Others

షావుకారు.. ఆమె ఇంటిపేరు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక నటి పేరుకు ముందు ఇంటి పేరుతో కాకుండా మొదటి సినిమా పేరు ఇంటి పేరు కావటం జానకితోనే ప్రారంభమైంది. వెండి తెరపై షావుకారు జానకిగా చిత్రాల్లో నటిస్తూ ఆకాశవాణి మద్రాసు ‘బి’లో ప్రసారమైన పలు తెలుగు నాటకాలలో జగ్గయ్యతో కలిసి సంభాషణు చెప్పి సుమధుర భాషిణి అని నిరూపించుకొంది. వినోదా సంస్థపై డియల్ నారాయణ నిర్మించిన దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రకు బుక్ అయి ఒక పాట సహా మరికొన్ని సన్నివేశాలలో నటించిన తర్వాత, కారణాలు తెలవవుకాని పార్వతి పాత్రకు మరొక నటిని బుక్ చేసినట్టు నిర్మాత లిఖిత పూర్వకంగా తెలియపరచాడు. ఆ ఉత్తరం నేటికీ జానకివద్ద భద్రంగా వుందనుకోండి. ఆ చిత్రంలోనే దేవదాసు అన్నట్టు ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయి’ అన్నవిధంగా పార్వతి పాత్రలో ప్రారంభంలో జానకి, తర్వాత నటించిన సావిత్రి నట జీవితానికి ఎలాంటి అంతరాయాలు లేకుండా సాగిపోయింది. రోజులు మారాయి, నాగుల చవితి, ఎత్తుకు పైఎత్తు, తాయారమ్మ బంగారయ్య, మంచి మనసులు, అక్కాచెల్లెలు చిత్రాల ద్వారా జానకి అగ్రశ్రేణి హీరోయిన్‌గా స్థిరపడటమే కాకుండా అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్న ప్రథమ దక్షిణాది నాయిక స్థాయికి ఎదిగింది. నేటికి టీవీ సీరియల్స్‌లో అడపా తడపా నటిస్తున్న జానకిని హైదరాబాద్‌లో డాక్టరు ఐ భవాని నిర్వహించిన ‘అభినందన’ సత్కారంలో అలనాటి గవర్నర్ శంకర్‌దయాళ్ శర్మ
సన్మానిస్తున్న అరుదైన చిత్రం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717