AADIVAVRAM - Others

నాటి వైభవానికి నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ స్టేట్ నిజాం ప్రభుత్వంలో ఎన్నో అద్భుత కళాఖండాలు, కట్టడాలు నేటికీ ప్రజల మనసుదోచి మళ్ళీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. లక్షల మంది పర్యాటకులు నిజాం ప్రభుత్వ కట్టడాలను చూసి తరిస్తున్నారు. అందులో గోల్కొండ, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, హిందు భవన్, సెంట్రర్ లైబ్రరీతో పాటు సుమారు 50 వరకు కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ప్రజల మనుసు దోచుకొని తనివి తీరా చూడాలనీ అనిపిస్తున్నాయి. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోనె్మంట్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఒక్కటి సుమారు రెండు వందల చరిత్ర కల్గిన అద్భుతమైన ప్రకృతి అందాలు, యూరోపియన్ కట్టడాలతో అందరినీ అకట్టుకుంటుంది రాష్టపతి నిలయం. బయటి నుండి చూస్తే ఒకే భవనంగా కనిపించే రాష్టప్రతి నిలయంలో మూడు వేరు వేరు భవనాలు, 20 ప్రత్యేక గదులు, సెక్యూరిటీ గదులు, మూడు భవనాలకు కల్సి భూగర్భంలో ఒకే వంట గది ఉండటం ఈ రాష్ట్రపతి నిలయం ప్రత్యేకత. ఇలాంటిది దేశంలో ఇంకా ఎక్కడ లేదనీ చరిత్రకారులు చెప్పుతున్నారు. నిజాం ప్రభువు పాలనలో ఐదవ నిజాం నగరానికి దూరంగా విశ్రాంతి తీసుకోవటానికి అన్ని హంగులతో 98 ఎకరాలలో నిర్మించారు. ఇందులో ప్రధాన భవనం సుమారు ఐదెకరాలలో ఉండగా మిగిలినది పూలు, పండ్ల తోటలు ఏర్పాటు చేశారు. నిజాం విశ్రాంతి సమయంలో శత్రువులు దాడి చెయ్యకుండా 98 ఎకరాల చుట్టు, 50 అడుగుల ఎత్తు ప్రహరీ గోడ నిర్మించారు. నిజాం ప్రభువులు సికింద్రాబాద్ ప్రాంతాన్ని అయుధాలు దాచే ప్రాంతంగా బ్యారెక్సులు నిర్మించారు. అందుకే ఉర్దూలో సికింద్రాబాద్ ప్రాంతాన్ని ( లస్కర్ )గా పిలిచేవారు లస్కర్ అంటే ఆయుధాగారం అనే అర్థం. ఐదవ నిజాం కాలం నుండి ప్రతి ఏటా వేసవికాలంలో నిజాం ప్రభువులు విడిది కోసం బొల్లారం వచ్చేవారు. మారిన పరిస్థితుల్లో హైదారాబాద్‌లో కూడా బ్రిటీష్ వారు నిజాం పరిపాలకులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కోఠి నుండి సికింద్రాబాద్ వరకు బ్రిటీష్ వారికి నిజాం అప్పగించారు. నిజాం ఆయుధాగారాలు అన్ని బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారు. అందమైన భవనంపైన బ్రిటీష్ వారి కన్ను పడింది. దానిని నిజాం ప్రభుత్వం నుండి తీసుకొని 1860 ప్రాంతంలో అందమైన భవనాన్ని బ్రిటీష్ రెసిడెన్సీగా మార్చుకొని అక్కడి నుండి పరిపాలన సాగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం ప్రాంతం భారతదేశంలో విలీనం కాకపోవటంతో అప్పటి భారత ఉపప్రధాని సర్దార్ వల్లభబాయి పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలోలో భాగంగా మూడు రోజులు ఏకధాటిగా యుద్ధం చేసి భారత సైనికులు బొల్లారంలోని బ్రిటీష్ రెసిడెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలిఖాన్ బొల్లారంలోని మిలటరీ గ్రౌండ్‌లోకి వచ్చి భారత ఉపప్రధాని సర్దార్ వల్లభబాయి పటేల్ ముందు లొంగిపోయారు. బ్రిటీష్ వారు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ ఐన బ్రిటీష్ రెసిడెన్సీని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన (తెలంగాణ) హైదరాబాద్ స్టేట్‌కు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని రాష్టప్రతి నిలయంగా 1950 నామకరణ చేసి రాష్ట్రపతి కి దక్షిణాది రాష్ట్ర విడిదిగా ఏర్పాటు చేశారు. భారత తొలి రాష్టప్రతి బాబు రాజేంద్రప్రసాద్ నుండి నేటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వరకు ప్రతి ఏటా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చి 10 రోజుల పాటు ఉండి మద్రాసు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో జరిగే ప్రధాన కార్యక్రమాలలో పాల్గొని తిరిగి వెళుతున్నారు.
ప్రకృతికి నిలయం రాష్ట్రపతి భవనం
95 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా అన్ని చోట్ల పూలు పండ్ల చెట్లను పెంచుతున్నారు. అయితే గతంలో కేవలం రాష్ట్రపతులుగా ఉన్న వారు విడిది కోసం వచ్చి వెళ్ల్లేవారు కాని 2009లో అప్పటి రాష్ట్రపతి గా ఉన్న ప్రతిభా పాటిల్ 150 రకాల హర్బల్ వైద్యానికి ఉపయోగపడే మొక్కలు, పండ్ల మొక్కలు నాటించారు. దీనితో రాష్ట్రపతి నిలయానికి మరింత అందాలను తీసుకువచ్చింది. చిన్న చిన్న పూల మొక్కలనుండి రెండు వందల సంవత్సరాల మర్రిచెట్లు, చింత, మామిడి చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి.
యూరోపియన్ భవన నిర్మాణ అందాలు
ఐదవ నిజాం కాలంలోని ఈ భవనాన్ని యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. బయటి నుండి చూస్తే ఒక్కటే భవనంగా కనిపించే ఇందులో మూడు వేరు వేరు భవనాలు ఉన్నాయి మూడు భవనాలను కలుపుతు కారిడార్ పై భాగంలో ఉంది విశాలమైన 20 గదులు, లైబ్రరీ, మిని సినిమాథియేటర్‌లు ఉన్నాయి. ఒక్క గదికి మరోగదికి పోలికలు లేకుండా వివిధ రకాలైన ఆర్కిటెక్చర్‌తో ఎంత చూసిన తనివితీరని అందాలతో మరియు దానికి తగిన ఫర్నిచర్ ఏర్పాటు చెయ్యటంతో సందర్శకులు ముగ్ధులగుతున్నారు. ప్రతి భవనంలో దర్జా, దర్పణంతో కూడిన అందాలు ఉట్టిపడుతున్నాయి. వచ్చిన రాష్ట్రపతులు నాయకులను అధికారులను కలవటానికి దర్బార్ హాల్ ఉండగా ప్రతి భవనాన్ని కలుపుతు పెద్ద పెద్ద కారిడార్‌లు ఉన్నాయి. సుమారు 100 మంది ఒకేసారి భోజనము చెయ్యకల్గిన భారీ డైనింగ్ టేబుల్ ఉంది. అన్ని కూడా భారతదేశంతోపాటు ఇతర దేశాలలో కళాఖండాలను తలపించే విధంగా కొత్త తరహాలో పింగాణీ వస్తువులతో చూపర్లను ఆకట్టు కుంటున్నాయి.రాష్ట్రపతి నిలయంలోకి రెండు ప్రధాన గేట్లు ఉన్నాయి. ఒక్కటి వివిఐపిలకు కాగా రెండవది అధికారులు, సాధారణ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు.
పది సంవత్సరాలుగా ప్రజల సందర్శన
బొల్లారంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి నిలయం ఉన్నా ఎప్పుడు పూర్తిస్థాయిలో మూడంచెల సెక్యూరిటీ ఉంటుంది. రాష్ట్రపతులు వచ్చిపోయిన తర్వాత తిరిగి మూసి వేసేవారు కాని 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రజల సందర్శన కోసం వారం రోజుల పాటు ఉంచాలనీ ఆదేశించారు. నాటి నుండి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రాష్ట్రపతి నిలయానికి సందర్శకులకు అనుమతించటంతోనే భవనంలోని పండ్ల, పూల, హర్బల్ మొక్కల గురించిన చరిత్ర తెలిసింది. ప్రతి ఏటా సుమారు 10 వేల మంది సందర్శకులు వస్తున్నారు. చాలా వరకు పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి పిక్‌నిక్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రతి ఏటా సికింద్రబాద్ బొల్లారం రాష్ట్రపతి బొల్లారంలో దేశ ప్రథమ పౌరుడు కుటుంబ సమేతంగా రావటం పదిరోజుల విడిది తర్వాత మరో పదిరోజులు పాటు సందర్శకులను అవకాశం ఇవ్వటంతో బొల్లారం - అల్వాల్ పరిసర ప్రాంతాలు అన్ని భారీ స్థాయిలో సెక్యూరిటీ భద్రతా వలయం ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 20 నుండి 26 వరకు రాష్ట్రపతి అధికారిక పర్యటన కోసం వస్తున్నారు

-ఆస శ్రీరాములు 9440037196