Others

జ్ఞానం అందరికీ అందాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపుగా దేశంలోని భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయి కాబట్టి దేవనాగరలిపి అన్ని భాషలకూ సరిపోతుందని ఆయన భావించాడు. ఇండియన్ ఒపీనియన్ గుజరాతీ సంచికలో ఒక పేజీ మొత్తం తులసీదాసు రామచరిత మానస్‌ను హిందీలో ముద్రించేవారు. హరిజన్ పత్రిక అక్షరాలను గాంధీ స్వయంగా ఎంపిక చేశాడు. ఒక ప్రెస్ కొనుగోలు బేరం ఖరారు చేసే పని ఒక సహచరునికి అప్పగిస్తూ గాంధీ ‘మొత్తం యంత్రాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించు, అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించు. ముఖ్యంగా అక్షరాలు అరిగిపోయాయో, సరిగ్గా ఉన్నాయో లేదో చూడు’’ అని సూచనలిచ్చాడు.ఆయన తన రచనలమీద ప్రచురణ హక్కులు తీసుకొనేవాడు కాదు. ఆయన సంపాదకత్వం వహించిన పత్రికలన్నీ ప్రజల ఉమ్మడి ఆస్తులుగా ఉండేవి. తన రచనలను వక్రీకరించే అవకాశం ఉందని భావించినపుడు మాత్రమే ఆయన కాపీరైటు హక్కులను వినియోగించుకొనేందుకు అంగీకరించేవాడు.
పిల్లల పుస్తకాలను పెద్ద అక్షరాలతో మంచి కాగితంమీద ముద్రించాలనీ, ప్రతి అంశాన్నీ ఒక అందమైన బొమ్మతో వివరించాలని ఆయన భావించేవాడు. ఆయనకు సన్నని పుస్తకాలంటే ఎక్కువ ఇష్టం. అవి పిల్లలను అలసిపోయేలా చేయవు. మోసుకెళ్లేందుకు, చదువుకొనేందుకు అనువుగా ఉంటాయి. జాతీయ విద్యా విభాగానికి బాధ్యునిగా వున్న ఆశ్రమవాసి ఒక పాఠ్యపుస్తకాన్ని ముద్రింపజేశాడు. దానిలో ప్రతి పేజీలోనూ అందమైన బొమ్మలున్నాయి. దాన్ని రంగు రంగుల ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఆయన దాన్ని గాంధీకి చూపించి గర్వంగా ‘‘బాపూజీ, కొత్త పుస్తకాన్ని చూశారా? దాన్ని అలా తీర్చిదిద్దింది నేనే’’ అన్నాడు.
దానికి గాంధీ ‘‘అవును, పుస్తకం చలా అందంగా ఉంది. కానీ దాన్ని నువ్వు ఎవరికోసం ముద్రించావు? ఎంతమంది పాఠకులు అయిదు అణాలు పెట్టి పుస్తకం కొని చదవగలరు? భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న లక్షలాదిమంది పేదలకు చదువునందించే విభాగానికి నువ్వు అధిపతివి. ఇతరులపుస్తకాల ధర అణా వుంటే, నీ పుస్తకం రెండు పైసలే ఉండాలి’’ అన్నాడు. ఒక వారపత్రిక బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ ఆ పత్రిక ధరను రెండు అణాల నుంచి ఒక అణాకు తగ్గించాడు.
ప్రచురణల విషయంలో సొమ్ములు పొదుపు చేయడమే గాంధీ ఆఖరి లక్ష్యంకాదు. గోఖలే రచనలకు, ప్రసంగాలకు గుజరాతీ అనువాదాలను నవజీవన్ ప్రెస్ ముద్రించాలనుకుంది. ఒక విద్యావేత్త అనువాదం చేశాడు. గాంధీని దానికి ముందుమాట రాయమన్నారు. గాంధీ పుస్తకం చదివినప్పుడు అనువాదం కృత్రిమంగా, పెళుసుగా వున్నట్లు గమనించాడు. మొత్తం పుస్తకాన్ని నాశనం చేయమన్నాడు. అప్పటికే ఆ పుస్తకంమీద 700 రూపాయలు ఖర్చు చేశామని వారు చెప్పారు. అపుడు ఆయన ‘‘ఏడు వందలు ఖర్చుపెట్టారు సరే, బైండింగ్‌కీ, ముఖచిత్రానికీ మరికొన్ని రూపాయలు ఖర్చుచేసి ఈ చెత్తను పాఠకులముందుకు తీసుకెళ్లడం అవసరమా? పనికిమాలిన సాహిత్యాన్ని ప్రచురించి ప్రజల అభిరుచులను పాడుచేయడం నాకిష్టంలేదు’’ అన్నాడు. ఆ కాగితాలన్నిటినీ కనీసం చెత్త కాగితాలవాడికి అమ్మడానికి కూడా అంగీకరించకుండా మొత్తాన్ని తగలబెట్టించాడు. పత్రికా స్వేచ్ఛకు గాంధీ ఎప్పుడూ మద్దతు పలికేవాడు. కీలక అంశాలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి వీల్లేదని ప్రభుత్వం నిబంధనలు విధిస్తే ఆయన ముద్రించడమే ఆపేసేవాడు. పత్రికా స్వేచ్ఛపై ఆయనకున్న మమకారానికి బహుమతిగా బ్రిటీషు ప్రభుత్వం ఆయన ప్రెస్‌ను స్వాధీనం చేసుకుంది, ఆయన ఫైళ్లను నాశనం చేసింది, ఆయనకు, ఆయన సహచరులకు జైలుశిక్షలు విధించింది. అయినా ఆయనెప్పుడూ నిరుత్సాహపడలేదు. ‘‘యంత్రమూ, లోహపు అక్షరాలే ముద్రణ అనే మూసధోరణి నుంచి మనం బయటపడదాం. కలమే మన ఫౌండ్రీ, నకలుదారుల చేతుల ముద్రణా యంత్రాలు. ప్రతి మనిషీ ఒక నడిచే వార్తాపత్రికగా మారి, సమాచారాన్ని నోటి నుంచి నోటికి మోసుకుపోదాం, దీన్ని ప్రభుత్వం అడ్డుకోలేదు’’.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614