AADIVAVRAM - Others

రామాయణం - మీరే డిటెక్టివ్ (4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగో రోజు హరికథకి ఆశే్లష వెంట తల్లి శారదాంబ కూడా వచ్చింది. హారతి ఇచ్చి రాముడికి కొబ్బరికాయ కొట్టాక హరికథకుడు కథని మొదలుపెట్టాడు.
‘యజ్ఞ అగ్నిగుండం నించి ప్రజ్వరిల్లే అగ్నిశిఖ లాంటి ఓ మహాభూతం ప్రత్యక్షమై రాగి మూతగల వెండి పాత్రలో పాయసాన్ని దశరథుడికి ఇచ్చి తను ప్రజాపతి పంపగా వచ్చానని, దాన్ని తన ముగ్గురు భార్యలకి ఇవ్వమని, కొడుకులు పుడతారని చెప్పి మాయం అయింది.
‘దశరథుడు కౌసల్యకి సగాన్ని, మిగిలిందాంట్లో సగాన్ని సుమిత్రకి, (పావు వంతు) మిగిలిన దాంట్లో సగం (ఎనిమిదో వంతు) కైకేయికి ఇచ్చాడు. దాన్ని తిన్న ఆ ముగ్గురు భార్యలు గర్భవతులు అయ్యారు.
ఇదిలా ఉండగా బ్రహ్మ దేవతలతో చెప్పాడు.
‘మానవ రూపంలో జన్మించే విష్ణువుకి సహాయంగా మీ ద్వారా అప్సరస, గంధర్వ స్ర్తిలకి కోతులుగా పుడతారు. (దేవతలకి తమ భార్యల ద్వారా పిల్లలు పుట్టరనే సరస్వతీ దేవి శాపం, రావణుడు వానరుల వల్ల చస్తాడనే నందికేశ్వరుడి శాపం ఉన్నాయి.) దేవతలారా! మీరు కామరూపులు, పరాక్రమవంతులైన వానర రూపంలో పుట్టండి’
‘అప్పటికే ఓసారి బ్రహ్మ ఆవులించగా ఆయన నోటిలోంచి జాంబవంతుడు ఎలుగు రూపంలో పుట్టాడు. దేవేంద్రుడికి సుగ్రీవుడు, సూర్యుడికి వాలి, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకి నలుడు, అగ్నికి నీలుడు, అశ్వినీ దేవతలకి మైందుడు, ద్వివిదుడు, వరుణుడికి సుషేణుడు, పర్జన్యుడికి హనుమంతుడు, వాయుదేవుడికి శరభుడు జన్మించారు. ఇంకా మహా బలవంతులు, కామరూపలు ఐన లక్షలాది వానరులు గోలాంగూల, ఋక్ష, కినె్నర, నాగ, గంధర్వ, విద్యాధర అప్సరసలకి జన్మించారు. ఏ దేవతకి ఏ పరాక్రమం, ఏ రూపం ఉందో వారి సంతానానికి కూడా అవే వచ్చాయి. వారు పర్వతాల్ని పిండి చేసి చెట్లని వేళ్లతో సహా పెకలించగలరు. ఇలా వనాల్లో సంచరించే వానరులు మొత్తం పది కోట్ల మంది రావణుడి వధ కోసం రాముడికి సహాయం చేయడానికి పుట్టారు. ఆ వానర సేనలకి వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు నాయకులు అయ్యారు.
‘అశ్వమేథ, పుత్రకామేష్ఠి యాగాలు పూర్తయ్యాక దశరథుడు అతిథులని సత్కరించి పంపాడు. ఋష్యశృంగుడు కూడా తన భార్య శాంత, తండ్రి రోమపాదులతో వెళ్లిపోయాడు.
‘యజ్ఞం పూర్తయి ఆరు ఋతువులు (సంవత్సరం) అయ్యాక చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కర్కాటక లగ్నంలో దశరథుడి పెద్ద భార్య కౌసల్య కొడుకుని కన్నది. తర్వాత రెండో భార్య సుమిత్రకి కర్కాటక లగ్నంలోనే ఆశే్లషా నక్షత్రంలో కవలలు పుట్టారు. చివరి భార్య కైకేయికి పుష్యమి నక్షత్రం, మీన లగ్నంలో ఓ కొడుకు పుట్టాడు. దేవతలు ఆనందంతో దుందుభులు మోగించి, పుష్ప వర్షాన్ని కురిపించారు. అయోధ్య పౌరులు కూడా చాలా ఆనందించారు.
‘పదకొండు రోజుల తర్వాత వశిష్ఠుడు కౌసల్య కొడుక్కి రాముడు అని, కైకేయి కొడుక్కి భరతుడని, సుమిత్రకి పుట్టిన కవలలకి లక్ష్మణ, శతృఘు్నలనే పేర్లు పెట్టాడు. దశరథుడు విరివిగా దానాలు చేశాడు.
‘రాముడికి విలువిద్యలో, తండ్రికి సేవ చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉండేది. రామలక్ష్మణుల మధ్య స్నేహం అధికంగా ఉండి ఇద్దరూ ఓ జతగా ఉండేవారు. అలాగే భరత శతృఘు్నలు కూడా జతగా ఉండేవారు.
‘వారికి వివాహ వయసు రావడంతో దశరథుడు ఆ విషయం బంధువులతో, పురోహితులతో ఆలోచిస్తూండగా అక్కడికి కుశిక వంశీయుడు, అత్రి కుమారుడు ఐన విశ్వామిత్రుడు వచ్చాడు. దశరథుడు ఆయనకి ఎదురెళ్లి స్వాగతం చెప్పాడు. వశిష్ఠుడు, ఇతర మునులని ఆయన కుశల ప్రశ్నలు వేశాక విశ్వామిత్రుడ్ని ఏమి కోరి వచ్చారని దశరథుడు అడిగాడు. (బాలకాండ సర్గ 16 నించి 18 దాకా)
మళ్లీ హరిదాసు ఆ కథలో ఏడు తప్పులని చెప్పాడు. డిటెక్టివ్‌గా మీరు ఆ ఏడు తప్పులని కనుక్కోగలిగారా?

మీకో ప్రశ్న
భరతుడి పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం పేరేమిటి? ఎక్కడ ఉంది?

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.గుర్రం తిరిగి వచ్చింది ఆర్నెల్ల తర్వాత కాదు. ఏడాది తర్వాత.
2.ఆరు యూప స్తంభాలని పనస కర్రతో చేయలేదు. మోదుగ చెట్టు కర్రతో చేశారు.
3.సరయూ నది దక్షిణ తీరంలో కాదు. ఉత్తర తీరంలో ఆ యాగాన్ని చేశారు.
4.యూప స్తంభానికి కట్టిన గుర్రాన్ని కత్తులతో మంత్రోక్తంగా చంపింది సుమిత్ర కాదు. కౌసల్య.
5.అశ్వమేథ యాగాన్ని ఐదు రోజుల్లో కాదు. మూడు రోజుల్లో పూర్తి చేశారు.
6.బ్రహ్మ, దేవతలు వైకుంఠానికి వెళ్లలేదు. విష్ణువే వారి దగ్గరికి వచ్చాడు.
7.రాముడిగా పాలిస్తానని చెప్పింది పదకొండు వందల సంవత్సరాలు కాదు. పదకొండు వేల సంవత్సరాలు.

మీ ప్రశ్నకి జవాబు
శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పేరు ఏమిటి?
నగరం పేరు పుష్కలావతి/ పురుషపురం
పెషావర్, పాకిస్తాన్

-మల్లాది వెంకట కృష్ణమూర్తి