Others

సత్యం శివం సుందరం (సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పించుకోలేని ఏకాకి పాత్ర నాది..
ఎలా విడిచి రాగలను అగరుని? అనంత సౌరభాన్ని?
రకరకాల రంగుల రాశీకృత సమ్మేళనాన్ని
ఒక్కచూపు దక్కించుకున్న ఏకత్వంలోంచి
ఊహలు - ఊసులు చిక్కబడుతూ
విశ్వాకారం ధరించి - అర్థానికి అన్వర్థమై..
నిశ్శబ్ద ప్రపంచపు నిశ్చలత్వం చివర
నిదుర వాకిళ్ళమధ్య
స్వప్నాలు మాట్లాడుకోవటం కళ్ళకు కూడా తెలీదు...
ఎన్నో దృశ్యాల జీవన పరంపరలోంచి
వౌనమే చలన చిత్ర భాషగా బొమ్మలు కడుతుంది..
ఒక పువ్వు ఏకాంతంమీద తుంటరితనంగా
తూలిపడినా
ఒంటినంటుకున్న కోరిక వేడిమీద
వాపిరితనంతో వాలుపడినా
గాలి
మహద్భాగ్యమే- నిరాకార నియంతగానే
వ్యవహరిస్తుంది- ముగ్ధ సౌందర్య సౌరభ్య సంకేత
సందేశం...
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404