Others

ద్వేషాన్ని ప్రేమతో జయంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలాగే చెట్లను పూజించడానికి ఆయన వ్యతిరేకి కాదు. ‘‘ప్రకృతి ఆరాధనకు సంబంధించిన ఉద్వేగపూరితమైన, కవితాత్మకమైన అందమైన విషయం అది. భగవంతుని గొప్పదనానికి సాక్ష్యమైన శాకాహారం పట్ల మన గౌరవానికి వృక్షారాధన ప్రతీక’’.
గాంధీగారి గుడి’ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆశ్రమంలో ఆయన పాదాలను తాకి నమస్కరించడం నేరం. మాతృదేశానికి సేవ, దరిద్ర నారాయణుల సేవ, స్వేచ్ఛ, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం అనేవి తన దేశస్థులకు గాంధీ ఉపదేశించిన మంత్రాలు, స్వార్థ త్యాగం అనే ఉన్నతమూ, సాహసోపేతమైన కళను ఆయన జీవితంలోని వివిధ పార్శ్వాలలో ప్రదర్శించి చూపాడు. ‘మానవులు అహింస ద్వారా హింస నుంచి బయటపడాలి, ద్వేషాన్ని ప్రేమతో జయించాలి’ అని ఆయన విసుగులేకుండా చెబుతూనే ఉండేవాడు.
గాంధీ చాలా చురుకైన జీవితాన్ని గడిపాడు. రోజువారి త్యాగం, శారీరక శ్రమ లేదా కర్మయజ్ఞం చేయకుండా భోజనం చేస్తే దొంగతనం చేసినట్లే అనే భగవద్గీత బోధనతో ఆయన ఏకీభవించాడు. ఆయన ఏదో ఒక రకమైన శారీరక శ్రమచేయకుండా ఏ రోజూ గడపలేదు. ఆయన ఎప్పుడూ అబద్ధాలాడలేదు. ఎప్పుడూ ఏ జీవినీ హింసింసలేదు, ఏ వ్యక్తినీ దూషించలేదు.
సూర్యోదయానికి ముందే లేచేవాడు, ఉదయమూ, సాయంత్రమూ ప్రార్థనలు చేసేవాడు. ఆయన ప్రార్థనల గీత, ఉపనిషత్తులు, ఖురాను, జెంద్-అవెస్తాల నుంచి ఎంపికచేసిన ప్రార్థనా శ్లోకాలుండేవి. నేలమీద వున్నా, సముద్రం మీద ఉన్నా; రైల్లో ఉన్నా, ఓడమీద ఉన్నా, ముస్లిం, క్రైస్తవ, అంటరానివారి ఇళ్లల్లో ఉన్నా, గ్రామం నుంచి గ్రామానికి కాలినడకన ప్రయాణిస్తున్నా ఆయన ప్రార్థనను మానుకొనేవాడు కాదు. జైలు జీవితంలోనూ ఇది కొనసాగింది. ఆయన దృష్టిలో ప్రార్థన అంటే కేవలం నోటితో పలికే మాటలు కాదు, అది దేవుని పట్ల సజీవ విశ్వాసం.
ప్రార్థన లక్ష్యం దేవుడిని మంచి చేసుకోవటం కాదు, మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవటం. 36 ఏళ్ల వయసులో ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించడం ప్రారంభించాడు. ఫీనిక్స్ సెటిల్‌మెంటులో సామూహిక ప్రార్థనలు ప్రారంభించాడు. ప్రతి సాయంత్రమూ భజనలూ, క్రైస్తవ భక్తిగీతాలూ పాడేవారు. ఆయన చివరి రోజుల్లో సామూహిక ప్రార్థనా సమావేశాలలో చప్పట్లతో రామభజన చేయాల్సిందిగా ప్రజలను ఆహ్వానించేవాడు. భారతదేశమంతా ప్రార్థనా సమాశాలతో కళకళలాడాలని గాంధీ కోరిక.
మోసకారితనాన్ని గాందీ తట్టుకోలేకపోయేవాడు, కానీ ఇతరులను వారి తప్పులను శిక్షించేవాడు కాదు. ఎవరైనా అబద్ధాలు చెబితే, తప్పులు చేస్తే వారికి పవిత్రత చేకూరేందుకు తానే ఉపవాసం చేసేవాడు.
ఈ పురోహితుడు అనేకసార్లు అనేక దేవాలయాల్లో విగ్రహాలు స్థాపించాడు, దేవాలయాల ప్రారంభోత్సవాలు చేశాడు. పాఠశాలలకు, వైద్యశాలలకు శంకుస్థాపనలు చేశాడు. నౌఖలిలో మస్లిం దండయాత్రలో నాశనం చేసిన దేవుని విగ్రహాన్ని గాంధీ పునఃప్రతిష్ఠించాడు. ఢిల్లీలో లక్ష్మీనారాయణ దేవాలయాన్ని, వారణాసిలో భారతమాత దేవాలయాన్ని, సేలూలో హరిజనుల కోసం దేవాలయాన్ని, రత్నగిరిలో ఆంజనేయస్వామి దేవాలయాన్ని ప్రారంభించాడు. రత్నగిరిలో ఆయన ‘నాకు ఆంజనేయుడంటే అపారమైన శారీరక బలానికి ప్రతీక కాదు, అంతకంటే ఎక్కువ బలం రావణుడికి కూడా ఉంది. ఆంజనేయుడికి ఉన్నది ఆత్మబలం- బ్రహ్మచర్యం, రామభక్తి ఫలితంగా ఆయనలో అభివృద్ధి చెందిన ఆత్మబలం’’ అన్నాడు
రామనామంలో గాంధీకి వున్న విశ్వాసం అచంచలమైనది. ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఒక హిందూ మతోన్మది ఆయనను కాల్చినప్పుడు కూడా ఆయన నోట్లోంచి వచ్చి ఆఖరి మాట ‘హే రామ్’.

అయిపోయింది
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614