AADIVAVRAM - Others

కార్చిచ్చుతో వ్యాపించే మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెబుతుంటే చాలా వింతగా ఉంది కదూ.. నిజమండీ ఈ మొక్కలు కార్చిచ్చుతో వ్యాపిస్తాయి. పైరోపైటిస్ అనే వృక్షజాతికి చెందిన మొక్కలు అగ్నిని తట్టుకునేలా రూపాంతరం చెందాయి. పైరోపైటిస్ అంటే ప్రాచీన గ్రీకు భాషలో ‘అగ్ని మొక్క’ అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఈ మొక్కలు విస్తరించడానికి, మనుగడ సాగించడానికి వీటికి మంటలు కూడా అవసరం. సహజసిద్ధంగా మంటలు పుట్టించే ఈ చెట్లు.. మండే స్వభావమున్న నూనెలు, జిగుర్లను ఉత్పత్తి చేస్తాయి. ఎండుటాకులు, బెరళ్లను రాలుస్తాయి. ఇవి చాలా సులభంగా భీకరమైన కార్చిచ్చులను రాజేయగలవు. అగ్గి రేగినప్పుడు యూకలిప్టస్ వంటి చెట్లు, కొన్ని రకాల దేవదారు చెట్లు వృద్ధి చెందుతాయి. ఈ అగ్నిగుండం నుంచి వెలువడే వేడి.. ఈ చెట్ల బీజ కోశాలను ఉత్తేజితం చేస్తుంది. మంటల్లో కాలిపోయిన నేల నుంచి పునరుజ్జీవనం కోసం ఇతర మొక్కలు తంటాలు పడుతుంటే.. అదే నేల నుంచి ఈ చెట్లు కొత్త మొలకలు వేస్తూ పెరుగుతాయి. పైగా పెద్ద వృక్షాలు చాలావరకు కాలిపోవడం వల్ల.. అడవి నేలపై దొరికే అదనపు వెలుతురును ఈ కొత్త మొలకలు అందిపుచ్చుకునే వీలు కలుగుతుంది.
జనపనార, సోయా
అణుధార్మికత జీవకణాలను ధ్వంసం చేస్తుంది. డీఎన్‌ఏను దెబ్బతీస్తుంది. కాబట్టి ఏదైనా అణుప్రమాదం జరిగిన తర్వాత మొక్కలు బతికి బట్టకట్టడం అసాధ్యమని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పుడూ అలాకాదు. పరిస్థితుల ప్రభావాలను తట్టుకుని నిలబడటం ప్రకృతి అందరికీ ప్రసాదించిన వరం. అలా కొన్ని మొక్కలు పరిస్థితులకు తమకు అనుగుణంగా మార్చుకుని, కలుషిత వాతావరణంలో కూడా వికసించేలా జనపనార, సోయా చిక్కుడు వంటి మొక్కలు తమ జీవ నిర్మాణాన్ని రూపాంతరం చేసుకోగలవని గుర్తించారు. అణుధార్మిక ప్రమాధాలను తట్టుకోగలిగే ఈ సామర్థ్యం.. భూమిపై చాలా అధిక అణుధార్మిక స్థాయిలు ఉన్న లక్షల సంవత్సరాల కిందటే అభివృద్ధి చెంది ఉండవచ్చునని పరిశోధకులు నమ్ముతున్నారు.
సైలెన్స్ స్టెనోఫిలా
ఎంతోకాలం కిందట అంతరించిపోయిన ఒక జీవికి రష్యా పరిశోధకులు మళ్లీ ప్రాణం పోశారు. ఒక ఉడుత 32,000 సంవత్సరాల కిందట నేలలో పాతిపెట్టిన గింజలను ఉపయోగించి వారు దీనిని సాధ్యం చేశారు. శీతల వాతావరణంలో ఉండగల ఒక పూల మొక్క సైలెన్స్ స్టెనోఫిలా. మంచు యుగానికి చెందిన ఈ మొక్క ఆనవాళ్లు సైబీరియాలో ఘనీభవించిన నది ఒడ్డున లభించాయి. శాస్తవ్రేత్తలు ఆ గింజల నుంచి కణజాలాన్ని సేకరించి, దాన్ని ఉపయోగించి కొత్త మొక్కలను పుట్టించారు. అవి వెంటనే తమకు తాము పునరుత్పత్తి కొనసాగించాయి. ఆర్కిటిక్ పెర్మాఫ్రాస్ట్ (శాశ్వత మంచు)లో దాగి ఉన్న అవశేషాల నుంచి.. అంతరించిపోయిన చాలా వృక్ష జాతుల పునరుద్ధరణకు ఇది ఆరంభమని నిపుణులు ఆశిస్తున్నారు. *