Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం శివం సుందరం
*
జీవిత పర్వతారోహణలో స్మృతుల
బలీయత శిఖరానే్న చూస్తుంది
పాటకు ఱెక్కలు వస్తేనే గంగను ఎగరేసుకుపోతుంది పక్షి
ఎవరి కవితకు ఋతువు ప్రతిస్పందిస్తుందో- ఆ
చేతన ‘అంతరగాంధారా’మై
‘కడలి గడప మీద గొంతు జండా’ నెగరేస్తుంది..
ఏటా ఈ ఋతువొస్తుంది; దీనంగా వంగిన కొమ్మమీద
పూలదీపం వెలిగిస్తుంది, గాలికి తూలి గంద వొడిని
ఒలకబోసుకుంటుంది.
పక్షిగొంతు తీయదనాన్ని పాట చేసుకొని
పరిసర శ్యామావిష్కృత వక్షంమీద
పరిమళపు పచ్చబొట్టును పొడుస్తుంది
ఎవరు పిలిచారు ఈ కందువ ‘కొమ్మ’ని
దిసమొలకు కిసలయాన్ని వసనంగా కడుతుంది
పొద్దుకు
ఈ పొలతుక పూలకల కనడానికి రంగుల వలని విసురుతుంది
గాలి వేస్తున్న మబ్బుల చిత్రాని గగనాన్నందించి
కిరణాల కుంచెతో తరుణాన్ని పూస్తుంది
రెమ్మలు చివుళ్ళు మొగ్గలు పువ్వులు తావులు- వీటితో
ఉదయ మారుతంలో ఊగుతున్న శాఖ
నా కంటికి చెంగలి సొబగు నందిస్తుంది
ఒక కొత్త ఆకాశం ఒక కొత్త తరం మీద
తేనె పుప్పొడిని రాలుస్తున్న సూర్య సుమాన్ని విరిసింది...
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404