Others

దేనినైనా ఓర్చుకోవచ్చు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే యన జైలు హాస్పిటల్‌కు హెచ్చరిక పంపాడు. విషం కలిసిన రక్తాన్ని పిండేస్తే బాధ తగ్గుతుందని గాంధీకి తెలుసు. గాయం చేయడానికి అక్కడ పరిశుభ్రమైన కత్తి దొరకలేదు. తన నోటితో పీల్చి ఆ చెడు రక్తాన్ని గాంధీ బయటకు ఉమ్మాడు. నిజానికి చిగుళ్లవ్యాధితో వున్నవాళ్లు చెడు రక్తాన్ని నోటితో పీల్చడం చాలా ప్రమాదకరం. అది గాంధీకి తెలుసు. కానీ ఆయన ఆ నీగ్రో బాధ చూడలేకపోయాడు.
అన్ని పాములూ విషపూరితమైనవి కావనీ, అన్ని పాము కాట్లు ప్రాణాలకు ప్రమాదకరం కాదని గాంధీకి తెలుసు. 12 శాతం పాములు మాత్రమే విషపూరితమైనవి. తన దేశస్థులు, ముఖ్యంగా గ్రామీణులు ఈ పాములు ఆడించే విద్య నేర్చుకోవాలని గాంధీ కోరుకునేవాడు. ఆయన పాముల గురించి తగిన బొమ్మలతో కొన్ని వ్యాసాలు రాశాడు. ‘‘విషపూరితమైన పాములకీ, విషం లేని పాములకీ తేడా మనకు తెలియదు. అందుకే అన్నింటినీ చంపేస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో వ్యక్తులు పాముకాటువల్ల కాక, భయంవల్ల చనిపోతారు. విషపూరితమైన పాములు కూటా వాటిని తొక్కినప్పుడు, లేదా వాటికి ఇబ్బంది కలిగించినప్పుడు తప్ప కాటువేయవు. పాములు చేలల్లోని ఎలుకలు, చెదలు, క్రిమికీటకాలను తిని రైతుకు మేలు చేస్తాయి. కాబట్టి అవి పంట పొలాలకు కాపలాదార్లుగా పనిచేస్తాయని చెప్పవచ్చు. నాగులచవితి రోజున మహిళలు పాములకు పాలు పోస్తారు, అది పాములతో మనకున్న స్నేహానికి ప్రతీక. ఆదిశేషునిపై పవళించిన విష్ణుమూర్తి చిత్రం నాకెంతో నచ్చుతుంది. పడగ విప్పిన పాము కింద తలపెట్టి పడుకోవడంవల్ల దేవుడి సృష్టిలో పాములు భయపడాల్సిన జీవులేం కాదని తెలుస్తుంది’’ అని ఆయన హరిజన్ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఒకసారి చొక్కాలేకుండా ఉన్న చిన్న కుర్రాళ్ళు కొందరు ఆయన గుడిసె వద్ద గుమిగూడటం ఆయన చూశాడు. వాళ్ళు ఒక గాజు జాడీలో పెట్టి వున్న పామునుచూస్తున్నారు. వాళ్ళు దాన్ని పట్టుకుని ఒక వైద్యునికోసం పంపారు. అది కట్లపాము, ప్రమాదకరమైన విషసర్పాలలో ఒకటి. పట్టుకొనే వాళ్లు దాని తలమీద కొట్టారు. దాని వెనె్నముక బాగా ఉంది కాబట్ట మూడు రోజులపాటు చావలేదు, దాన్ని బాధనుంచి తప్పించడానికి చంపి స్పిరిట్‌లో ఉంచారు. పాములు బతికున్నా, మరణించినా వాటిని గ్రామీణుల ముందు ప్రదర్శించాలని గాంధీ భావించేవాడు. బతికున్న పాముల ప్రదర్శన కోసం ఆయన వద్ద ఒక బోనుండేది.
ఒక తాత్వికుడైన స్నేహితుడు గాంధీని ‘‘తనమీద పాము దాడి చేస్తే ఒక వ్యక్తి ఏం చేయాలి?’’ అని అడిగాడు. ‘‘ఆయన దాన్ని చంపకూడదు, ఒకవేళ అది తనను కరిస్తే కరవనివ్వాలి’’ అని గాంధీ జవాబిచ్చాడు. ఆయన ఎప్పుడూ పాములను కొట్టేవాడు కాదు. అవి కూడా ఎప్పుడూ ఆయనకు కానీ, ఆయన ఆశ్రమవాసులకు గానీ చెడు చేయలేదు. గాంధీ చాలాసార్లు వాటి చల్లని స్పర్శను అనుభవించాడు కానీ అవి ఆయనకు తమ కోరల రుచి చూపించలేదు.
ఒక చల్లని సాయంత్రం గాంధీ తన స్నేహితులతో సంభాషిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆయన కూర్చున్న దుప్పటి చివర ఒక పాము కనిపించింది. అది పడగ విప్పి ఉంది. ఆయన స్నేహితుడు గాంధీని కంగారు పడొద్దని చెప్పాడు. గాంధీ అంతకంటే ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్నేహితుడు దాన్ని పడగ వెనుక పట్టుకొని దూరంగా విసిరేశాడు. ఒకసారి భోజనం తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా పాము ఆయన గుండెలమీదకు పాకింది. ఆయన కంగారు పడలేదు. దానంతట అది దిగివెళ్లిపోయేవరకూ ఆగాడు. ఒకసారి గాంధీ ఆస్పత్రిలో ఉండగా ఒక విద్యావంతులైన పాములవాడు వచ్చాడు. పాములను లొంగదీసుకొని ఆడించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు గాంధీ పక్కమీద విషపూరితమైన పాములను వదిలాడు. అవి అక్కడ పడగ విప్పి నాట్యం చేశాయి. గాంధీ ఏ మాత్రం భయపడలేదు. తన కాళ్లు వెనక్కు లాక్కోలేదు, ఆసక్తిగా వాటి నాట్యాన్ని చూశాడు.
ఇంకోరోజు సాయంత్రం ప్రార్థనా సమావేశంలో అందరూ వౌనం పాటిస్తూ ఉండగా ఒక పాము దారి తప్పి అటుగా వచ్చి గాంధీ వైపు పాకింది. ఆయన సహచరులంతా కంగారుపడిపోయారు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614