Others

మగాళ్ళూ మృగాలు కాకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019 అలా వచ్చి ఎనె్నన్నో ఘటనలను, విచిత్రాలను, అనుభూతుల్ని మన కందించి ఇక మీ జీవితాల్లోకి తొంగి చూడను అంటూ అదృశ్యమైపోయింది. జరిగిన సంఘటనలు కోకొల్లలైనా, జీవితాంతం గుర్తుండిపోయేవి, మనందర్నీ ఆలోచనల్లో పడేసినవి మాత్రం చాలానే చెప్పుకోవచ్చు. డిసెంబర్ 21న తెలంగాణాలోని మల్కాజిగిరి మీర్జాలగూడలో జరిగిన సంఘటన మాత్రం సభ్య సమాజాన్ని తట్టిలేపి, మగాళ్ళుగా వున్న మనందర్నీ సిగ్గుతో తలవంచుకొనేలా చేసింది. కొద్దోగొప్పో మానవత్వ లక్షణాలున్న ప్రతి మనిషి గుండెల్ని పిండేసే దుర్ఘటన అది. మగాడిలో ‘కామపిశాచి’ అంత వికృతరూపంలో కూడా వుంటుందా అన్పిస్తుంది. రాజకీయ మసాలాలు రంజురంజుగా హైద్రాబాద్ బిర్యానీల్లా వడ్డిస్తూ రోజు మన ముంగిట పడే తెలుగు దినపత్రికలు మాత్రం ఈ ఘటనకెందుకో అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు లేదు. ఎవరి అభిరుచి వారిదేలెండి. నావరకైతే నిజంగా ఆ వార్త కడుపులో దేవేసింది, డోకు వచ్చేలా చేసింది. ఈ దుర్ఘటన మనలో ఎన్నో సందేహాల్ని, బాధని కలిగిస్తుంది. ఇక అదేంటో ఓసారి తెలుసుకొందాం. మగాళ్ళైతే మాత్రం ఆ పిచ్చి తల్లిని క్షమించమని కోరుదాం! మనసుంటే రెండు కన్నీళ్ళు కార్చండి. లేకుంటే ఓ కథగానే చదివి మరచిపోండి. అది మీర్జాలగూడ గ్రామం. మన బంగారు తెలంగాణాలో ఓ గ్రామం. సాయంత్రం 7 గం.ల సమయం సూర్యుడు ప్రతాపం చూపించి, రాత్రిని చక్కగా చూసుకోమని ‘చంద్రుడి’కి డ్యూటీకెక్కించిన వేళ. ఓ ఇంట్లో ఇద్దరు బేల్దార్‌లు పీకలదాకా మద్యం సేవించి, ఆ మత్తు తృప్తిని ఈయకపోగా ఇంకేదో కావాలని ఆలోచన, ఆరాటం. ఆకలైన పులి అడవిలో ఆ క్షణానికి ఏ జంతువు దొరికినా అమాంతం పడి మింగేస్తుంది. ఇది ఆ జాతి సహజం. అలాంటి ఆకలి- కామవాంఛ రూపంలో ఆ ఇద్దరి బేల్దార్లను కమ్మేసింది. అమ్మా అంత భిక్షం పెట్టండి ఆకలేస్తోందంటూ అప్పుడే ఓ యాచకురాలు వీళ్ళ ముంగిట ఆగి ఆశతో కేకవేసింది. ఆ కేక వాళ్ళలో కోటి ఆశలు రేపెత్తాయి, కోరికలు గుర్రాలైనాయి. పశుప్రవృత్తి వీరి మనసుల్లో ఆవహించింది. వేటలో వున్న పులికి కాలికి ముల్లుగుచ్చుకొని నడవలేని స్థితిలో ఓ మూల కూర్చున్న జింక పిల్ల కన్పిస్తే, దానికి సహాయం చేయాలనుకోదు. మరి మన ఇద్దరు బేల్దార్లు పులులు కాదే. మనుషులు-మగ పురుషులు. మామూలు వాతావరణంలో అయితే సద్దెన్నం మిగిల్తే కాస్తావేస్తాం లేదంటే ఏం లేదు పో అంటూ ఓ కసురు కసురుతాం. ఇది నాకు తెలిసిన వాస్తవం. మరి మన ప్రబుద్ధులకు ఎక్కిన మత్తు మృగాల్ని చేసింది. అంతే అన్నం పెడతాం రమ్మంటూ లోనికి పిలిచారు. కబుర్లలో దించారు. బలవంతంగా మద్యం తాగించారు. ఇంకేముంది ఆమెపై పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకొన్న ఆ భిక్షగత్తె కేకలు పెట్టింది. ఆ అరుపులు విన్న చుట్టుప్రక్కలవారు 100కు ఫోనుచేసి పోలీసుల్ని రప్పించారు. పోలీసులు కామాంధుల్ని లాక్కెళ్ళారు. ఇది కథ కాదు.. జరిగిన ఘటన. ఒక్కసారి హృదయ లోతుల్నించి ఆలోచించండి. తూ. భిక్షగత్తే కదా అని కొట్టిపారేయకండి. ఆమె కూడా మనతోటి మహిళల్లా ఒక స్ర్తి. విధి వంచితురాలై, దురదృష్టంతోడై జానెడు పొట్ట నింపుకోవాలన్న ధ్యాసతో భిక్షగత్తెగా మారింది. మరి అది ఆమెకు శాపమా? లేదా మన మగజాతి చేసిన ద్రోహమా? ఈ దేశానికి ఏమొచ్చింది? మగాళ్ళెందుకు తోడేళ్ళులా, మృగాలుగా ఎందుకు మారుతున్నారు. ఇలాంటి దుర్మార్గాలు, అరాచకాలు ఆగవా! ఆకలితో అలమటించే ఆడదానికి పట్టెడు అన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వాలు, సమాజం తీసుకోలేవా? ప్రతిరోజూ పత్రికల్లో ఇలాంటి హృదయ విదారక సంఘటనలు ఎన్ని చూడడం లేదు?
మరికొన్ని ఘటనలు కూడా మనందరం కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందు ఒక్కసారి మననం చేసుకొంటూ పరిశీలిద్దాం. దయవుంచి ఈ జరిగిన సంఘటనల్ని స్వాతి, జ్యోతి లాంటి వారపత్రికల్లోని కథలుగా మాత్రం చదివి ఆనందించకండి. మీకలాంటి అభిలాషే వుంటే దయవుంచి చదవకండి ప్లీజ్.. అచ్చులో పేరుకోసమో, పది మంది మెప్పుకోసమో నేను ఇవి రాయడం లేదు. నా కలంలోని రాతల్లో చూడాల్సింది ఇంకు దానిలో కలిసిన కన్నీళ్ళను చూడండి. ఈ అక్షరాలు నా కలం గీసినవి కావు, నా గుండె పిండేసినవి.
సెప్టెంబర్ 26వ తారీఖున కేరళలోని మళపురం గ్రామంలో 12 ఏళ్ళ ఓ చిన్నారి వ్యథ గురించి తెలుసుకొందాం. ఆ అమ్మాయిపై దాదాపు 30 మంది గత రెండేళ్ళుగా అత్యాచారం చేస్తూనే వున్నారు. ఆ బాలిక 7వ తరగతికి ప్రవేశించింది. అది కౌన్సిలింగ్ సమయం. ఆ చిట్టితల్లి చాలా ముభావంగా వుండడం, ఏ ప్రశ్నకు సరిగా జవాబు చెప్పకపోవడం ఆ టీచర్లకు ఏదోలా అన్పించింది. గుచ్చిగుచ్చి అడిగారు.. కూపీ లాగారు. అంతకాలం గుండెల్లో దాగిన మనోవ్యథ, కన్నీళ్ళ రూపంలో కట్టలు తెంచుకొన్నాయి. అసలు విషయం అక్కడ అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తండ్రి అనే ఓ ప్రబుద్ధుడు అప్పుతీర్చలేక తన స్నేహితుడికి తన గారాల బిడ్డను అప్పగించేశాడు. అంతే ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయితో వ్యాపారం చేసుకొన్నాడు. ఎంతటి హృదయ విదారకం ఇది! కన్న తండ్రేనా ఆ దుర్మార్గుడు.
డిసెంబర్ 12న రాజస్థాన్‌లో మరో దురంతం వెలుగులోకొచ్చింది. రాజస్థాన్‌లోని జలోరా జిల్లాలో ఓ ఊరు. తండ్రి మరో మహిళతో గడపడం బిడ్డ ఓసారి చూసేసింది. అంతే తండ్రిలో రాక్షసత్వం నిద్ర లేచింది. ప్రపంచంలో ఏ తండ్రి చేయకూడని పని చేశాడు. కూతుర్ని మంచానికి గొలుసులతో కట్టేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. బ్రహ్మంగారు చెప్పింది నిజమే అయితే ప్రళయం వచ్చి, ఇలాంటి ఘటనలు జరగ్గానే ప్రపంచమంతా కొట్టుకుపోవాల్సిందే. ఏదీ ఏం కాలేదు! అందరం హాయిగా జీవిస్తూ ఇలాంటి కథల్ని చందమామ కథల్లా ఆస్వాదిస్తున్నాం. ఛీ.. ఛీ..
ఇక మరో కోణంలోని సంఘటనలను కూడా పరిశీలిద్దాం. మార్చి 20న తుర్కపల్లిలో అందరూ హోలీ చేసుకొంటున్నారు. కొందరు దుండగులు ఫుల్‌గా మందుకొట్టి అక్కడ ఆడుకొంటున్న 5 ఏళ్ళ పాపను రంగులిస్తాం రమ్మని పిలిచి, పొదల చాటుకు తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఆ మృగం పేరు రాజేష్‌కుమార్.
విశాఖలో కూడా 15 నెలల పసి పాపను ఓ డ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడు. ఇది ఊహకందని ఘటన. కామం పూర్తిగా కళ్ళను కమ్మేసింది. అందుకే ఆ దుర్మార్గుడు అంత చిన్ని కూనను నలిపేశాడు.
నవంబర్‌లో మదనపల్లి దగ్గర ఇలాంటి మరో హృదయ విదారక ఘటన చోటుచేసుకొంది. అక్కడో పెళ్ళి జరుగుతున్నది. అక్కడో మానవ మృగం ఫొటోలు తీస్తానంటూ ఓ ఐదేళ్ళ చిన్నారిని పిలిచాడు. లోకం తీరే తెలియని ఆ పసికూన ఉత్సాహంగా ఫొటోలకోసం వాడి వెంట నడిచింది. వాడు పక్కకు తీసుకెళ్ళి చిదిమేసి చంపేసి పరారైనాడు. జూన్ 19న వరంగల్ జిల్లాలోని హనుమకొండ దగ్గర గుండెల్ని పిండిచేసే ఓ ఘటన చోటుచేసుకొంది. 9 నెలల పసిపాప డాబాపై తల్లిదండ్రుల ప్రక్కన హాయిగా నిద్రపోతున్న సమయంలో, 28 సం. వయస్సున్న ప్రవీణ్ అనే ఓ యువ దయ్యం ప్రవేశించింది. చిన్నగా ఆ పసిపాపను ఎత్తుకెళ్ళి ఎవరూ లేని ప్రాంతంలో అత్యాచారం చేసి చంపేశాడు. లేచేసరికి ప్రక్కన పాప కన్పించకపోవడంతో ఆ తల్లిదండ్రులు భయాందోళనలతో చుట్టుప్రక్కలంతా వెతకసాగారు. సమీప ప్రాంతంలో నిర్జీవంగా పడివున్న పాప కన్పించింది. గుండెలు పగిలేలా రోధించారు.
జనవరి 2018లో 9 నెలల పసిపాపపై జరిగిన అత్యాచారం ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించి, ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లిదండ్రులు పనిలోకి వెళ్తూ తమ ఇద్దరు పిల్లల్ని చూసుకోమని వాళ్ళ కజిన్‌కు అప్పజెప్పి వెళ్ళారు. ఇద్దరిలో ఒకపాప వయసు 9 నెలలు, మరో బాబు వయసు 2 సం.లు. ఇంటికొచ్చి చూసిన తల్లిదండ్రులకు రక్తపు గాయాలతో కన్పించిన పసికూన కన్పించింది. తల్లడిల్లి పోలీసులకు చెప్పారు. కజిన్ రూపంలోని ఆ దుర్మార్గుడు నేరం అంగీకరించాడు.
అక్టోబర్ 31న గుంటూరులో జరిగిన ఘటన. పాత్రధారి భార్గవి. కన్నతల్లి మరోచోట వొంటరిగా జీవితాన్ని గడుపుతుండేది. తల్లి మరణిస్తే తన పేరుపై వున్న ఆస్థికూడా తనకు దక్కుతుందని భార్గవి భావించింది. అంతే పథకంవేసి తల్లిని మట్టుపెట్టింది. ఇందుకు ఆమె భర్త, మరో ప్రియుడి సహకారం కూడా తీసుకొంది. డబ్బు వ్యామోహం ఆమెలోని తల్లి ప్రేమను తుడిచిపెట్టాయి. ప్రేమ, అనురాగం అన్నీ మట్టి కొట్టుకుపోయాయి.
మానవజన్మ చాలా గొప్పది. దేవుడు మనకు ప్రసాదించిన వరం. మరి మనం ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే గానీ క్షణికానందం కోసం మృగాలుగా మారకూడదు. మనుషులు మృగాలు కానంతవరకు ఈ సమాజంలో మనం ఎలాంటి దుర్వార్తను వినలేం.
వ్యాసం ముగిస్తున్న సమయంలో 2019 సంవత్సరానికి వీడ్కోలు పల్కుదామనుకొంటున్న సమయంలో మరో దుర్మార్గపు ఘటన చెవిని పడింది. ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్‌లో గత నెల విద్యార్థినులకు పరీక్షలు చేస్తుండగా ముగ్గురు గర్భవతులుగా తేలింది. ఈ నెల పరీక్షల్లో మరో బాలిక కూడా గర్భవతిగా తేలడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అత్యంత దుర్భర విషాద ఘటన ఇది. ఆ గిరిజన పిల్లల్ని వంచించిన ఆ మానవ మృగాలెవరో? కల్లాకపటం తెలియని పసిమనసులు వారివి. అలాంటి వారిని కూడా మోసంచేస్తారా? ఏమిటీ రాక్షసత్వం. ఇలాంటి దురాగతాలకు అంతం లేదా? ఆ మగ తేళ్ళను ఏం చేయాలి?

- సమ్మెట, 8886381999