Others

దైవావతారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు రమణ మహర్షి జయంతి
*
శ్రీ రమణ ప్రభువు ఎప్పుడో ఏ చారిత్రక యుగానికి చెందినవాడో కాదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇటువంటి మహాద్భుత దివ్య తాదాత్మ్య సృష్టి స్వరూపుడు ఇంకొకరెవరైనా ఉన్నారో ఎవరూ చెప్పలేరు. ఇటువంటి పరమాశ్చర్యకర దైవావతారుడు ఒక్క భారతదేశంలో మాత్రమే జన్మించగలరనటంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. అరుణాచలం వైపు దృష్టినిలిపి, సర్వాంగ ప్రణామం చేయండి. మీ మనసు కట్టడికి మొదటి మెట్టు కనపడుతుంది.
శ్రీ ఆలిక్ మెక్లిన్ స్కాచ్ (స్కాట్లాండు) దేశీయుడు. ఈయన శ్రీరమణ మహర్షి గురించిన తన అనుభవం ఇట్లా వర్ణించాడు. తాను భారతదేశం అంతా పర్యటించాననీ, శ్రీరమణాశ్రమంలో కొంతకాలం ఉన్నాననీ ఆయన వక్కాణం.
శ్రీరమణులు ప్రతిరోజూ కొండమీదకిగానీ, అడవిలోకి గాని షికారుకు వెళ్ళేవారు. ఆయన తమ ఆశ్రమ కుటీరం నుంచి బయటకు వచ్చారో లేదో మరి వాటికి ఎట్లా తెలిసేదో! అరమైలు దూరంలో ఇటువైపు వున్న తిరువణ్ణామలై గ్రామంలో, అటు అడి అణ్ణామలై గ్రామంలో (అడి అంటే కొండ దిగువన దానిని ఆనుకున్న చోటు) గ్రామంలో పశుపక్ష్యాదులు తమ కట్టు తాళ్ళను తెంచుకోవటానికి చిందులు తొక్కేవి. కట్టు విప్పటమే తరువాయి అవి శ్రీ రమణ మహర్షి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేవి. గ్రామంలో ఉండే పిల్లలు, కుక్కలు ఆయన దగ్గరకు వచ్చేవి. ఇక ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా బారులు తీరి పెద్ద తెర కట్టినట్లు ఆకాశాన్ని కమ్మివేస్తూ మహర్షి సమీపంగా ఎగురుతూ ఆయనతోపాటు ముందుకు సాగేవి. ఇక అడవిలో క్రూరమృగాలు, సాధు జంతువులు ఆయనను అనుసరించేవి. ఇపుడు చూడండి- పూర్ణంగా ఆ దృశ్యాన్ని మీ మనోఫలకంమీద ఆవిష్కరిచుకోండి ఒక్కసారి. మహదానందం అనుభవిస్తారు. చిన్న పక్షులు, పెద్ద పక్షులు, పిల్లలు, మేకలు, ఆవుదూడలు, పెద్దపులులు, సర్పాలు పరస్పరం వైరాలు మరచి ఒకే కుటుంబంగా ఆత్మీయంగా భగవాన్‌తో కలిసి ముందుకు సాగేవి. శ్రీ రమణ భగవాన్ వెనుతిరిగి తన కుటీరానికి చేరుకోగానే ఎక్కడివి అక్కడ తమ నెలవులకు చేరుకునేవి. ఈ అపూర్వ అతిలోక అద్వితీయ దృశ్యాన్ని చూసిన కళ్ళు తప్ప వినే చెవులు నమ్మలేవని నాకు తెలుసు. అయినా ఇది సత్యం. శ్రీ రమణ మహర్షి సన్నిధిలో అత్యంత సహజంగా ప్రతి సాయంత్రం ఈ దృశ్యం పునరావృతమయ్యేది (శ్రీ పీటర్ టాంప్ కిన్, శ్రీ క్రిస్ట్ఫ్‌ర్ బర్డ్‌లు రచించిన ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథం నుంచి).
శ్రీరమణుల లోచనాలు లేత నీలి లోచనాలు. ఆశ్చర్యం! ఇట్లా ఎవరికీ ఉండవు. పురాణాలలో శ్రీ కుమారస్వామి నేత్రాలు నీలలోచనాలని వర్ణించాయి.
శ్రీ వివేకానందస్వామి శ్రీ రమణ జన్మస్థలమైన తిరుచ్చుళిలో ఉన్న కలియార్ కోవెలలో రెండు రోజులు తపస్సులో ఉండిపోయారు. రెండో రోజున లేచి ఇంతటి శాంతిని నేను ఎక్కడా ఎప్పుడూ పొందలేదు అన్నాడు. ఇది తిరుచ్చుళి క్షేత్ర వైభవం.
(ఆధారం- శ్రీ ఎం.ఆర్. నాగేశ్వరరావు సంకలనం చేసిన ‘శ్రీరమణ కరుణా విలాసం’- 2013).

-అక్కిరాజు రమాపతిరావు