Others

ఎక్కడైనా విచక్షణ అవసరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఖరి చుక్కవరకూ పాలు పిండేందుకు ఆవులనూ, గేదెలనూ హింసిస్తున్నారని తెలిసి ఆయన పాలు తాగడం మానేశాడు. ఇలాంటి వ్యక్తి పాములను చంపగలడా? అందుకే విషపూరితమైన పాములనైనా చంపకూడదనేది సాధారణ నిబంధనగా మారింది. పాములను పట్టుకొని ఆశ్రమానికి సురక్షితమైన దూరంలో వదిలేందుకు తాళ్ళతో ఒక పరికరం తయారుచేశారు. కానీ వాటిని పట్టుకొనేందుకు వీల్లేని చోట కానీ, లేదా ఒక వ్యక్తికి పాము దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకొనే ధైర్యం లేనపుడు కానీ ఏం చేయాలి?
హింసను పూర్తిగా తొలగించడం అసాధ్యమని గాంధీకి తెలుసు. ఆ మాటకొస్తే కూరగాయలను తినడం కూడా హింస కిందకే వస్తుంది. ‘‘పాము కాటుతో పిల్లలు మరణించే పరిస్థితికన్నా పామును చంపడమే సరియైనదని నేను భావిస్తాను. నాకు ఇప్పటికీ పాములంటే భయం ఉంది, అలాంటప్పుడు నేను పాములంటే భయపడవద్దని ఎలా చెప్పగలను?’’ అని ఆయన అయిష్టంగానే అంగీకరించాడు. పామును దూరంగా తరిమేయడానికి అన్ని ప్రయత్నాలూ విఫలమైనప్పుడు పామును చంపేందుకు ఆయన అనుమతించేవాడు.
పాములు పట్టే కళ నేర్చుకోవాలని ఆయనకు గాఢమైన కోరిక వుండేది. కాలెన్‌బాక్ సహాయంతో ఆయన విషపూరితమైన పాముకూ, విషం లేని పాముకూ తేడాలు గుర్తించడం నేర్చుకున్నాడు. ఆచరణాత్మక అధ్యయనం కోసం కాలెన్‌బాక్ ఒక నాగుపామును పట్టుకొని, దానిని బోనులో ఉంచి తన చేతులతో ఆహారం ఇచ్చేవాడు. ఆశ్రమంలోని పిల్లలు దాన్ని చూసేందుకు చాలా ఆసక్తి చూపేవారు. తమ కొత్త స్నేహితుడిని ఎవరూ వేధించేవారు కాదు. ఇదంతా గాంధీకి సంతోషంగా లేదు. ఆయన కాలెన్‌బాక్‌తో ‘‘దాని అలవాట్లు, పద్ధతులూ తెలుసుకొనేందుకు మనం దానిని బంధించాం. మన స్నేహం ఆ నాగుపాముకి అర్థం కాకపోవచ్చు. నీకుగానీ, నాకుగానీ దానితో ఆడుకొనే ధైర్యం లేదు. నీ స్నేహం భయానికి అతీతమైనది కాదు. పామును పెంచుకోవడంలో ప్రేమ లేదు’’ అన్నాడు. మనుషులు నాతో నిజమైన స్నేహితులుగా లేరని బహుశా ఆ పాముకు కూడా అర్థమైనట్లుంది, అది ఒక రోజు బోనులోనుంచి తప్పించుకుపోయింది. జర్మనీ దేశస్థుడైన మరొక ఆశ్రమవాసి పాములను భయం లేకుండా పట్టుకోగలిగేవాడు. అతను పాము పిల్లలను పట్టుకొని తన చేతుల్లో ఆడించేవాడు. అంత ధైర్యం పెంచుకోవాలని గాంధీ అనుకొనేవాడు. తాను పాముకు కీడు తలపెట్టడంలేదనే ఉద్దేశం దాని ముట్టుకోగానే పాముకు అర్థమయ్యే దశకు చేరుకోవాలని ఆయన అనుకొనేవాడు. నోటితో రామనామం జప్తి, పాము నోట్లో వేలు పెట్టగలగడమనేది ఆయన దృష్టిలో గొప్ప విజయం. ఆయన జీవితాంతంవరకూ పామునుకానీ, తేలును కానీ చేత్తో పట్టుకోలేకపోయాడు. దానికి ఆయన సిగ్గుపడ్డాడు కూడా.
ముఖ్యమైన పనుల్లో తీరిక లేకుండా ఉన్నపుడు కూడా ఆయన పాముల అధ్యయనం మీద ఆసక్తిని వదిలిపెట్టలేదు. ఒకసారి కొందరు నాయకులు ఆయన సలహా కోసం వెళ్ళేసరికి ఒక పాము ఆయన మెడ చుట్టూ చుట్టుకొని వేళ్ళాడుతుండటం చూస కంగారు పడ్డారు. పాములను ఆడించే వ్యక్తితో మాట్లాడుతూ అతన్నుంచి పాములను పట్టుకోవడం, పాము కాటుకు వైద్యం నేర్చుకోవాలనే తపనతో ఉన్నాడు. ప్రయోగం కోసం ఎవరైనా పాముతో కరిపించుకునేవారు కావాలని ఆ పాములు పట్టువాడు అడిగినప్పుడు గాంధీ అందుకు సిద్ధపడ్డాడు. కానీ ఆయన విలవైన ప్రాణంతో ఆ ప్రయోగం చేయడానికి అతడి సహచరులు ఒప్పుకోలేదు. ఆ విధంగా పాములు పట్టేవాడికి శిష్యుడయ్యేందుకు 70 ఏళ్ల వయసులో లభించిన అవకాశాన్ని గాంధీ వదులుకోవాల్సి వచ్చింది. అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం గాంధీ దక్షిణాఫ్రికా జైలులో ఉండగా ఆయన చిగురు వాచి రక్తం కారడం ప్రారంభించింది. ఆయనకు ఒక నీగ్రో సేవలు చేసేవాడు. ఒకరిభాష మరొకరికి అర్థమయ్యేది కదా. కానీ సైగలతో మాట్లాడుకొనేవారు. ఒకరోజు రక్తం కారుతున్న వేలితో ఏడుస్తూ ఆయన గాంధీ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అతన్నించి సేకరించినవివరాల ద్వారా అతన్ని పాముకరిచిందని గాంధీకి అర్థమయ్యింది.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614