Others

సత్యం శివం సుందరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదంతా - ఇంతకుముందున్న దృగంచల కల్లోలమే
ప్రాణబాణం తగిలిన దృశ్యభానమే
జీవనిధి సంకేతమైన శబ్దం
ఆంతరిక చేతనలో అనాహత నాదమై కదులుతున్నప్పుడే
శరీరాన్ని ఆత్మ అలంకరిస్తుంది
మెలకువ పిట్ట రెక్కల్ని టపటపలాడిస్తుంటే
నిశ్శబ్దపు పువ్వు రేకుల్ని విప్పుకుంటుంది
ప్రతి మార్పు ఒక వినూత్న శైలికి గుణింతమే
సంతోష ప్రసూనం ఎప్పుడూ బాధా గర్భితమే..
***
మేనుబరచితి
జగమది మేలుకొలిపె
కొమ్మ కోకిల గొంతులో కూతమెదిపి
పాన్పు పైనుండి లేచితి
ప్రకృతి యెడద
తొలగించె పూర్వ స్మృతి పొలపు తోటి...
తావి గుండెల్ని ఊపుతున్న తోట కొమ్మల
చివరి గాలివాలు వంపులో
నిన్న చుట్టుకు తిరిగిన గుర్తులన్ని
ఇవాళ నన్ను చుట్టముట్టాయి-
నా నుంచి నేను
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404