Others

ఇక హైదరాబాద్ అంతర్జాతీయ నగరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హై దరాబాద్ నగరం దూసుకుపోతోంది. అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ నగరంగా అవతరిస్తోంది. మహార్దశ అంటే ఇదే!... త్వరలో ప్రపంచస్థాయి వైమానిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నదని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు- ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన అమెరికా ఉప సహాయ మంత్రి జోయల్ స్టార్ ముందు పేర్కొన్నారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడి హెలికాఫ్టర్ సైతం హైదరాబాద్‌లో తయారవుతోందని హర్షధ్వానాల మధ్య వెల్లడించారు.
నగర శివారులోని ఆదిభట్లలో ఏరోస్పేస్ పార్క్ పనిచేస్తోందని, అంతేగాక 25 వైమానిక సంస్థలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటికితోడు వైమానిక- రక్షణ రంగాలకోసం రెండు ప్రత్యేక ‘సెజ్’లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ రక్షణ రంగ ఉత్పత్తుల ‘హబ్’గా అవతరించబోతోంది. ఎఫ్-16 వంటి యుద్ధ విమానాల విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇలాంటి హబ్‌కు హైదరాబాద్ నగరం అనువైనదని అంతర్జాతీయ- జాతీయ ప్రీమియర్ సంస్థలు గుర్తించాయి. అందుకే ఎన్నో ప్రముఖ సంస్థలు భారీ పెట్టుబడులతో హైదరాబాద్ ద్వారంలోకి అడుగుపెడుతున్నాయి.
ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్-ఐపాస్ విధానం మంచి ఫలితాలనిస్తోంది. సరళతర వాణిజ్య నిర్వహణకు, పరిశ్రమల ఏర్పాటుకు ఆ విధానం ఎంతో తోడ్పడుతోంది. అంతేగాక అనువైన వాతావరణం, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో అగ్రభాగాన నిలవడం కారణంగా అనేక పరిశ్రమలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. గత ఐదేళ్ళలో 11వేలకు పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. లక్షలాది మందికి ఉపాధి లభించిందని, పరోక్షంగా మరెందరో ఉపాధి పొందుతున్నారని తెలుస్తోంది.
నగరంలో 25 అంతర్జాతీయ వైమానిక సంస్థలు ఉండటం గమనార్హం. మరిన్ని కొత్త సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. డ్రోన్ల తయారీ, ఎస్-92 హెలికాఫ్టర్ల తయారీ, సూపర్ హెర్క్యూలస్ ఎయిర్ లిఫ్టర్ సి-130 జే లాంటి భారీ విమానాల విడిభాగాలు, ఇంజన్లు ఇక్కడే తయారుకావడమంటే అద్భుత పరిణామం గాక ఏమవుతుంది? నగరంలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ ఒక పార్శ్వంలో దూసుకుపోతుంటే, టి-హబ్ మరో పార్శ్వంలో దూసుకుపోతోంది. వాటి ఫలితాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండటం గమనార్హం.
‘‘గ్రోత్ ఇంజన్లు’’గా పిలువబడే అన్ని రంగాలు హైదరాబాద్‌లో కొలువైనాయి. అమెజాన్ మొదలుకుని అనేక అగ్రశ్రేణి సంస్థలు ఇక్కడ తమ ప్రపంచస్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ- ప్రైవేట్ రంగ సంస్థలు పరస్పర పూరకాలుగా ఇక్కడ పనిచేయడం గొప్ప అంశం. ప్రైవేట్ రంగంలో రక్షణ రంగ పరికరాలు తయారీ జరగడం ఇందుకు ఉదాహరణ. వీటి అనుబంధ సంస్థలు పరిఢవిల్లడం... ‘‘ఎకో సిస్టం’’గా ఎదగడం ఓ అద్భుతంగా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన బోయింగ్, జి.ఈ.లాంటి సంస్థలు ఇక్కడనుంచి పనిచేసేందుకు ముందుకు రావడం నిజంగానే అద్భుతం.
కొన్ని వారాల క్రితం సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వెంచర్ క్యాపిటలిస్టు కన్వల్ రేఖి హైదరాబాద్‌ను సందర్శించి ఐటి మంత్రిని కలిసి ఐటి రంగంలో నగరం ఆసియాలోనే నెంబర్ వన్‌గా ఎదిగే అవకాశాలున్నాయని, బెంగళూరు నగరాన్ని సైతం అధిగమించి అభివృద్ధిని సాధించగలదని కితాబునిచ్చారు.
ఇప్పటికే ఇంటెల్, ఆపిల్, గూగుల్, క్వాల్‌కామ్, మైక్రాన్, మైక్రోసాఫ్ట్, ఉబర్ లాంటి అగ్రశ్రేణి, ప్రపంచస్థాయి సంస్థలు తమ కార్యక్రమాల్ని ఇక్కడ కొనసాగిస్తున్నాయి. కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, రంగాల్లోనూ పరిశోధన సంస్థలు ఇక్కడ ఆవిర్భవించాయి.
వినోద రంగం, విమాన రంగం... ఏ రంగం ఏదైనా హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంతో పోటీపడుతోంది. మంచి ‘‘ఎకో సిస్టం’’ ఏర్పడిందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు.
ఈ వాతావరణం కారణంగానే కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఒక్కో సంస్థ లక్షల అడుగుల్లో తమ కార్యాలయాలను ప్రారంభించి అబ్బురపరుస్తున్నాయి... ఆకర్షిస్తున్నాయి. తమ అంతర్జాతీయ స్థాయిని ప్రదర్శిస్తున్నాయి. కళ్లుచెదిరే కట్టడాలు వస్తున్నాయి. పని సంస్కృతిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. తదనుగుణంగా సంబంధిత వ్యాపారాలు మారుతున్నాయి. ఒకప్పుడు హెచ్.ఎం.టి, ఆల్విన్, ప్రాగాటూల్స్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలతో వెలుగొందిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సంస్థల కార్యాలయాలు, పరిశోధన, తయారీ సంస్థలతో దేదీప్యమానంగా... మరో సిలికాన్ వ్యాలీగా వెలుగులీనుతోంది.
కెనడా పెట్టుబడులు
అమెరికా ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో అంతర్జాతీయ వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రకటనకు ఒకరోజు ముందు కెనడాలోని అల్‌బెర్టా రాష్ట్ర వౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపారు. ఇదో గొప్ప పరిణామం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కెనడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టిఎస్ ఐపాస్ విధానాన్ని ప్రసాద్ పండా కొనియాడారు.
వికేంద్రీకరణ
తెలంగాణ అంతటా అభివృద్ధి పవనాలు వీయాలని, ఆయా ప్రముఖ పట్టణాల్లో పారిశ్రామిక ప్రగతికి పాటుపడతామని మంత్రి కేటిఆర్ చాలా సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా వరంగల్‌లో అతిపెద్ద జౌళి పార్కు ప్రారంభం. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్వన్ ఆ పార్క్‌లో భారీ పరిశ్రమను ప్రారంభించనున్నది. కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు నాంది పడింది. మరిన్ని సంస్థలను ఆహ్వానించేందుకు గాను జిల్లాల్లో సదస్సులు- సమ్మేళనాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సదస్సులకు జాతీయ- అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించబోతున్నారు. ఆహారశుద్ధి, జౌళి, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగాల్లో అనేక పరిశ్రమలు తెలంగాణ జిల్లాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దశాబ్దం క్రితం ప్రారంభమైన శంషాబాద్ (రాజీవ్‌గాంధీ) అంతర్జాతీయ విమానాశ్రయం, దాని అనుబంధ సంస్థలు- శిక్షణా సంస్థలు కొత్త వనె్నను తీసుకొచ్చాయి. ఈ విమానాశ్రయం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీపడుతోంది. అంతర్జాతీయ టెర్మినల్‌లో అద్భుత సాంకేతిక పరిజ్ఞానం కొలువుదీరింది. అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది.
ఇక మెట్రోరైల్ హైదరాబాద్ ముఖ చిత్రానే్న మార్చేసింది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే ఆలోచనలు చేస్తున్నారు. రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలకు వెళ్ళేందుకు మెట్రో ప్రయాణం అంతర్జాతీయ ప్రయాణాన్ని తలపిస్తోంది. మరిన్ని కిలోమీటర్ల విస్తరణ జరిగే అవకాశాలున్నాయి.
నాలెడ్జ్ సిటీ, జినోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ (త్వరలో ప్రారంభం కానున్నది) ఐటి పార్క్‌లు, సెజ్‌లు, దుర్గంచెరువు తీగల వంతెన... ఇట్లా ఒకటి- రెండా అన్నీ అంతర్జాతీయ అద్భుతాలే హైదరాబాద్‌లో కొలువుదీరాయి. గ్రోత్ ఇంజిన్‌కు నమూనాగా హైదరాబాద్ ఆవిర్భవించింది. ఇందుకనుగుణమైన ‘‘మైండ్ సెట్’’ సామాజిక విప్లవం... విప్లవం... మార్పు ఆశించే మేధావుల్లో, తమనితాము తత్వవేత్తలుగా ప్రకటించుకునే కవులు-రచయితల్లో, సంస్కర్తల్లో ఉందా?... అనేది ఇప్పుడు కోటి రూకల ప్రశ్న.

- వుప్పల నరసింహం, 9985781799