Others

పరిభ్రష్ట రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు దేశంలో చెలరేగుతున్న పరిస్థితులు అత్యంత భయానకంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. మనసున్న వారికి కనులు చెమరిస్తాయి. హృదయం దైన్యంతో కరిగిపోతుంది. పత్రికలకు ఏమి చేటుకాలం వచ్చిందో జ్వాలాభీలమైన దృశ్యాలు చూపుతూ ప్రతిపక్ష పార్టీలు చేస్తే సిగ్గూ యెగ్గూ లేని రాజకీయమ్మన్యులు బరితెగించి వదరే శాంతియుత ప్రదర్శనలపై పోలీసు జులం, అధికార బలం అనే ప్రకటనలు ప్రచురిస్తున్నాయి?! శాంతియుత, సత్యాహింసల సిద్ధాంత నిరసన, భావస్వేచ్ఛ అని అరుస్తూ, రాళ్ళు రువ్వటం, పోలీసులపై తమ ప్రతాపం చూపటం, ప్రజల ఆస్తిపాస్తులకు, ప్రభుత్వ ప్రజావ్యవస్థలకు నిప్పుపెట్టటం ఎందుకు? మహాత్మాగాంధీ పేరు జపిస్తారు! ఆయన ఇటువంటి నిరసన ప్రదర్శనలు చేశాడా? ప్రోత్సహించాడా? అశ్చరభ దశ్శరభలు చిద్విలాసంగా ఆలకించాడా?
నిజమే! ఒక వర్గం ప్రజల శరణార్థులను మాత్రమే పౌరసత్వ చట్టానికి అర్హులను చేయడం, జాతీయ పౌర మహాజాబితా గూర్చి ఆలోచించటం, ఎవరికైనా సంతాప కారణమైతే ఆ విషయాన్ని ప్రజాసమీకరణ ద్వారా బలంగా విన్పించవచ్చు. కాని విద్యార్థుల ప్రమేయం ఎందుకు? హింసాపూరిత దౌర్జన్య నినాదాలెందుకు? చాలా పత్రికలు, అవి ఇంగ్లీషు కాని, దేశ భాషలవి కాని ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టటమే కాని, ఇది తగదని మూక దౌర్జన్యాలను గూర్చి బాధపడవేమి? హితం, సూనృతం ఆలోచించవేమి? ప్రభుత్వ చర్యలను మందలించ వలసిందే, సహేతుకంగా చూపవలసిందే? ఎవరూ కాదనరు. ఇళ్ళు తగలపెట్టి చుట్ట నిప్పుకోసం చూడటం తప్పు. జాతీయ పౌరసత్వ నిర్ధారణ చట్టం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కదా! సరే! కొన్ని రాష్ట్రాలవారు దానిని అమలుచేయం గాక, చేయమంటున్నారు? దానికేం! హింస, అలజడి, ఆందోళన, రెచ్చగొట్టటం అవసరమా? అమలుచేయకపోతే పర్యవసానాలు తరువాత నింపాదిగానే తర్కించుకోవచ్చు. ఇప్పుడింతగా ప్రజల, ప్రభుత్వ పరివార ధన మాన ప్రాణ నష్టం అక్కరలేదు. ఇది చాలా ఘాతుకం.
మాటవరసకు, వాద సరళికి ప్రతిపక్ష ధూంధాం పార్టీలన్నీ కలసి చెల్లియో, చెల్లకో మోడీ ప్రభుత్వంపై విశ్వాస రాహిత్య తీర్మానాన్ని ఇంతకన్నా మిన్నూ మన్నూ అదరిపోయేట్లు నెగ్గించుకొంటే నెగ్గించుకుంటారేమో చూడాలి. అప్పుడే సకల వికల పార్టీలు తమ పగటికలలు సాకారం చేసుకోవటానికి రాష్టప్రతి భవనాన్ని ముట్టడించి, ధర్నాలుచేసి మాకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం తప్పదు లేకపోతే మాఅంతట మేమే ఏర్పాటుచేసుకునే (కొనే)దాకా పరిస్థితులను విషమింపచేయవద్దు అని ఉల్లాకు (దీనినే అచ్చతెలుగులో తాఖీదు! అంటారేమో). జారీచేస్తారనే అనుకుందాం. మనకు రాజ్యాంగమంటూ ఉందాయె! ‘ప్రతి’వారూ (అంటే ప్రతిపక్షంవారు) దానిమీద ముక్తకంఠంతో శపథిస్తున్నారాయె! ప్రజాస్వామ్యాన్ని వథిస్తున్నారాయె! (‘జైరాం’రమేష్, శశిధరూర్, పళనివేలు చిదంబరం లాంటి అమాంబాపతు.. ప్రతి నాయకులు). మేం అందరం కలసి ఘనత వహించబోయే సర్కారును ఏర్పాటుచేయబోతున్నాం అని నినద భీషణంగా రాష్టప్రతిని నిగ్గదీస్తారే! అనుకుందాం. మహారాష్టల్రో ఎన్‌సిపి, శివ(్ఛ)సేన, కాంగి‘రేసు’ ఏర్పాటుచేయలేరా! అట్లా మేమెందుకు వేర్పాటు చేయరాదు అంటే, ఇక మరింత విధ్వంసం, ప్రాణి నష్టం జరుగుతుందేమోనని చకితసంశయ దళారుడై మానవీయ రామనాథ కోవింద మహాశయులు సకల ప్రతిపక్ష కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు (దుస్సంధి-తప్పులేదు- వాళ్ళ సంధి కూడా అటువంటిదే కదా! (సంధి ప్రేలాపనలని తెలుగులో ప్రయోగముంది) అంగీకరిస్తారే అనుకుందాం. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? రాహులు మహాశయులా? శరద్‌పవార్ మానవీయులా? ఒక అసలు ప్రధానమంత్రి, ఇంకొక మహిళా ప్రధానమంత్రి- జెండర్ ఈక్వాలిటీ (అంటే లింగ సమానతా?) ఉండాలని అన్నా అనవచ్చు. ఏచూరి సీతారాంగారే మవుతారు? సమాచార పౌర సంబంధశాఖ నెంచుకుందురేమో! అసదుద్దీన్ ఓవైసీగారికి రక్షణశాఖ, డేనియాల్ రాజాగారికి (అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి) విదేశాంగం, బృందాకారత్‌గారికి స్ర్తి శిశు సంక్షేమం, మమతాబెనర్జీగారికి స్పీకరు (అప్పుడెప్పుడో ఇంద్రజిత్‌గుప్తాగారికి రక్షణ శాఖ, సోమనాథ చటర్జీగారికి స్పీకరు పదవి అప్పజెప్పారు కదా!) ఉద్ధవ్‌థాక్రే గారికి విత్తశాఖ, మొల లోతు దుఃఖంలో మోకాలి బంటి హాస్యం అన్నట్లు ఈ సకల ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ నిర్వహణ ప్రహసనం ప్రస్తావన క్షమార్హం.
ఎందుకీ వేదనాగాథ బాధ అంటే మహారాష్టల్రో రాజకీయ తెరమీద నడుస్తున్న ప్రహసనం- మన వీరేశలింగం, చిలకమర్తి ప్రహసనాలకన్నా మించిపోబట్టే. ఉద్ధవ్‌థాక్రేగారి పుత్రరత్నం ఆదిత్యథాకరేగారి కేమిస్తారో! బులిపిస్తారో!
శివసేన, ఎన్‌సిపి, కాంగిరేసువారి మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ తర్వాత ఈ దేశంలో ఏం జరిగినా జరగవచ్చు. చూడండీ! ఆరునెలలు మేము, ఆరు నెలలు మీరు గద్దెనెక్కుదాం! అన్న దట్టింపు, పట్టింపు కాదన్నందుకే కదా! బిజెపి, శివసేనల ప్రణ(ళ)య లీల విడాకుల పాలైంది! బిజెపివారికి కూడా చిత్త వైకల్యంవల్లనే కదా! ఈ పుట్టి మునిగింది.
ఆదిత్య థాకరేకు 28 ఏళ్లు. ఆయన మహారాష్ట్ర వంటి విశాల, భారతీయ వాణిజ్య రాజధాని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పంతగించినందువల్లనే కదా! బిజెపి సేన సయోధ్య చెడింది. ఏమి అనుభవం, ఏమి త్యాగం, ఏమి విజ్ఞత, ఏ సామర్థ్యం, ఏ శక్తి ఉన్నదని 28 ఏళ్ళ (అ) రాజకీయుడు ముఖ్యమంత్రి అవుతాడు? అని రామరామ! ఒక్క పత్రిక (30, 40 పత్రికలు మూడునాలుగు వారాలుగ వేషించాను) అయినా! వాకొనలేదు! ఇంతకన్న భారతదేశ రాజకీయ పరిభ్రష్టత ఇంకొకటి ఏమైనా ఉంటుందా?

- అక్కిరాజు రమాపతిరావు