Others

నవ్యాంధ్ర అభివృద్ధే ధ్యేయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్రప్రదేశ్‌లో ఓ చారిత్రాత్మకరోజు. అనుకోకుండా ప్రజలందర్నీ ఒక్కసారి ఉలికిపడేటట్లు చేసిన రోజు. ‘3 రాజధానులు! అమరావతిలో చట్టసభలు, విశాఖలో సచివాలయం, కర్నూల్‌లో హైకోర్టు’- అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్. సాయంత్రం సభ ముగుస్తుందనంగా ఒక్కసారిగా జగన్ ఈ బాంబు పేల్చారు. కొందరిని విచారంలోను మరికొంతమందిని ఆనందంలోను ముంచేసిన నిర్ణయం అది. ఓ విధంగా ఓ ప్రాంతానికి ఇది నచ్చని, మింగుడు పడని అంశం. హుటాహుటిన జగన్ ఎందుకు ఈ నిర్ణయం ప్రకటించాడు? ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్‌లో!
రాజధానిగా అమరావతి అంటూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడుగారు గత 5 సంవత్సరాలల పాటు ఊదరగొట్టారు. సింగపూర్, లండన్, బీజింగ్, టోకియో, అమెరికా... ఇలా ఎన్నో ప్రపంచ ప్రసిద్ధిచెందిన నగరాల స్థాయిలో అమరావతిని తీర్చుదిద్దుతానంటూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల్లో ఆశల్ని, స్వర్గాన్ని చూపించాడు. బాహుబలి చిత్రంతో తెలుగు చిత్రాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన దర్శకులు రాజవౌళిగారి సారథ్యంలో అమరావతి గ్రాఫిక్స్ తీర్చిదిద్దారు. రాజవౌళితోపాటు మరికొంతమంది సినీ వేత్తలు ఈ విషయంపై లండన్ లాంటి నగరాల్ని కూడా చూసొచ్చారు. ఆ గ్రాఫిక్స్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి సినిమాల్లా మసాలా కలిపి ప్రజలకు చూపించారు. ఆ సినిమా భ్రమల్లోనే ఆ ప్రాంత ప్రజలు జీవిస్తున్నారు. ఎన్నికలు రావడం బాబుగారి పార్టీ ఘోర పరాజయం చెందడం అందరికీ తెలిసిందే!
రాజధానిగా మరి అమరావతి వుంటుందా, వుండదా అని ప్రజల్లో కాస్తా చర్చ కొనసాగింది. జగన్‌గారు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టి 3నెలలు అయ్యేసరికి రాజధాని గూర్చి బొత్ససత్యనారాయణగారు ఓ వివాదాస్పద అంశాన్ని లేవనెత్తి అనుమానాలకు బీజం వేశారు. ఆయన రాజేసిన అగ్గి 3 నెలలుగా మంటల్నే రేపింది. అన్ని పార్టీల్లోనూ, రాష్టమ్రంతటా ఇదే చర్చ మొదలైంది. కొందరు అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ఘంటా భజాయిస్తే మరికొందరు అమరావతి వుండదు, కట్టడాలకు ఆ నేల పనికిరాదని రీజనింగ్‌ను మొదలెట్టారు. శాసనసభ మరో 4రోజుల్లో ముగుస్తుందంగా, కౌన్సిల్‌లో ఎవరో అడిగిన ప్రశ్నకు బొత్సగారు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ రాజధానిగా అమరావతే అంటూ పేర్కొనడం నిప్పుపై నీళ్ళు చల్లింది. అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
మరి ఆ మరునాడే బొత్సా ఆ విషయాన్ని తిరిగి అనుమానాస్పదంగా మార్చేశాడు. ఆయన ప్రకటనలు అందర్నీ గందరగోళానికి పడేశాయి. ఎందుకంటే రాజధాని విషయాన్ని నిర్ధారించేందుకు జగన్‌గారు నవంబర్ 13వ తారీఖున అర్బన్ ప్లానింగ్‌లో అనుభవమున్న 9 మందితో ఒక ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ నిజానికి 6 వారాల్లో నివేదిక సమర్పించాల్సి వుంది. చివరకు 20వ తారీఖున ఆ కమిటీ తన నివేదికను సమర్పించింది. 27 కేబినెట్ భేటీలో దీనిని సూత్రప్రాయంగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
కమిటీ నివేదిక సమర్పించక ముందే నివేదికలోని అంశాల్ని తన మనసులో మాటగా జగన్ ప్రకటించి వుండాల్సింది కాదు. ఆయన ప్రకటించిన నాలుగు రోజుల్లోనే కమిటీ తన నివేదికను సమర్పించింది. మరి ఈ నాలుగు రోజులు ముందే ఆయన ఎందుకు తొందరపడ్డారు! ఆ కమిటీ నివేదికకోసం యావత్ రాష్ట్రం ఆతృతతో ఎదురుచూస్తున్న సమయంలో ముందుగానే జగన్ సూచన ప్రాయంగా ప్రకటించడం పలు అనుమానాలకు బీజం వేసింది. తన సూచనలనే కమిటీ నివేదిక రూపంలో ఇచ్చిందా? లేక కమిటీ తమ నివేదికను ముందే జగన్‌కు చెప్పిందా? ఇవి ఈరోజు అందరిలో తలెత్తుతున్న సందేహాలు.
20న కమిటీ నివేదిక చూశాక ప్రజల్లో స్పందనలు కన్పించేవి. కానీ జగన్ ముందే ప్రకటించి అలజడికి ఆజ్యం పోశారేమో! ముందే ప్రతిపక్షాలకు ఆయుధాల్ని ఇచ్చాడన్పిస్తుంది. ఆయన ఉద్దేశ్యం, మనసులో భావం సరైందే కావచ్చు. ఏ విషయాన్ని అయినా ప్రకటించే ముందు విధిగా కొంత గ్రౌండ్‌వర్క్ చేయాలి. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాలా ఎత్తులు వేసేవారు. ముందుగా కొన్ని పత్రికలకు లీక్ చేయించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని, తదనుగుణంగా తను స్టాండ్ తీసుకొనేవాడు. తాననుకొన్నది చాలా తెలివిగా అమలు చేసేవాడు. మరి జగన్‌గారికి అలాంటి ఎత్తులు, జిత్తులు తెలీదు. అనుభవం తక్కువ. చంద్రబాబు దగ్గరున్న పి.ఆర్. టీం జగన్ దగ్గర లేకపోవడం కూడా లోపమే! ఒక ప్రధాన నిర్ణయం తీసుకొనేముందు జగన్‌గారు తనకున్న సలహాదారులందరితో చర్చ చేసింటే బాగుండేది. మేధావుల, ప్రముఖుల సలహాలు తీసుకోవాల్సి వుండేది. అఖిలపక్ష సమావేశం పెట్టి ఇతర పార్టీల అభిప్రాయాల్ని కూడా తీసుకుంటే చాలా బాగుండేది.
తెలంగాణా విడిపోయాక ఏర్పడ్డ నన్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు జూన్ 8, 2014లో అత్యంత ఆడంబరంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నించి రాజధాని ఎక్కడుండాలన్న ఆలోచనతో చంద్రబాబు మునిగిపోయాడు. మొదటిసారి విజయవాడ ప్రక్కనున్న నూజివీడులో రాజధానికి అనుకూలం అని ప్రకటించారు. ప్రకటన వెలువడినవెంటనే వేలాది మంది కోటి ఆశలతో అప్పులు చేశో, ఆస్తుల్ని అమ్ముకొనో నూజివీడు ప్రాంతంలోని భూములన్నీ కొనిపెట్టుకొన్నారు. ధరలకు రెక్కలొచ్చాయి. అమ్మిన వారు కోటీశ్వరులయ్యారు. కానీ కొద్ది రోజులకే చంద్రబాబు రాజధానిని అమరావతి అని ప్రకటించారు. నూజివీడు ప్రాముఖ్యత గూర్చి ఆరోజు ఎంతగా లెక్చర్ ఇచ్చాడో అంతకన్నా ఎక్కువే అమరావతి నిర్ణయంలో కూడా చెప్పాడు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నేర్పరి. ఇంకేముంది రాజధాని తిరిగి క్రొత్త ప్రదేశం. నూజివీడులో పొలాలు కొన్న వ్యాపారస్థులంతా లబోదిబోమంటూ దివాళా తీసేశారు. 2015 మార్చిలో జరిగిన కేబినెట్‌లో కొత్త రాజధానికి అమరావతి అని నామకరణం కూడా చేసేశారు. ఇక ల్యాండ్ పూలింగ్ కోసం ఓ క్రొత్త రకం ఎత్తుగడ వేశారు. రైతులు కనుక తమ భూములు రాజధాని నిర్మాణంకోసం ఇస్తే వారికి భవిష్యత్తులో రెసిడెన్సియల్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్, అప్పటివరకు కౌలు క్రింద నెల నెలా డబ్బు చెల్లిస్తామని అద్భుత రంగుల కలను చూపించారు.

కష్టం చేసుకొని నిత్యమూ చచ్చేకన్నా, ప్రభుత్వానికి ఇచ్చేస్తే సులభంగా కోటీశ్వరులయిపోవచ్చు అని రైతులు భ్రమ పడ్డారు. భవిష్యత్తులో తాము సింగపూర్, లండన్ లాంటి సిటీల మధ్య జీవిస్తామని కలలు కన్నారు. ఇంకేం! 58 రోజుల గడువులో ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్‌కిచ్చేశారు. అంతో ఇంతో క్రెడిబిలిటీ వున్న చంద్రబాబు మాటల్ని పూర్తిగా విశ్వసించారు. మరి అందరూ రైతులే భూములిచ్చారనడంలో కూడా వాస్తవం కాదు. నాకు తెలిసిన దాదాపు పాతిక మంది రైతుల దగ్గర 30 లక్షలకు ఎకరం చొప్పున కొని అధికంగా ఆదాయం కన్పిస్తున్నందున ల్యాండ్ పూలింగ్‌కిచ్చేశారు. చాలామంది రైతులు ఎప్పుడో వచ్చే లాభాల్ని నమ్మకో, ఆశించకో కారు చౌకగా కూడా అమ్మేశారు. ఇది నిజం. స్వల్పకాలంలోనే తమ ప్రభుత్వం 33 వేల ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్‌లో సమకూర్చుకోగలిగిందని, ఇది చారిత్రాత్మక ఘట్టం అని నారా చంద్రబాబునాయుడుగారు, ఆయన నడిపిస్తున్న ఎల్లో మీడియా కోడై చాటింది. ఎక్కడ చూడు అప్పట్లో అదే చర్చ. చోటామోటా తెలుగుదేశం నాయకుడు కూడా ఇది చంద్రబాబువల్లే సాధ్యం కాగల్గిందని కాలర్ ఎగరేశారు.
ఇక ఏ వొక్క చిన్న అవకాశం దొరికినా దానిని మార్కెట్ చేసుకొనేందుకు చంద్రబాబు వెనుకాడడు. అక్టోబర్ 22, 2015న అమరావతి రాజధానికి శిలాన్యాసం ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిపించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. శంఖుస్థాపన కార్యక్రమానికి వంద కోట్లు ఖర్చయినా అదొక అంతర్జాతీయ కార్యక్రమంగా రంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రచార యావలో చంద్రబాబును మించినవారు ప్రపంచంలో ఎక్కడా వుండరు. ఆ కార్యక్రమానికి 16 వేల గ్రామాల నుండి మట్టిని, వివిధ పవిత్ర నదులనుండి జలాన్ని కూడా తెప్పించారు. ఆరోజునుండి చంద్రబాబుగారు 2 లక్షల కోట్ల రూ.లతో నిర్మించ తలపెట్టిన కలల రాజధానికి రంగులు వేసుకొంటూ గడిపేశారు. దేశ దేశాలనుండి డిజైన్స్, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారినుండి ప్లాన్స్ తెప్పిస్తూ, మార్పులు చేస్తూ తృప్తిలేకపోవడంతో, తానే స్వయంగా తన వందిమాగదులతో దాదాపు 10 దేశాల్ని కూడా చుట్టివచ్చేశారు. అలా అలా 2019 ఎన్నికలొచ్చేశాయి. బీజేపీతో మైత్రి చెడి వొంటరిగా ఎన్నికల బరిలో దిగాల్సొచ్చింది. ఫలితాలు మనందరికీ తెలిసిందే. పొలాలు ఇచ్చిన రైతులు ఆ నాలుగేళ్ళూ వొక్కరోజు కూడా చంద్రబాబు నిర్మాణం గూర్చి ప్రశ్నించిన పాపాన పోలేదు. ఈరోజు ఆ 29 గ్రామాల్లో వచ్చిన చైతన్యం ఆనాడు వచ్చి, చంద్రబాబును తొందరపెట్టి వుంటే కొంతైనా నిర్మాణాలు జరిగేవి. ఎన్నికల సమయానికి చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణం ఆలస్యం కావడానికి మోదీ ప్రభుత్వం మొండి చెయ్యే కారణమంటూ, నిందను తెలివిగా బీజేపీ ప్రభుత్వంపై రుద్దేశాడు. ఇది మొన్నటి రాజధాని చరిత్ర. పాలనా వికేంద్రీకరణవల్ల అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయని ఆనడే శివరామకృష్ణ కమిటీ తేల్చి చెప్పింది. మరి పరిపాలన వికేంద్రీకరణ మంచిదన్న సలహాతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకొని వుండచ్చు. బహుళ రాజధాని విధానం ఇప్పటికే 16 దేశాల్లో అమల్లో వుంది.

-డా. విజయకుమార్ 93907 45775