Others

నిర్మాణాత్మక పనులే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన సహాయులవల్ల కానీ, ఉప సంపాదకులవల్ల కానీ, రిపోర్టర్ల వల్ల కానీ, కంపోజిటర్‌వల్ల కానీ, ప్రూఫ్ రీడరువల్లకానీ తప్పు జరిగితే, సాంకేతిక కారణాలవల్ల పత్రిక విడుదలలో ఆలస్యం జరిగితే దానికి సంపాదకుడే బాధ్యత వహించాలని ఆయనకు తెలుసు. ఆయన సంపాదకత్వంలోని ఏ పత్రికా ఆయన భారతదేశంలో ఉన్నా, బర్మాలో వున్నా, శ్రీలంకలో ఉన్నా, ఇంగ్లాండులో వున్నా ఆయన రాయవలసిన దానివల్ల ఎప్పుడూ ఆలస్యంగా విడుదల కాలేదు.
గాంధీలా తీరిక లేకుండా ఉండే మనిషికి పత్రిక సంపాదక బాధ్యతలు వహించడం అంత తేలిక కాదు. 70 సంవత్సరాల వయసులో కూడా హరిజన్ పని పూర్తిచేయడానికి ఆయన అర్థరాత్రి ఒంటిగంటకు లేవాల్సి వచ్చేది. ఎంతో పని భారం ఉన్నా కూడా ఆయన చాలా రాయాల్సి వచ్చేది. ఆయన తరచుగా నడుస్తున్న రైలులో కూడా రాసేవాడు. ఆయన ప్రసిద్ధ సంపాదక వ్యాసాలు కొన్నిటిక్రింద ‘రైల్లోంచి’ అని ఉంటుంది. జబ్బు చేసినప్పుడు కూడా ఆయన వారానికి నాలుగు వ్యాసాలు రాసేవాడు.
భారతదేశంలో ఆయన ఏ పత్రికనూ నష్టాలలో నడపలేదు. ఆయన ఇంగ్లీషు, దేశ భాషా పత్రికలు కలిపి 40వేల ప్రతులవరకూ అమ్ముడుపోయేవి. ఆయన జైలులో ఉన్నపుడు పత్రికల అమ్మకాలు 3వేలకు పడిపోయాయి. భారతదేశంలో మొదటి కారాగారవాసం తర్వాత బయటకు రాగానే ఆయన పత్రికల్లో తన ఆత్మకథను వారం వారం సీరియల్‌గా ప్రచురించడం ప్రారంభించాడు.
అది మూడు సంవత్సరాలపాటుకొనసాగి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. తన ఆత్మకథను ఉచితంగా అచ్చువేసుకోవడానికి భారతదేశంలోని కొన్ని పత్రికలకూ అనుమతిచ్చాడు. ఆయన జైల్లో ఉండగానే హరిజన్ వారపత్రికను ప్రారంభించాడు. నవజీవన్‌లాగే దీని వెల కూడా అణా మాత్రమే. అందులో కేవలం అంటరానితనం నిర్మూలనకు సంబంధించిన వ్యాసాలు మాత్రమే ఉండేవి. దాన్ని మొదట హిందీలో ప్రచురించారు. జైలు నుంచి వారానికి మూడు వ్యాసాలు రాయడానికి గాంధీని అనుమతించారు. హరిజన్‌ను ఆ్లంగ్లంలో కూడా ప్రచురించాలని ఒక స్నేహితుడు ప్రతిపాదించినపుడు, ‘‘పూర్తి సన్నద్ధత లేనిదే ప్రచురించడానికి నేను అంగీకరించను. అనువాదాలు కచ్చితంగా ఉండాలి, తగినంత ఆసక్తి గల సమాచారం ఉండాలి. మొక్కుబడిగా సిద్ధం చేసిన ఆంగ్ల పత్రికను ప్రచురించడం కంటే, హిందీ ప్రచురణతో సరిపెట్టుకోవడం మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా అది స్వయంపోషకంగా తయారైతే తప్ప నేను దాన్ని నడపడానికి అంగీరించను’’ అని గాంధీ బదులిచ్చాడు. మొదటిగా 10వేల ప్రతులు ప్రచురించాలనీ, మూడు నెలల్లో స్వయం పోషకత్వం సాధించాలనీ నిర్ణయించారు. అది రెండు నెలల్లోనే స్వయం పోషకత్వం సాధించింది. తర్వాత కాలంలో అది ప్రముఖ వార్తాపత్రిక అయింది. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం, తెలుగు, ఒరియా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ప్రచురితమయ్యేది. ప్రజలు దాన్ని ఆహ్లాదం కోసం కాక సూచనల కోసం చదివేవారు. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, గుజరాతీలలో గాంధీ వ్యాసాలు రాసేవాడు.
పత్రికల్లో గాంధీ ఎప్పుడూ సంచలనాత్మక అంశాలు ప్రచురించేవాడు కాదు. నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి, సత్యాగ్రహం, అహింస, ఆహారం, ప్రకృతివైద్యం, హిందూ ముస్లిం ఐక్యత, అంటరానితనం, నూలు వడకడం, ఖాదీ, స్వదేశీ, గ్రామీణ పరిశ్రమలు, మద్యనిషేధం, విద్యావిధానాన్ని పునఃసమీక్షించడం గురించి, జాతీయ లోపాలను సరిచేయడం గురించి ఆయన తరచుగా వాదించేవాడు.
ఆయన పని రాక్షసుడు. ఆయన కార్యదర్శి మహాదేవ దేశాయి. రైలు పెట్టేలో గుమిగూడిన జనాల నుంచి తప్పించుకొనేందుకు మరుగుదొడ్టిలో కూర్చుని పని పూర్తి చేయాల్సి వచ్చేది. ఆయన రాసిన లేఖలు , వ్యాసాలను తగిన సమయంలో పోస్టయ్యేలా చూసేందుకు సహాయకులు అన్ని రైలు బళ్ల వేళలు, పోస్టల్ క్లియరెన్సువేళలు తెలుసుకొని సిద్దంగా ఉంచాల్సి వచ్చేది. ఒకసారి గాంధీని, ఆయన వ్యాసాలనూ తీసుకు వెళుతున్న రైలు ఆలస్యంగా నడుస్తోంది.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614