Others

విలాసం కన్నా విశాలమే అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముళ్లు వేయడం ద్వారా నూలును పాడుచేయొద్దు, మామూలు బట్టలకు పనికిరాని ఖద్దరుతో జెండాలు తయారుచేసి ఉపయోగించండి. చిరునామాలను అచ్చువేయకుండా, చేతిరాత బాగున్నవారితో రాయిస్తే సొమ్ము ఆదా అవుతుంది. సూచికలను ఒక మంచి కాగితం మీద చక్కని దస్తూరి ఉన్నవారితో రాయించి, వాటిని ఖాదీ వస్త్రానికి కుట్టించండి. ఆ అక్షరాల వెంబడి చిన్నపిల్లలైనా ఎంబ్రాయిడరీ చేయగలుగుతారు. వారికి రంగు దారాలిచ్చి ఆ పని చేయించండి’’- ఆయన సూచనలు ఇలా ఉండేవి. ఇంటి లోపలి అలంకరణలకు సంబంధించి ఆయన ఆలోచనలు విశిష్టంగా ఉండేవి. తివాసీలతో, కుర్చీలతో, అలంకార వస్తువులతో గదులను నింపేయడం ఆయనకు నచ్చేది కాదు. కిటికీలకు తెరలు వేయడం మీద ఆయనకు మోజు లేదు. ఒకసారి ఆయన ఒక ధనికుడైన దక్షిణాది వర్తకుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు. అక్కడ ఆడంబరంగా వున్న అలంకార వస్తువుల సేకరణ ఆయనకు నచ్చలేదు. ‘‘ఈ వస్తువులన్నిటిమధ్యా నాకు చాలా ఇరుకుగా అనిపించి, ఊపిరాడటంలేదు.
వాటి మధ్యలో గాలి ఆడేందుకే చోటులేదు. మీరు అలంకరించిన బొమ్మలో కొన్ని మురికిగా, అసభ్యంగా ఉన్నాయి. మీరు నాకు చెట్టినాడ్‌లోని అన్ని భవనాలనూ అలంకరించే పని గుత్తకు ఇస్తే, నేను ఇవే భవనాలను, మీరు పెట్టినదానిలో పదోవంతు ఖర్చుతో, ఇంతకంటే గాలి వెలుతురూ బాగా వచ్చేలా సౌకర్యవంతంగా అలంకరించగలను. మీ గదులు చాలా అందగా అలంకరించబడ్డాయని దేశంలో ప్రసిద్ధ కళాకారులు ధవీకరిస్తారు కూడా’’ అన్నాడు. ఆయన మాటలు నిజమేనని సేవాగ్రామ్‌లోని ఆయన గుడిసె అలంకరణను నందలాల్ బోస్ మెచ్చుకున్నపుడు రుజువయ్యింది. ‘‘నేల, గోడలు ఆవుపేతో అలికి ఉన్నాయి. ఒక చిత్రపటం కానీ, ఫొటోకానీ, శిల్ప కానీ ఆ గదిలో లేవు. ఒక మూల ఒక చాప పరచి ఉంది. కూర్చొనేందుకు వీలుగా దానిమీద ఒక మడచిన ఖద్దరు దుప్పటి, దిండు వేసి ఉన్నాయి.. రాత బల్లలా ఉపయోగించే ఖద్దరు గుడ్డ పరచిన చెక్కపెట్టెకు ఒకవైపు రావి ఆకు ఆకారంలో వున్న ఇనుప రేకు మూత కింద తళతళలాడుతున్న ఇత్తడి లోటా ఉంది. పరిశుభ్రత, పొందికలతో కూడిన వాతావరణంతో గది చాలా అందంగా ఉంది. నడుం చుట్టూ చుట్టుకున్న ఖద్దరు గుడ్డతోఆయన గదిలో కూర్చొని ఉన్నాడు. ఆయన పెదాలమీద ఎప్పుడూ చిరునవ్వు కదలాడుతోంది. ఒర నుంచి దూసిన పదునైన ఖడ్గంలా మెరుస్తూ కనిపించాడు, ఆయనలో ఖడ్గంలోని హింసాత్మక ప్రవృత్తి తప్ప అన్నీ ఉన్నాయి’’.
పాములవాడు
బాలుడిగా ఉన్నప్పుడు పాములంటే గాంధీ భయపడేవాడు. ఆయన ఒంటరిగా చీకట్లోకి వెళ్ళలేకపోయేవాడు. చీకట్లో దెయ్యాలు, పాములు ఉండి మీద పడతాయని భయపడేవాడు. 35 సంవత్సరాల వయసులో ఆయన సాదా జీవితం గడుపుతూ ఆశ్రమాల్లో జీవించాడు. ఆశ్రమం అంటే ఉండటానికి పనికొచ్చే చిన్న గుడిసె మాత్రమే కాదు. ఒక బావితో కూడిన దొడ్డి, సాగుచేసేందుకు తగినంత భూమి, దానికి ఆనుకొని ఉద్యానవనం ఉండేవి. అది ఊరికి దూరంగా, నగరాల దుమ్ముకూ, శబ్ద కాలుష్యానికీ దూరంగా వున్న ప్రదేశం. అది ఊరికి దూరంగా, నగరాల దుమ్ముకూ, శబ్ద కాలుష్యానికీ దూరంగా ఉన్న ప్రదేశం. గాంధీ ధనికుడు కాదు, కాబట్టి ఆయన చౌకగా వున్న పనికిమాలిన భూములను కొనేవాడు. ఫీనిక్స్ సెటిల్‌మెంట్, టాల్‌స్టాయ్ క్షేత్రం, సబర్మతీ ఆశ్రమం, వార్థా ఆశ్రమం, సేవాగ్రాం వంటి కొన్ని ఆశ్రమాలలో పాములు ఉండేవి. గుడిసెలు నిర్మిస్తున్న సమయంలో, ఆశ్రమవాసులు గుడారాల్లోనివసించేవారు. అక్కడ పిల్లలతో జీవించడం ప్రమాదకరంగా ఉండేది. ఒకసారి పశువుల పాక పైకప్పుకు వేలాడుతూ పాము కనబడేది, ఇంకోసారి జంట పాములు సైకిలు దగ్గర చుట్ట చుట్టుకొని కనిపించేవి. వాటిని ఏం చేయమనేది పెద్ద సమస్య. గాంధీకి అహింస మీద నమ్మకం, ఆయన అంకితభావం గల వైష్ణవుడు. ఆయన సొంత ప్రాణాలను కాపాడుకొనేందుకుకానీ, భార్యాపిల్లల ప్రాణాలు కాపాడేందుకుకానీ చేపలు, మాంసం, పక్షి మాంసాలతో చేసిన ఆహారాన్ని, మందులనూ తీసుకొనేందుకు అంగీకరించలేదు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614