Others

పత్రికలకూ సత్యమే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయనకు పేరు లేని లేఖలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ సంపాదకునికి లేఖలలో తీవ్రమైన విమర్శలొచ్చినా ప్రచురించేవాడు.
‘ఇండియన్ ఒపీనియన్’ బాధ్యతలు గాంధీ చేపట్టినప్పుడు అది నష్టాల బాటలో ఉంది. కేవలం 400 మంది చందాదారులుండేవారు. ఆయన దానిమీద లాభాలు సంపాదించాలనుకోలేదు కానీ, తనను తాను పోషించుకోలేని పత్రికకు సంపాదకుడిగా ఉండటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కొన్ని నెలలపాటు ఆయన దాన్ని నడిపేందుకు నెలకు 1200 రూపాయలు తన జేబులోంచి ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మొత్తంమీద ఆ పత్రిక నడపడం కోసం ఆయన 26,000 రూపాయల సొంత ధనాన్ని నష్టపోయాడు.
ఇంత భారీ నష్టం వచ్చినప్పటికీ, తన భావాల ప్రచారానికి మరింత చోటు కావాలని, తర్వాతి కాలంలో ఆయన పత్రికను ప్రకటనలేవీ లేకుండానే ప్రచురించాడు. ప్రకటనలు స్వీకరిస్తే సత్యానికి కట్టుబడి ఉండటం, తన భావాలను స్వతంత్రంగా ప్రకటించడం సాధ్యంకాదని ఆయనకు తెలుసు. ‘‘ఆదాయం కోసం చందాలమీద కాకుండా, ప్రకటనల మీద ఆధారపడటం ఆరోగ్యకరం కాదు. మద్యపానంవల్ల వచ్చే నష్టాల గురించి రాసే పత్రికే మద్యం ప్రకటనలు వేస్తుంది. 99 శాతం ప్రకటనలు బొత్తిగా ఉపయోగంలేనివి, దేశానికి ప్రమాదకరమైనవి. చాలా ప్రకటనలు మోసపూరితంగా, అసభ్యంగా ఉంటాయి’’ అనేవాడాయన.
తన పత్రికల అమ్మకాలను అక్రమ పద్ధతుల్లో పెంచుకోవాలని కానీ, ఇతర వార్తాపత్రికలతో పోటీపడాలని కానీ గాంధీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. గడి - నుడి వంటివాటికి కానీ, మరే ప్రహేళికకు (పజిల్‌కు) కానీ, ఎప్పుడూ ఆయన బహుమతి ప్రకటించలేదు. ఏవో ప్రలోభాల ఎర చూపి పాఠకులను వలలో వేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ‘‘ఇతర పత్రికలు నా ఆత్మకథను పునః ప్రచురించడాన్ని అడ్డుకొని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల అమ్మకాలు పెంచుకోవడం నాకిష్టంలేదు’’ అని ఆయన ప్రకటించాడు.
భారతదేశంలో కూడా తన వారపత్రికల పేజీలను ప్రకటనలతో పాడుచేయకుండా ఆయన 30 ఏళ్ళపాటు పత్రికలు నడిపాడు. ప్రతి రాష్ట్రంలోనూ ఒకే ప్రకటనల సంస్థ ఉండాలని, ప్రకటనలన్నీ సమీక్షించి కేవలం ప్రజలకు ప్రయోజనకరమైన ప్రకటనలను మాత్రమే ప్రచురించాలని ఆయన సూచించేవాడు. యంగ్ ఇండియా సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన గుజరాతీ భాషలో కూడా ఒక పత్రిక తేవాలనుకున్నాడు. దేశంలో ప్రాంతీయ భాషా పత్రికల అవసరం ఎంతో వుందని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన యంగ్ ఇండియా పత్రిక హిందీ, గుజరాతీ అనువాద సంచికగా ఆయన నవజీవన్‌ను ప్రారంభించాడు. వాటికి క్రమం తప్పకుండా అనేక వ్యాసాలు రాసేవాడు. యంగ్ ఇండియాకు సుమారు 1200కుపైగా చందాదార్లుండగా, నవజీవన్‌కు 12 వేలకు పైగా చందాదారులు ఉండేవారు. ఆయన నవజీవన్ వార్షిక చందాను 8 రూపాయల నుంచి 4 రూపాయలకు తగ్గించాడు. నవజీవన్‌మీద వచ్చిన లాభాల్లో 40వేల రూపాయలను ఖాదీ నిధికి ఇచ్చిన కారణంగా పత్రికలో పేజీల సంఖ్య తగ్గించాల్సి వచ్చినపుడు ఆయన పాఠకులకు క్షమాపణలేవీ చెప్పలేదు.
‘‘నా కోరిక సామాన్యులను చేరుకోవాలనే. ఇది కేవలం ప్రాంతీయ భాషా పత్రికల ద్వారా మాత్రమే సాధ్యం. నాది వ్యవహారిక గ్రామీణ భాష, నవజీవన్‌ను టాక్సీ, డ్రైవర్లు, కార్మికులు చదువుతారు. అది రైతులకు, నేతపనివారి గుడిసెలకూ చేరుకోవాలని నా కోరిక. అందుకే అది వారి భాషలో ఉండాలని కోరుకుంటున్నాను. వారే భారత నిర్మాతలు’’ అని ఆయన సగర్వంగా చెప్పేవాడు. ఇంగ్లీషు పత్రికను చదివేవారి సంఖ్య అత్యల్పం కాబట్టి ఆ పత్రికకు సంపాదకత్వం వహించడం ఆయనకు ఆనందాన్నిచ్చేది కాదు. తన పాఠకులను పత్రిక యజమానులుగా భావించమని ఆయన చెప్పేవాడు. గాంధీ ఆస్తులుగా కాక పత్రికలను వారి సొంత పత్రికలుగా భారతీయులంతా చూసుకోలని ఆయన కోరేవాడు. నవజీవన్‌లో అక్షర దోషాలు, అన్వయ దోషాలు కనిపిస్తే పత్రిక కొనవద్దనీ, నవజీవన్ బహిష్కరణ సంఘాలు స్థాపించాలని సూచించేవాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614