Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చులకనగఁ జూడరాదితరులను మనము
స్వప్నమందైన నితరుల పరువుదీయ
రాదు మానవపుట్టుకయందు బుద్ధి
వక్రమార్గానఁ బోరాదు పాటిగాదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఇతరులనెప్పుడూ మనం చులకనగా చూడకూడదు. కలలో కూడా ఇతరుల పరువుప్రతిష్ఠలను దెబ్బతీయరాదు. ఉదాత్తమైన ఈ మానవపుట్టకలో మన బుద్ధి వక్రమార్గాన పోరాదనియు, ఇవి ఎంతమాత్రం న్యాయం కాదన్న విషయాన్ని కర్మసాక్షియైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించుస్వామీ.
తే.గీ. సొమ్ములున్నను చాలిక సుమ్మి యనుచుఁ
దెలివిఁ దప్పుచు ఁ దిరుగాడు వీరుఁ గనిన
వింతగనుఁ దోచుచుండెనే వెఱ్ఱితనము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!

భావం: ఈరోజుల్లో సొమ్ములుంటే చాలనుకొని తెలివి తప్పి మసలుకునే మనుషుల తీరుతెన్నులు వింతగా అనిపిస్తున్నాయి. సంపదలే శాశ్వతం అనుకోవడం వెఱ్ఱితనమే అవుతుందని, అవసరానికి మించిన ధనం అధర్మాన్ని ప్రేరేపిస్తుందనే విషయాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుస్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262