AADIVAVRAM - Others

నిజాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిలువెత్తు ‘నిర్భయాన్ని’ శిలువగా మోయటమే!
దూషణ, భూషణ, తిరస్కారాలను కవచాలుగా మలచుకోవటమే!
సత్యం ‘నిప్పుల కుంపటి’ శిరస్త్రాణంగా ధరించటమే
అవకాశవాద ఆర్భాటాలకు చిరునవ్వులు పొదగటమే
నిలువుటద్దంలో ముఖ కవళికలకు రంగులు దిద్దుకోవటమే
ముళ్లబాటపై చెప్పులు లేకుండా పాదయాత్ర చేయటమే
కళ్ల కాంతుల్ని తీక్షణ శరాలుగా మార్చుకోవటమే
పళ్ల ఇకిలింపులకు వౌనాస్త్రాలతో సమాధానం ఇవ్వటమే!!
*

- బి.ఎస్.నారాయణ దుర్గ్భాట్ 9346911199