Others

సౌకర్యమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాలో గాంధీ పాంటు మీద చెప్పులు వేసుకోవడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో అది చాలా అసాధారణమైన విషయం. బూట్లకన్నా ఆయనకు చెప్పులంటేనే ఇష్టం- అవి వేసవిలో పాదాలను చల్లగా ఉంచేందుకు ఉపయోగపడతాయి, శీతాకాలంలో వాటిని మేజోళ్లతోసహా వేసుకోవచ్చు. ఆ చెప్పులను ఆయనే తయారుచేసుకొనేవాడు. చేత్తో తయారుచేసిన ఈ గట్టి, సౌకర్యవంతమైన చెప్పుల గురించి దక్షిణాఫ్రికా ప్రధాని జనరల్ స్మట్స్ విన్నాడు. ఆయన కూడా ఒక జత వాడి చూద్దామనుకున్నాడు. గాంధీ ప్రత్యేకమైన జాగ్రత్తతో ఒక చెప్పుల జతను తయారుచేయించి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు.
అందరి ఆమోదం పొందిన సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కొత్త పద్ధతిలో పనులు చేసే అలవాటు గాంధీకి ఉండేది. అలా ఆయన స్థాపించిన కొత్త ఫాషన్లుకొన్నిటిని అందరూ అనుసరించారు, మరికొన్ని ఎక్కువమంది ఆమోదం పొందలేక అంతరించిపోయాయి.
మొదటిసారి కాంగ్రెస్‌సభలకు హాజరైనప్పుడు వేర్వేరు కులాలకే కాక, వేర్వేరు రుచులున్న కార్యకర్తలు, ఆహ్వానితుల కోసం కూడా వేర్వేరు వంటశాలలు నిర్వహించడం చూసి గాంధీ ఆశ్చర్యపోయాడు. ఆయన చిన్న చిన్న విషయాలనే ఎక్కువగా పట్టించుకొనేవాడు. ప్రజలు తమ వేర్పాటు ధోరణిని వదులుకొని ఏకత్వ నావనను పెంచుకుంటే తప్ప స్వరాజ్యం రాదని ఆయన భావించాడు.
ఆహారపు అలవాట్లను సరళీకరించడం ద్వారా ఆయన ఆహారం మీద ప్రయోగాలు చేశాడు. ఆశ్రమాలలో సామాన్యమైన, మసాలా లేని భోజనం ఉమ్మడి వంటశాలలో కూర్చొని ఒకేరకమైన శాకాహార భోజనం చేసేవారు.
చేత్తో ఆడిన గోధుమపిండి, చేత్తో దంచిన బియ్యం, ఉడకబెట్టిన కూరగాయలు, గింజలు, పళ్లు వంటివాటిలో వున్న పోషక విలువల గురించి గాంధీ గట్టిగా చెప్పేవాడు. తెల్లటి పంచదార కన్నా తాజా బెల్లం, తేనెల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయని వివరించేవాడు. ఆ విధంగా ఆహారం రంగు, రుచి, వాసనలకు కాకుండా దానిలోని పోషక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రజలకు శిక్షణ ఇచ్చేవాడు.
ఫైజాపూర్ కాంగ్రెస్ సభల్లో సభ్యులకు, దర్శకులకు మొదటిసారి పాలిష్ పెట్టని బియ్యం, హోల్‌మీల్ బ్రెడ్డులను వడ్డించారు. కాంగ్రెస్ వార్షిక సమావేశాలను ఒక గ్రామంలో నిర్వహించాలనేదికూడా గాంధీ ఆలోచనే. అంతకుముందు 50 సంవత్సరాలపాటు, కాంగ్రెస్ సభలకు హాజరయ్యేవారిలో ఎక్కువ మంది విద్యావంతులైన నాయకులు, మేధావులు ఉండేవారు. కాంగ్రెస్ సభలను కోల్‌కతా ముంబై, చెన్నై లాంటి పెద్దనగరాల్లో నిర్వహించేవారు. గాంధీ దానిని సామాన్యుల కాంగ్రెస్‌గా మార్చేసాడు, ప్రజారూపం ఇచ్చాడు. ఆయన సాధారణమైన భారతీయ దుస్తులను ధరించి, హిందీలో ప్రసంగించేవాడు.
ఫైజాపూర్‌లోని తిలక్‌నగర్‌ను అన్ని అంశాలతో ఆయనే ప్రణాళికాబద్ధంగా రూపొందించాడు. ఆ శిబిరాన్ని గామంలో అందుబాటులో ఉండే పదార్థాలతో గ్రామీణ వృత్తి నిపుణులే నిర్మించారు. కళాకారుడైన నందలాల్ బోస్ గాంధీ కళలకు ఆకారాన్నిచ్చాడు. గుడిసెల గోడలు, పైకప్పులు వెదురుతో చేశారు. రంగులు వేసిన వెదురుకర్రలతో స్వాగత ద్వారాలు నిర్మించారు. బోర్లించిన వెదురుబుట్టలతో వాటిని అలంకరించారు. ప్రధాన ద్వారం వద్ద రెపరెపలాడుతున్న జాతీయ జెండా కూడా గాంధీ సృష్టే. కొద్ది సంవత్సరాల ముందే ఆయన దానికి తుదిరూపం ఇచ్చాడు. దానిలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పట్టీలు ఆ క్రమంలో అడ్డంగా ఉండేవి. మధ్యలోని తెల్లరంగులో నీలి రంగుతో వేసిన రాట్నం భారతదేశం సామాన్యులకు, అహింసా స్వభావానికి గుర్తుగా ఉండేది.
సాధారణమైన, గౌరవనీయమైన జాతీయ దుస్తులు రూపొందించిన ఘనత గాంధీకే దక్కుతుంది. ఆయన దక్షిణాఫ్రికాలో యాత్రకు నాయకత్వం వహించినపుడు, దక్షిణ భారతదేశానికి చెందిన వందలాది గని కార్మికులు, ఒప్పంద కార్మికులు పోరాటంలో పాల్గొన్నారు. అందరినీ హింసించారు. చాలామందిని జైల్లో పెట్టారు. కొందరు మరణించారు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614