AADIVAVRAM - Others

ఎలా ప్రవర్తించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ బాస్ మీ ఆలోచనలను వినియోగించుకోవాలని మీరు కోరుకుంటే వాటి నిర్మాతల్లో అతడు కూడా భాగస్వామి అయ్యేందుకు మీరు అంగీకరించేందుకు తయారుగా ఉండాలి.
మీ బాస్ తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు ముందుగా బాస్‌కు వాటి గురించి బాగా వివరించడమేగాక ఎప్పటికప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు బాస్‌కు తెలియజేస్తూ ఉండాలి.
మీ బాస్ బలహీనతలు మీ బలాలుగా తీసుకుని బాస్‌కు సహాయం అందిస్తూ ఉండాలి. అప్పుడు మీరు బాస్‌కు కుడిభుజంగా తయారయిపోతారు.
ఉద్యోగస్థులకు అయిదు ప్రమాదకరమైన లక్షణాలు ఏమిటంటే...
- విశ్వాసం లేకపోవడం
- అదుపుతప్పి ప్రవర్తించడం
- ఇతరుల ముందు అవిధేయంగా ఉండడం
- అధిక ప్రసంగాలు చేయడం
- బాస్ ఉద్యోగంపై గురిపెట్టడం
మీ వ్యక్తిగత సమస్యలకు మీ బాస్ బాధ్యుడు కాడు. వ్యక్తిగత సమస్యలు ఇంటి వద్దనే వదిలివేయాలి.
మీ బాస్‌ను మీరు ఏదైనా సహాయం అడగాలనుకున్నప్పుడు మీకున్న వనరులన్నీ అయిపోయినపుడు మాత్రమే అటువంటి పనికి పూనుకోవాలి.
బాస్‌తో జాగ్రత్తలు
బాగా ఆలోచించి కొత్త ఆలోచనలు రూపొందించుకున్న తరవాతనే వాటిని బాస్ ముందర ఉంచాలి. మీ ప్రతిపాదనలు సంక్షిప్తంగా ఉండడమే గాక అందలి అనుకూల, ప్రతికూల పార్శ్వాలను కూడా చెప్పాలి. దీని వలన బాస్ తన పై అధికారులకు ఈ ప్రతిపాదనలు చెప్పినపుడు బాస్ ఎటువంటి అనుకోని సమస్యలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎదురుకాదు.
ఎట్టి పరిస్థితులలోను బాస్‌కన్నా మీరు తెలివైన వారని ప్రదర్శించకూడదు. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే బాస్‌తో గేమ్స్ ఆడకూడదు.
కొత్త ఆలోచనలు బాస్‌కు చెప్పేటప్పుడు బాస్ స్టయిల్ దృష్టిలో ఉంచుకోవాలి. అంటే బాస్ ఉద్రేకంతో, వివరణాత్మకంగా, వ్యాపార దృష్టిలో ప్రవర్తిస్తాడా గుర్తుంచుకుని తదనుగుణంగా చెప్పాలి.
మీ బాస్ మిమ్మల్ని కోరిన సమాచారం ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. దానిని రహస్యంగానే ఉంచాలి. మీరు ఎంతో విశ్వాసంతో నమ్మే మీ సహోద్యోగికి కూడా చెప్పకూడదు.
మీ బాస్ విశ్వసించే కేంద్రాల నుండి లభించే సమాచారంతో మీ ప్రతిపాదనలు తయారుచేసి మీ బాస్ ముందు ఉంచాలి.
అవసరమైనపుడు మీ ఉద్యోగ నిర్వహణ బాధ్యతలకు మించిన బాధ్యతలు చేపట్టేందుకు తయారుగా ఉండాలి.
మీరు పనిచేసే సంస్థలో ఇతర శాఖలకు సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తూ బాస్‌కు తెలియజేస్తూ ఉంటే మొత్తం సంస్థ పనితీరుపై బాస్‌కు పట్టు దొరుకుతుంది.
గుర్తుంచుకోండి!.. మీరు మీ బాస్ దగ్గరకు వెళ్లి ఒక అభ్యర్థన చేసే ముందు ఈ కింది విషయాలలో స్పష్టత కల్గి ఉండాలి.
- మీ ప్రాధాన్యతలు
- మీ లక్ష్యాలు
- మీకు కావలసిన అతి తక్కువ వనరులు
- సమయ నిర్బంధాలు
- ఏ స్థాయిలో మీరు పని చేయగలరు.
మీ అభ్యర్థనను బాస్ సీరియస్‌గా తీసుకుని దానిపై కసరత్తు చేసి మీ ప్రతిపాదనలను అభినందించేటట్లు ఉండాలి.
ఏయే విభాగాల్లో దీర్ఘకాలిక లాభాలు బాస్‌కు రాగల విషయాలను గుర్తించాలి.
మీరు చేయగల్గిన దానికంటే ఎక్కువగా చేయాలి. సమయానికి రావడం కాకుండా సమయానికి ముందు రావడం ముఖ్యం. ఇచ్చిన పని చేసి చేతులు దులుపుకోక మరింత అధికంగా పని చేయడం అలవరచుకోవాలి.
పరస్పరం లభించే ప్రయోజనాలు మీ ప్రతిపాదనలలో తెలియజేస్తూ మీ ఆలోచనలకు అనుగుణంగా మీ బాస్ మనసును మలచుకోవాలి.
చేయాల్సినవి
అవకాశం దొరికినపుడు సందర్భానికి తగినట్లుగా పదిమందిలోను బాస్‌ను సున్నితంగా అభినందించాలి.
మీ బాస్ పరిపూర్ణతతో ఉంటాడని భావించకూడదు. అతడు చేసే పొరపాట్లను ఎత్తిచూపక పెద్ద మనసుతో అంగీకరించాలి.
బాస్‌ను ఆశ్చర్యాల్లో ముంచే పనులు చేయకూడదు. మీరు నిజాయితీ గల ఉద్యోగిగా అతని మనసులో స్థానం సంపాదించుకుంటే మీతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు.

-సి.వి.సర్వేశ్వరశర్మ