వెళ్లిన తర్వాత గాంధీ క్రమం తప్పకుండా వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నాడు. పాఠశాల విద్యార్థిగా ఉండగా ఆయనకు వార్తాపత్రికలు చదివే అలవాటు లేదు. ఆయనకు చాలా బిడియం, పదిమంది ముందు మాట్లాడలేకపోయేవాడు. 21 సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఆయన ఒక ఇంగ్లీషు వారపత్రికకు శాకాహారం, భారతీయ ఆహార అలవాట్లు, సంప్రదాయాలు, శాఖాహారుల మతపరమైన పండుగలు లాంటి అంశాలపై వ్యాస పరంపర రాశాడు. ఏ ఆలోచననైనా సరళంగా, సూటిగా చెప్పడంలో ఆయనకున్న సామర్థ్యం ఆ మొదటి రచనలో కనబడుతుంది.
రెండు సంవత్సరాల విరామం తర్వాత గాంధీ మళ్లీ పాత్రికేయ వృత్తిలోకి వచ్చాడు. అప్పటినుంచి జీవితాంతంవరకూ ఆయన కలం విశ్రాంతి తీసుకోలేదు. కేవలం ఎవరినో ఆకట్టుకోవడం కోసం ఆయన ఎప్పుడూ ఏదీ రాయలేదు. అతిశయోక్తులు రాయకుండా జాగ్రత్త తీసుకొనేవాడు. సత్యాన్ని ప్రచారం చేయడం, ప్రజల అవగాహనను పెంచడం, దేశానికి ప్రయోజనకరంగా ఉండటం అనేవి ఆయన మూడు లక్ష్యాలు.
దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన మూడో రోజు ఆయనకు న్యాయస్థానంలో అవమానం ఎదురైంది. ఆయన వెంటనే ఆ సంఘటనాక్రమాన్ని స్థానిక వార్తాపత్రికకు రాసి పంపి ప్రచురితమయ్యేలా చూశాడు, రాత్రికి రాత్రి పెద్ద ప్రచారం పొందాడు.
35 సంవత్సరాల వయసులో ఆయన ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రిక బాధ్యతలు స్వీకరించాడు. దాని ద్వారా ఆయన దక్షిణాఫ్రికాలోని భారతీయులకు మార్గదర్శనం చేశాడు, వారిని ఏకం చేశాడు. ఈ వారపత్రిక గుజరాతీ సంచికను ఫీనిక్స్‌లో ముద్రించేవారు. ఆహారశాస్త్రంమీదా, ప్రసిద్ధులైన పురుషులు, మహిళల జీవిత విశేషాలమీద వ్యాసపరంపర ఈ పత్రికలో వచ్చేది. గాంధీ రాసిన ఈ రెండు వ్యాసాలు ప్రతివారం ఈ పత్రికలో తప్పనిసరిగా ఉండేవి. దీనికి సంపాదకుడు ఉండేవాడు కానీ గాంధీనే అన్ని బాధ్యతలు చూసుకొనేవాడు. ప్రజలకు అవగాహన పెంచాలని, తెల్లవారికి, భారతీయులకు మధ్య అపార్థానికి దారితీసే అంశాలను పరిష్కరించాలని, తన దేశస్థుల లోపాలను ఎత్తిచూపి వాటిని సరిచేయాలనీ ఆయన కోరుకొనేవాడు. ‘ఇండియన్ ఒపీనియన్’ వ్యాసాలలో తన హృదయాన్ని ఆవిష్కరించేవాడు, దక్షిణాఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమాన్ని పూసగుచ్చినట్లు ప్రచురించేవాడు. ఆయన వ్యాసాల ద్వారా విదేశాలలో వున్న పాఠకులకు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సంఘటనల నిజస్వరూపం తెలిసేది. అలా తెలుసున్నవారిలో భారతదేశంలో గోఖలే, ఇంగ్లాండులో దాదాభాయి నౌరోజీ, రష్యాలో టాల్‌స్టాయ్‌లాంటి వారున్నారు. పదేళ్లపాటు గాంధీ ఈ వారపత్రికకోసం కష్టపడ్డాడు. ఇండియన్ ఒపీనియన్‌కు బదులుగా ఆయనకు రెండొందల పత్రికలు లభించేవి. ఆయన వాటన్నిటినీ జాగ్రత్తగా చదివి పాఠకులకు ఉపయోగపడతాయనుకొనే అంశాలను తిరిగి పత్రికలో ప్రచురించేవాడు.
భావాలను ప్రచారం చేయడానికి వార్తాపత్రికలు మంచి మాధ్యమంగా పనిచేస్తాయని గాంధీకి తెలుసు. ఆయన విజయవంతమైన పాత్రికేయుడే కానీ, జీతం కోసం ఎప్పుడూ ఆ వృత్తిని ఎంచుకోలేదు. పాత్రికేయుల లక్ష్యం సమాజ సేవ అని ఆయన నమ్మేవాడు. ‘‘పొట్టకూటిని సంపాదించుకోవడం కోసమో, ఇతర స్వార్థ ప్రయోజనాలకోసమో ఎప్పుడూ పాత్రికేయ వృత్తిని తాకట్టు పెట్టకూడదు. పత్రికల సంపాదకులకు ఎలాంటి సవాళ్ళు ఎదురైనా, ఫలితాలతో సంబంధం లేకుండా వారు దేశ ప్రయోజనాలే లక్ష్యంగా వార్తలు ప్రచురించాలి. ప్రజల హృదయాలలో నిలిచి ఉండాలంటే విభిన్నమైన, నిష్పక్షపాతమైన విధానాలను అనుసరించాలి’’ అనేవాడు గాంధీ.
ఆయన కఠోరమైన వాస్తవాలను ఎప్పుడూ విస్మరించేవాడు కాదు. అలంకారాలను ఉపయోగించేవాడు కాదు, అజాగ్రత్తగా ప్రకటనలు చేసేవాడు కాదు, అనవసరమైన విశేషణాలు వాడేవాడు కాదు. పదాల ఎంపికలోనూ, అనువాదంలో తప్పులు దొర్లకుండాను చాలా జాగ్రత్తలు తీసుకొనేవాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614