Others

సత్యం శివం సుందరం (సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమణియమ్ము విశాలమై యల మహారాష్టమ్మ్రునన్ బుణ్యతీ
ర్థ మహిష్‌టమ్మగు నయ్యిలాపురము నన్‌భ్రాజిల్లు ఘశే్మశ్వరున్
యమ దుర్దశ నిజాంఘ్రిసేవకు మహోదారాత్ము దారాత్ము మం
జీమ సర్వస్వము జొచ్చెదన్ శరణమున్ సిద్ధాత్మ సర్వస్వమున్

ఫలశ్రుతి
చేతో వీధి దలంతు నిచ్చలు
కృపా స్నిగ్ధాకృతిన్ ద్వాదశ
జ్యోతిర్లింగ మయాక్షరాకృతి
సరశ్శుభ్రాబ్జ హంసాకృతిన్
ప్రీతిస్విన్న షడాననాక్షియుగ
పన్నిర్యన్మహస్స్వీ కృతిన్
నేతి జ్ఞాన నిదాన ముక్తిలలనా
హృష్టాత్మదూతీకృతిన్..

శక్ర నీలావళి చ్ఛవి సొంపుదల పించు మహనీయ కన్యాకుమారి తోడ
కోమలారుణ కరశ్రీ మనోజ్ఞం బౌచుదలకించు పూపచందురుని తోడ
పతిత పావని చ సతతంబు విలసిల్లు మానిత గంగాభవాని తోడ
దుర్మత ధ్వంసనోద్యోగ పావన కళాదక్షవౌ ఫాలనేత్రంబు తోడ

భవ్య నవ్యారుణ ప్రభా భాసమాన
లాలితోన్నత దీర్ఘ జటాళి తోడ
వనె్న మీరిన నిన్ను నే నెన్నగలనె
సత్యశివ సుందరోదర్చి! సర్వమీవె...
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404