Others

ఆడంబరాలు ..సంపదనాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ టోపీలు ధరించిన కార్యకర్తలను పోలీసులు క్రూరంగా హింసించారు. వారి టోపీలను బలవంతంగా తొలగించారు. దాన్ని ధరించినందుకు పాఠశాల విద్యార్థులను కూడా శిక్షించారు. కొన్ని సమయాలలో గాంధీ టోపీ ధరించిన కార్యకర్తలకు 10 రూపాయల అపరాధ రుసుము విధించేవారు. చెల్లించడానికి నిరాకరిస్తే 10 రోజుల జైలుశిక్ష విధించేవారు. గాంధీ కూడా కొంతకాలం టోపీ ధరించాడు.
ఆయన దుస్తుల్లో ఆఖరి మార్పుగా ఖాదీ అంగవస్త్రం, కండువా, చెప్పులు స్థిరపడ్డాయి. నాయకుడు తన ప్రజలకు నిజమైన ప్రతినిధిగా ఉండాలని ఆయన విశ్వసించేవాడు. ఆయన ఐరోపాకీ, ఇంగ్లాండుకీ కూడా అదే దుస్తులలో వెళ్లాడు. వచ్చిన ఒక విశిష్ట అతిథిని రైలు స్టేషన్ నుంచి ఆయన ఆశ్రమానికి ఎడ్లబండిలో తీసుకువచ్చారు. అలాంటి సందర్శకులంతా కూడా మట్టినేల మీద కూర్చొని ప్రజా నాయకుడైన గాంధీతో గంభీరమైన వ్యవహారాలు చర్చించేవాళ్లు. వాళ్లు ఆశ్రమ భోజనమే చేసేవారు. సేవాగ్రాం సన్యాసి మంచి అతిథేయిగా ప్రవర్తించేవాడు. వాళ్ల అవసరాల పట్ల శ్రద్ధ వహించేవాడు కానీ ఆశ్రమంలోని నిరాడంబర సౌకర్యాలను, ఏర్పాట్లనే పాశ్చాత్యులకూ వినియోగిస్తున్నందుకు సిగ్గుపడేవాడు కాదు. ఆడంబరాలు ప్రదర్శించడం ద్వారా ఒక పేద దేశం గౌరవ ప్రతిష్ఠలను పెంచుకోవచ్చని ఆయన నమ్మేవాడు కాదు. తెచ్చిపెట్టుకున్న ప్రతిష్ఠ, అరువుతెచ్చుకున్న ఆడంబరాలతో పేదరికాన్ని దాచిపెట్టాలని చూడటం ఆయనకు బాధపెట్టేది. తన గ్రామీణ నివాసం నుంచి వైస్రాయిలు, గవర్నర్లు, బ్రిటీషు దౌత్యాధికారులతో ముఖ్యమైన సమావేశాల కోసం గాంధీ తరచుగా ఢిల్లీ, సిమ్లా, ముంబయి, కోల్‌కతాలకు ప్రయాణించాల్సి వచ్చేది. తన భావాలను ప్రచారం చేయడం కోసం, తన దేశస్థులకు అందుబాటులో ఉండటం కోసం ఆయన చాలాసార్లు భారతదేశమంతటా పర్యటించాడు. కానీ ఎప్పుడూ విమానం ఎక్కలేదు, మూడో తరగతి రైలు పెట్టెలో ప్రయాణం చేసేవాడు. స్వాతంత్య్రానికి ముందు నాయకులందరూ ఆయన ఉదాహరణనే పాటించారు. మొత్తం పరిపాలనా వ్యవస్థనే మార్చేయాలని గాంధీ అనుకొనేవాడు. ‘‘ప్రజాస్వామ్యంలో ఒక రైతు పరిపాలకుడు కావాలి. ఒక రైతు ప్రధాని తాను నివసించడానికి భవనం కావాలని కోరుకోడు. ఆయన గుడిసెలో నివసిస్తూ ఆరుబయట పడుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా పొలంలో పనిచేస్తాడు’’ అనేవాడు.
తన ఆలోచనలకు అనుగుణంగా మారడానికి ఖరీదైన, సౌకర్యవంతమైన పరిసరాల్లో పుట్టి పెరిగినవారికి చాలా ధైర్యంకావాలని గాంధీకి తెలుసు. అందుకే ఆయన మొదటి నుంచే పిల్లలకు విభిన్నమైన విద్యాబోధన చేయాలని సూచించేవాడు. విద్యారంగంలో ప్రముఖులు చేసిన ప్రయోగాలను బాగా పరిశీలించి పిల్లలకోసం ఒక ప్రాథమిక శిక్షణను గాంధీ సూచించాడు. ఆయన దాన్ని నరుూ తాలిం అనేవాడు. పుస్తకాలతో పాఠాలకు అది అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. కేవలం నిరక్షరాస్యతనే కాక, అజ్ఞానాన్ని నిర్మూలించడం దాని లక్ష్యం. హస్తకళలు, చేతివృత్తులు నేర్పడం ద్వారా విద్యార్థులలో వ్యక్తిత్వ నిర్మాణం చేయాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని ఆయన భావించాడు. అన్ని మతాల పట్ల సహనం, అన్ని జాతుల పట్ల ప్రేమ, అన్ని పనులపట్లా గౌరవం పిల్లలకు అలవర్చాలని ఆయన ప్రయత్నించాడు.
ప్రపంచంలోని అన్ని మతాల ప్రార్థనలను కలిపి తయారుచేసిన ప్రార్థనను సామూహిక ప్రార్థనా సమావేశాలలో పరిచయం చేసేందుకు ఆయన ప్రయత్నించాడు.
గాంధీ తన భావాల గురించి అవిశ్రాంతంగా అనేక బహిరంగ సమావేశాలలో ప్రసంగించాడు, తన పత్రికల్లో అసంఖ్యాకమైన వ్యాసాలు రాశాడు. తాను సంపాదకత్వం వహించిన చాలా పత్రికల్లో ఆయన బాగా ఆదాయం తెచ్చిపెట్టే ప్రకటనలను తీసుకోలేదు. ఆయన డబ్బును ప్రేమించేవాడు కాదు, కానీ ఏ రూపంలో సొమ్ము వృధా చేసినా సహించేవాడు కాదు. అలంకరణ కోసం ధనం వృధా చేయొద్దని సభలు, సమావేశాల నిర్వాహకులకు ఆయన సూచించేవాడు. ‘‘పూలను పూర్తిగా మానేసి నూలుదండలు వాడండి.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614