Others

ఈ పోస్టర్‌కు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా తీయటంతోనే సరిపోదు? సినిమాను ఆడియన్స్ దృష్టికి చేర్చటమే పెద్ద కసరత్తు! అదే -ఒకప్పుడు ప్రచారం. ఇప్పుడు -ప్రమోషన్. నిజానికి డబ్బుతో
కూడుకున్న పనేఇది.
సినిమా నిర్మాణాలు మొదలైన ఆదిలో నిర్మాత -తన సినిమా గురించి దినపత్రికల, వారపత్రికల్లో ప్రచారం చేసేవాడు. ఇప్పుడున్నంత సినీ మీడియా, సోషల్ మీడియా అప్పట్లో లేదు. తనే తన సినిమా బాక్స్‌లు నెత్తిన పెట్టుకొని.. ఊరూరా తిరుగుతూ డేరా థియేటర్లలో ప్రదర్శించేవాడు. సృజనాత్మక సినిమా కల్పించే ఆనందం, ఆసక్తి ప్రజలకు ఆకర్షణ, మోజుకు కారణమైంది. క్రమంగా సినిమా గురించి ప్రచారం మొదలైంది. సినిమా గురించి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసే విధానం వచ్చింది. చిత్రంలోని కొన్ని సంభాషణల్ని గ్రామ్‌ఫోన్ రికార్డుల ద్వారా ఎడ్లబండి, రిక్షాల్లో తిరుగుతూ ఊరూరా వినిపిస్తూ ప్రచారం చేసేవారు. కాలక్రమంలో ప్రింటింగ్ ప్రెస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో -’30తి40’ సైజ్‌గల పోస్టర్‌ని లైన్ డ్రాయింగ్‌తో తయారుచేయించి, దాన్ని అచ్చువేసి గోడలపై అంటించి ప్రచారం సాగించే విధానం వచ్చింది. ఎప్పుడైతే లితోప్రింటింగ్ ప్రెస్‌లు అందుబాటులోకి వచ్చాయో.. సినిమా పోస్టర్ రూపురేఖలే మారిపోయాయి. ఆ చిత్రాల్లో నటించిన తారాగణం పోజులతో పోస్టర్లు అచ్చువేయించి, ఊరూరా, వీధివీధినా గోడలకు అంటించి ప్రచారం చేసుకునే వెసులుబాటు కలిగింది. చాలాకాలం వరకూ పోస్టర్లన్నీ బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉండేవి.
ఎప్పుడైతే రంగుల్లో అచ్చువేసే లితో ప్రెస్‌లు వచ్చాయో -అప్పుడే పోస్టర్ కూడా రంగుల్లోకి మారింది. సినిమాపై ఆసక్తి కలిగించేంత ఆకర్షణీయంగా పోస్టర్‌ను డిజైన్ చేసి.. వాటితో సినిమా ప్రచారం జోరుగా సాగించే అవకాశం దక్కింది. ఎన్నో ప్రింటింగ్ ప్రెసులు వచ్చాయి. నేషనల్ లితో, పద్మనాభ, శక్తి, సఫైర్, ధనలక్ష్మి.. ఇలా ఎన్నో ప్రెస్‌లు వచ్చి చక్కని ప్రింటింగ్ క్వాలిటీతో పోస్టర్లు అచ్చేసేవి. పోస్టర్లపైనే లక్షల్లో వ్యాపారం సాగేదంటే అతిశయోక్తి కాదు. దీంతో -ఎందరో పబ్లిసిటీ డిజైనర్స్ వచ్చి వారివారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పరిశ్రమకు చక్కని సేవలు అందించారు. రామారావు డిజైన్స్, కేతా, ఈశ్వర్, గంగాధర్, లంక భాస్కర్, సురేష్.. ఇలా ఎందరో వారివారి ప్రతిభతో అందమైన డిజైన్లు చేసి మెప్పించారు. అది వారి సృజనకు తార్కాణం!
చాలాకాలం వరకూ డిజైనర్లు అందరూ మాన్యువల్ ద్వారానే వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. డిజైన్స్‌లో '30X40' 2 sheet, 4 sheet, 6 sheet, 24 sheet, 12 sheet అనే విధాలుగా సైజుల్లో డిజైన్లు రూపొందించేవారు. అవి ఆ సైజ్‌ల్లో అందంగా ప్రింటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించేవి. వాల్‌పోస్టర్లని చూసే ఒకప్పటి సినిమా అభిమానులు, కాస్త సినిమా పరిజ్ఞానం ఉన్న వాళ్లు -ఆ చిత్రం విజయవంతమవుతుందా? అపజయాన్ని చవిచూస్తుందా? అనేది నిర్ధారించగలిగేవారంటే -చిత్రంలోని కానె్సప్ట్‌ని డిజైనర్లు ఎంత గొప్పగా చూపించేవారో అర్థం చేసుకోవచ్చు. అంటే -సినిమాలోని సన్నివేశాలు అంతలా వాల్ పోస్టర్లపై కనిపించేవి!
చాలాకాలం ఇదే తరహా వ్యాపారం నడవడంతో -లితో ప్రెస్సులు లక్షలనుండి కోట్లకు వ్యాపారం చేసి లబ్దిపొందిన వాళ్లూ ఉన్నారు. ఇటు డిజైనర్స్, ప్రెస్‌వాళ్లు, వాటిని గోడల మీద అంటించే బాయ్స్ వరకు అందరూ లాభపడేవారు.
సినిమా రిలీజు నుంచి వంద రోజుల వేడుక వరకే పోస్టర్ వ్యాపారం ఉండేది కాదు. ప్రతి అయిదేళ్లకోసారి రీపిట్ రిలీజులతో ఎప్పుడు పోస్టర్స్ ప్రింట్ అవుతూనే ఉండేవి. ఇటు కార్పొరేషన్ సంస్థకూ వాల్‌పోస్టర్ల ద్వారా ఆదాయం లభించేది. ప్రెస్‌ల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. ప్రెస్సువాళ్లు సంపాదించుకున్న దాంట్లో రాయల్టీ కింద కొంతవరకు డబ్బు నిర్మాతకు తిరిగి ఇచ్చేవారు. అది నిర్మాతకు కొంత ఆదాయ వనరుగా సమకూరేది.
కొంతకాలం ప్రెస్‌లు పోటీలుపడి ముందే నిర్మాతకు రాయల్టీ కింద లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించి పోస్టర్ల హక్కులు పొందేలాంటి వ్యాపారమూ సాగింది. అలా సాగింది పోస్టర్స్ విజయోత్సవం!
నేడు వినాయిల్ ప్రింటింగ్, కార్పొరేషన్ సంస్థ హద్దులతో వాల్ పోస్టర్ల వ్యాపారం జోరు తగ్గింది. దీనికితోడు ‘సాంకేతికత’ సులువైపోవడం, సినిమా ప్రచారం కాస్తా ప్రమోషన్ స్థాయికి ఎదిగిపోవడంతో -ఎన్నో లితో ప్రెస్‌లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు తెలుగులో నేషనల్ లితో, సఫైర్, ధనలక్ష్మి అని మూడే ప్రెస్సులు భారంగా వ్యాపారం సాగిస్తున్నట్టు వినికిడి. వ్యాపారం తగ్గడంతో -నేడు ఏ ప్రెస్సూ రాయల్టీలు ఇవ్వటం లేదు. డబ్బులిస్తే డిస్కౌంట్‌లో ప్రింట్ చేసి ఇస్తున్నారు. పూర్వంలా అన్ని సైజులు ఇప్పుడు ఎవ్వరూ ప్రింట్ చేయించుకోవటం లేదు. పోస్టర్స్ అంటించడానికి కూడా కార్పొరేషన్ సంస్థలు ఎన్నో ఆంక్షలు విధించటం, హోర్డింగ్స్ వచ్చేయటంతో పోస్టర్ ప్రింటింగ్ అనేది చాలా వరకూ తగ్గిపోయింది.
నేడు చాలామంది నిర్మాతలు సోషల్ మీడియా ద్వారానే సినిమా ప్రచారం చేసుకుంటున్నారు. ఆడియో రిలీజ్ ద్వారా ఆర్భాటం, ఈవెంట్స్ నిర్వహణతో ప్రమోషన్, టీవీల్లో చర్చలతో ప్రచారాన్ని సాగిస్తుండటంతో పోస్టర్ ప్రింటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. పోస్టర్లని అంటించడానికి కూడా సరైన వాల్స్‌లేక పూర్తిగా పోస్టర్‌పై దృష్టి పెట్టటం లేదన్నది నిజం. అందరు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారానే తమ చిత్రాల ప్రచారం సాగిస్తున్నారు. పబ్లిసిటీ డిజైనర్లు కూడా నేడు డిజిటల్ స్థాయికి వచ్చేయడం -్ఫస్ట్‌లుక్, ప్రచార చిత్రాలు విడుదల చేయడంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత పెరిగిపోవడం లాంటిది ప్రత్యక్షంగా కనిపిస్తోన్న మార్పు. మాన్యువల్‌గా పోస్టర్‌ను డిజైన్ చేయగల నైపుణ్యంగల డిజైనర్లూ ‘సాంకేతికత’ గొడుగు కిందకు వెళ్లిపోవడంతో, సినిమా పోస్టర్ కూడా డిజిటల్‌మయం అయిపోయింది!
ఎన్నో ఏళ్లుగా సినిమాకు సేవలందించిన వాల్‌పోస్టర్ కూడా తన దిశను మార్చుకొని, మీడియా స్క్రీన్స్‌పై ప్రత్యక్షమవుతుంది. ఓ కొత్త మార్పుతో పాత పద్ధతిని తుడ్చిపెట్టేయడమే సాంకేతిక విప్లవం! విస్తరిస్తున్న టెక్నాలజీలో ప్రస్తుత విధానం ఎలాంటి మార్పులకు, ఒడిదుడుకులకు గురవుతుందో వేచి చూద్దాం.

-జాగృతి