Others

భేదం లేని ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన హిందువునని చెప్పుకుంటూనే ఆయన కులాంతర, మతాంతర, ప్రాంతాంతర వివాహాలను ప్రోత్సహించేవాడు. ఇలాంటి ప్రతి పెళ్లి భారతజాతిలో ఐక్యతను పెంచేందుకు ఉపయోగపడుతుందని ఆయన విశ్వసించేవాడు. గుజరాతీ వైశ్యుడు అయినా ఆయన చివరి కొడుకు తమిళ బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకొన్నప్పుడు ఆయన ఆనందించాడు. గాంధీమీద వైష్ణవభక్తులైన ఆయన తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంది. 12 ఏళ్ళ వయసు నుంచే ఆయన అంటరానితనాన్ని పాపంగా భావించేవాడు. 17 సంవత్సరాల వయసులో ఆయన కుల మత భేదాలకు అతీతంగా మానవులను ఒకటిగా చూడటం నేర్చుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో ఆయన భగవద్గీత, బైబిలు, ఇతర మత గ్రంథాలు చదివాడు. ‘‘మా మతమే సత్యం, మిగిలిన మతాలన్నీ అసత్యం’’ అని ఏ మతంవారు చెప్పినా అది మూర్ఖత్వం అని ఆయన విశ్వసించేవాడు. ఆయనకి గీత, ఉపనిషత్తులు క్షుణ్ణంగా తెలుసు. వేదాలలో కొంత భాగం చదివాడు. కేవలం బోధించేందుకు, ఉటంకించేందుకు శ్లోకాలను ఆయన వాడేవాడు కాదు. వాటి భావాన్ని నిత్య జీవితంలో అమలు చేసేందుకు ప్రయత్నించేవాడు. అనేక మతాల అధ్యయనం ఆయనకు మత సహనాన్ని, బాధలను ధైర్యంగా భరించడాన్ని నేర్పింది. భౌతిక శక్తులపై ఆధారపడేవారు తప్పుడు మతాన్ని ప్రచారం చేస్తే, మానసిక శక్తులపై ఆధారపడినవారు నిజమైన మతాన్ని ప్రచారం చేస్తారని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన ఉద్దేశ్యంలో మత మార్పిడిలు అర్థంలేని పని. హిందూ, సిక్కు, బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవ మతాల ప్రాథమిక సిద్ధాంతాలను ఆయన తడుముకోకుండా వివరించగలిగేవాడు. ఆయన తరచు చర్చిలలో ప్రార్థనా సమావేశాలకు వెళ్ళేవాడు. ఒకసారి ఆయన హిందూ ధర్మంమీద నాలుగు ప్రసంగాలు చేశాడు కూడా. వాటిల్లో ఆయన ఒక్కో మతం ప్రత్యేకతను వివరించాడు.
ఆయన క్రీస్తు బోధనలను ఎంత కచ్చితంగా ఉటంకించేవాడంటే కొందరు యూరోపియన్లు ఆయన పుట్టుకతో క్రైస్తవుడేమో అనుకొనేవారు. ఒక క్రిస్మస్ రోజు ఆయన ఓడపై వున్నపుడు సహప్రయాణీకులు ఆయన్ను క్రీస్తు బోధనలపై ఉపన్యసించమన్నారు. సామూహిక ప్రార్థనా సమవేశాలలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఖురానులో ఆయతులను పాడేవాడు. దీన్ని హిందూ, ముస్లింలిద్దరూ వ్యతిరేకించారు.
హిందూ మతం గురించి గాంధీకి సాహసోపేతమైన అభిప్రాయాలుండేవి. ఆయన కుల అసమానతలను ఖండించాడు, ఇది సంప్రదాయవాదులైన హిందువులకు కోపం తెప్పించింది. వారు నల్లజెండాలతో ప్రదర్శనలు చేశారు. చెప్పుల దండలు వేశారు, చంపేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన ‘‘హిందూమతంలో అంటరానితనం తప్పనిసరి అయితే నేను హిందువుగా ఉండలేను. మన మతం అహింస మీద ఆధారపడింది. అహింస అంటే ప్రేమ తప్ప మరొకటి కాదు, మన ఇరుగు పొరుగువారిని స్నేహితులనే కాక శత్రువులను కూడా ప్రేమించగలగడమే నిజమైన అహింస’’ అనేవాడు. అందరికీ ప్రవేశం లేని దేవాలయాల్లోకి ఆయన వెళ్ళేవాడు కాదు. చాలా సంవత్సరాల విజ్ఞప్తుల తర్వాత అనేక దేవాలయాలలో హరిజనుల ప్రవేశానికి అనుమతులు వచ్చేలా ఆయన చేశారు.
ఆయన ఉద్దేశ్యంలో దేవుడు సత్యం, మతం ఒక జీవన విధానం. ప్రతి నీటి బొట్టులోనూ, ధూళికణంలోనూ దేవుడున్నాడు. ఆకారం లేని దేవుడిని పూజించడమే గాంధీకి ఇష్టం. అలా అని ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకి కాదు. ఎందుకంటే, ‘‘విగ్రహాలను పూజించేవారు దాన్నొక రాతి విగ్రహంగా కాక, దైవ స్వరూపంగా చూస్తున్నారు’’. విగ్రహారాధన గురించి ఒకసారి టాగూర్‌తో వాదిస్తూ, ‘‘చెట్టు కింద బలిపీఠంగా వాడే ఎర్ర రంగు పూసిన రాతి ముక్క కూడా అవసరమే. వికలాంగుడికి వాడి కాళ్లమీద వాడు నిలమడి నడవడం నేర్పకుండా చంక కింద ఊతకర్ర లాగివేయడం అన్యాయం కదా!’’ అన్నాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614