Others

విచక్షణతో ఆలోచన సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గందరగోళం పామును మరింత కంగారు పెట్టింది. అది జరజరా వచ్చి గాంధీ కూర్చున్న దుప్పట్లో దూరింది. గాంధీ అందరికీ కంగారు పడొద్దని సైగలు చేసి తన ప్రార్థన కొనసాగించాడు. కొద్దిసేపట్లోనే పాము నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయింది. గాంధీ ప్రవర్తన గురించి ఆయనను ప్రశ్నించినపుడు ‘‘ఒక్క క్షణం నాకూ భయం వేసింది. అయితే వెంటనే సర్దుకున్నాను. పాము నన్ను కరచినా, దాన్ని కొట్టకుండా వదిలేయమనే చెప్పేవాడిని’’అన్నాడు.
పురోహితుడు
బ్రహ్మచారి జీవితం, స్వచ్ఛంద పేదరికం గాంధీ స్వీకరించినపుడు మానవతావాద సేవ చేద్దామనుకుంటున్నవారు వివాహం చేసుకోకుండా ఉండాలని చెప్పాడు.
ఆ ఆలోచన ఆయనలో నాటుకొనే ముందు ఆయన తన అవివాహిత స్నేహితులందరికీ వివాహాలు చేయడానికి ప్రయత్నించాడు. అందరూ కలిసి ఒక పెద్ద కుటుంబంలో సభ్యుల్లా ఉండాలని ఆయన భావించాడు. భారతీయ సహచరులను భార్యలతో సహా దక్షిణాఫ్రికాకు రావాలని సూచించేవాడు. తనఆంగ్లేయ మిత్రులైన వెస్ట్, పోలాక్‌లను త్వరగా పెళ్లి చేసుకోమని వత్తిడి చేశారు. పోలాక్ తనకున్న ఆర్థిక సమస్యల కారణంగా వివాహానికి సంకోచించాడు. మనసులు కలసిన తర్వాత చాలా రోజుల క్రితం కుదుర్చుకున్న సంబంధాన్ని వాయిదా వేయడం మంచిది కాదని గాంధీ అతనికి నచ్చజెప్పాడు. పెళ్లికూతురు ఇంగ్లాండునుంచి దక్షిణాఫ్రికా వచ్చిన మర్నాడే పోలాక్ ఆమెను పెళ్లాడాడు. గాంధీ పెళ్లి ఏర్పాట్లన్నీ స్వయంగా చేశాడు, తోడుపెళ్లికొడుకుగా వ్యవహరించాడు కూడా.్భరతదేశంలో ఆయన ఆశ్రమాలలో గాంధీ కొన్నిసార్లు పురోహితుడిగా వ్యవహరించేవాడు. పెళ్లిచేయడం, పురోహితుడిగా వ్యవహరించడంలో ఆయన పద్ధతి సంప్రదాయబద్ధంగా ఉండేది కాదు. భారతీయ వివాహ పద్ధతిని సంస్కరించాలని గాంధీ ప్రయత్నించాడు. చాలా సంప్రదాయాలను తిరస్కరించాడు. వరకట్నం, ఆస్తిపాస్తులు, విద్యార్హతలు, ఉన్నత వంశం ఇవన్నీ ఒక పెళ్లి కుమార్తెను లేదా పెళ్లికుమారుడిని మెరుగైన అభ్యర్థిగా చేసే అర్హతలు కావని ఆయన భావించేవాడు. ఆరోగ్యం, వ్యక్తిత్వం, శారీరక శ్రమ చేయడానికి తగిన ధృడత్వం- ఇవీ అవసరమైన అర్హతలు. ఆయన చేసిన ఒక పెళ్లిలో వధూవరులు ఇద్దరూ ఖాదీ వస్త్రాలు ధరించారు. అగ్నిహోత్రం ముందు ఇద్దరూ ఖద్దరు నూలు దండలు మార్చుకున్నారు. అవి తప్ప వారు మరే ఆభరణలా ధరించలేదు. వాళ్లు వేదమంత్రాలు పఠించారు. వరుడికి కట్నం కానీ, ఇతర ఖరీదైన బహుమతులేవీ ఇవ్వలేదు.
వరకట్న దురాచారాన్ని గాంధీ ఖండించాడు. మహిళలను బానిసలుగా భావిస్తున్నందుకు కళాశాల విద్యార్థులను తీవ్రంగా విమర్శించాడు. భార్యలను గృహాలకు, హృదయాలకు మహారాణులుగా చేయకుండా అమ్మకానికీ, కొనుగోళ్లకూ అనుకూలమైన చరాస్తులుగా మార్చేశారు. భార్యలను ‘అర్థాంగి’ అంటారు, అంటే శరీరంలో సగభాగం అని అర్థం కదా! ‘‘నాకే ఒక అమ్మాయి ఉంటే కట్నం అడిగేవాడికి ఇచ్చే బదులు ఆమెను జీవితాంతం అవివాహితగానే ఉంచేస్తాను’’ అనేవాడాయన.
పెళ్లివిందుల్లో ఆడంబరమైన, ఖరీదైన ఏర్పాట్లు ఆయనకు ఇష్టం ఉండేవి కావు. ఈ ప్రజాస్వామ్యపు రోజుల్లో మతపరమైన కార్యక్రమాలకు పది రూపాయల కన్నా ఎక్కువ ఖర్చుపెట్టకూడదని ఆయన విశ్వాసం. మతపరమైన ప్రక్రియలు తప్ప మరేవీ వివాహంలో తప్పనిసరి కాదని ఆయన భావన. కానీ మన దేశంలో అత్యంత పేదలు కూడా గాంధీ భావనలోని ఉన్నత స్థాయిని అమలుచేసేందుకు ఇష్టపడరు. పెళ్లిళ్లకూ, శ్రద్ధాకర్మలకూ ఖర్చుచేసి అప్పుల పాలవుతున్న రైతులతో ‘‘నన్ను మీ పురోహితుడిగా పెట్టుకోండి. మీ ఇంట్లో కార్యక్రమానికి ఎంత తక్కువ ఖర్చవుతుందో చూడండి’’ అనేవాడు. శ్రాద్ధకర్మను అందరూ చూస్తున్నట్లుగా ఆయన చూచేవాడు కాదు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614