Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం శివం సుందరం
*
సాహస ఔదార్యాలతో శర్వరాల్ని తొలగించి
వెలుతురు పువ్వుల్ని పూస్తాడు-
తరాల్ని ప్రసరింపచేస్తాడు..
కలల్ని
వసంత వాహకాలుగా ఎంత నేర్పుగా వివరిస్తాడని..!
కవి!!
కలలు కనలేని కేవలావయని మనిషి
కాల సమకాలీనుడు కాలేడు- కనీసం కరపత్రంలో అక్షరమైనా
ప్రాణతంత్రుల్ని మీటలేని మనిషి గొంతులో
గూటి దివ్వెపాట తొగరు తలిరు తొడగదని తెలిసి
కవి
తాను మామూలు మనిషై-
ఆర్ద్రతానుభూతుల పుప్పొడి దొనె్నయై
ఆత్మవక్షంమీద
జీవనచక్రాన్ని త్రిప్పుతాడు.. నిద్రపోతున్న
కాల నిరీహత్వానికి కాంతి జ్వాలను అక్షరీకరించి
అందిస్తాడు- కవి యైన మనిషి కదా
నాలో మనిషి కర్తవ్యోన్ముఖుడయ్యాడు...
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404