Others

విశ్వానికి మార్గదర్శి.. హిందుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచమంటే ఏమిటి..? భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా... ఇలా వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రజలే ప్రపంచమంటే! ఈ ప్రజలలో ఆస్తికులున్నారు, నాస్తికులున్నారు, భౌతికవాదులున్నారు. ఇంకా అనేక రకాల ఆలోచనా ధోరణులున్నవారున్నారు. ఈ ప్రపంచాన్నీ, సకల చరాచర జగత్తునూ నడిపే పరమశక్తి ఒకటుంది. అది అందరికీ వర్తిస్తుంది. నమ్మిన వారికీ, నమ్మని వారికీ అందరికీనూ. ఆస్తికులు ఆ శక్తిని దేవునిగా ఆరాధిస్తారు. విజ్ఞానశాస్త్రం దీనినే విశ్వశక్తిగా పేర్కొంటుంది.
మొదట ఆస్తికుల గురించి చూద్దాం. వీరు ఈ సమస్త విశ్వాన్నీ నియంత్రించే శక్తిని- సర్వశక్తిమంతుడని, విష్ణువని, అల్లా అని వారి వారి మత విశ్వాసాల మేరకు పిలుస్తారు. హిందుత్వం, క్రైస్తవం, ఇస్లాం నేడు ప్రపంచంలో అత్యధికులు అనుసరిస్తున్న మతాలుగా మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ మతాలవారు వారి వారి మత గ్రంథాలను అనుసరించి తమ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోడానికి మొగ్గుచూపుతారు. ముస్లింలు పవిత్ర ఖురాన్‌ను, క్రైస్తవులు బైబిల్‌ను అనుసరిస్తారు. హిందువుల విషయంలో అలాకాదు. వారికి ప్రత్యేకించి ఓ మత గ్రంథమంటూ ఏమీ లేదు. ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడానికి వారికి ఓ సాహితీ మహాసముద్రమే ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు... ఇలా ఎన్నని చెప్పగలం? హిందువులకు ఉన్న ఆధ్యాత్మిక వాంఙ్మయం అనంతమైనది.
క్రీ.శ. 609 ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్త ఖురాన్‌ను రచించారు. బైబిల్ కూడా క్రీ.శ.7వ శతాబ్దపు మానవ విరచితమని క్రైస్తవ పెద్దలు విశ్వసిస్తారు. కాలానుగుణంగా ఈ రెండు గ్రంథాలలో ఆయా మతానుయాయులకు అనుకూలమైన రీతిలో మార్పులు చేయబడ్డాయి. మహమ్మద్ ప్రవక్త బహుభార్యాత్వాన్ని అనుమతిస్తూ ఒక ముస్లింకు నలుగురు వరకు భార్యలుండవచ్చని ఖురానులో పేర్కొన్నాడు. బైబిల్‌లో కూడా ఒకదానికొకటి పొసగని ఎన్నో అసంగతమైన విషయాలను క్రైస్తవ పరిశోధకులు ప్రస్తావిస్తుంటారు.
హిందూ సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో చెప్పబడిన విషయాలు ఏదో ఒక కులానికి పరిమితమైవవి కావు. అవి అన్ని కాలాలకూ వర్తించే శాశ్వత విలువలు. మానవుని ఊహకందని అత్యంత ప్రాచీన కాలం నుండీ ఆ విలువలు ఇక్కడి జాతి జీవనానికి దిశానిర్దేశనం చేస్తున్నాయి. హిందుత్వం, హిందూ వాంఙ్మయం ఏదో ఒక మత విశ్వాసానికి పరిమితమైనవి కావు. హిందుత్వం ఒక సమగ్ర జీవన విధానం. ఒక వ్యక్తి తనను గురించి తెలుసుకోడానికి, ఈ విశ్వాన్ని గురించి తెలుసుకోడానికి, సమస్త జగత్తునూ సృష్టించిన ఆ భగవంతుడిని గురించి తెలుసుకోడానికి హిందూ వాంఙ్మయం దోహదం చేస్తుంది.
మొదటి నుంచీ క్రైస్తవ మత ప్రచారకులు దొరికినవాడినల్లా రకరకాల పద్ధతులను ఉపయోగించి మతం మార్చడంలో తీరిక లేకుండా ఉన్నారు. తమ మతస్థుల సంఖ్యను పెంచుకోవడంలో క్రైస్తవ మత ఔన్నత్యం ఎన్ని రకాలుగా భంగపడినా వారు లెక్కచేయలేదు. నేడు ప్రపంచంలో క్రైస్తవ మతస్థులే అత్యధికంగా ఉన్నారు. కానీ ఆ మత నియమాలకు అనుగుణంగా నడచుకునేవారి సంఖ్య వివిధ దేశాలలో త్వరితగతిన క్షీణిస్తోంది. అమెరికాలోనూ, ఐరోపా దేశాలలోను చర్చికి వెళ్లేవారే కనబడటం లేదు. అసలు చర్చిలను పట్టించుకునే దిక్కే లేదక్కడ. అమెరికా, ఇంగ్లండు, ఐరోపా దేశాలలో శతాబ్దాల నాటి పెద్దపెద్ద చర్చిలన్నీ బార్లుగాను, హోటళ్ళుగాను, షాపింగ్ మాల్స్‌గాను, వివిధ సంస్థల కార్యాలయాలుగాను మారిపోతున్నాయి.
పాశ్చాత్య దేశాలలో చర్చిల దుస్థితికి గల కారణాలను పరిశీలిద్దాం. అసలు క్రైస్తవ మతం వౌలికతత్త్వమే ఎవరికీ అర్థం కానిది. ఎవడో చేసిన ఏదో పనికి తమ మతానుయాయులను బాధ్యులను చేసి పాపులుగా పరిగణిస్తుంది. తమ ఆది మానవులైన ఆదాము, అవ్వ (ఆడం,ఈవ్)లు చేసిన తప్పుకు ఇప్పటికీ క్రైస్తవ మతస్తులు పాపభారాన్ని మోస్తున్నారు. అసలు క్రైస్తవ మత ప్రస్తావనే ఆదాము, అవ్వలు తప్పుచేసారన్న ఉదంతంతో మొదలవుతుంది. మరి తమ అనుయాయులను ఈ మతం ఏ విధంగా దీర్ఘకాలం ఆకట్టుకుంటుంది? ఇలా క్రైస్తవ మతంలోని వివిధ సిద్ధాంతాల దివాలాకోరుతనమే పాశ్చాత్య దేశాలలో నాస్తికత్వానికి ప్రాణం పోసింది.
చర్చికి వెళ్ళేవారు మాత్రమే దేవుని సన్నిధిలోని స్వర్గమునకు పోవుదురనీ, అలాకానివారు నరకమునకు త్రోసివేయబడుదురనీ బైబిల్ గట్టిగా చెప్తుంది. పునర్జన్మను క్రైస్తవమతం విశ్వసించదు. కాబట్టి మనిషి తన జీవిత కాలంలో చేసిన కర్మలు అతని పరలోకపు భవితను నిర్ణయిస్తాయి. పరలోకమునందు దేవుని స్వర్గమును పొందవలెనంటే తమ పూర్వీకులైన ఆదాము, అవ్వాల పాపభారమును మోయవలసిందేనని, ఆ పాప విముక్తికి ప్రతి క్రైస్తవుడూ చర్చికి క్రమం తప్పకుండా వెళ్లాలనీ బైబిల్ చెప్తుంది. అలా చేయనివారిలో నరకానికి పోతామన్న భయాన్ని జీవితాంతం కలిగిస్తుంటుంది బైబిల్. మరి ఇలాంటి క్రైస్తవం మానవుని ఆధ్యాత్మిక దాహాన్ని ఏ విధంగా తీరుస్తుంది?
హిందూ ధర్మము సనాతన ధర్మము. ఇది ఆధ్యాత్మిక జ్ఞానతృష్ణ కలవారందరినీ స్వాగతిస్తుంది. ఈ అనంత విశ్వము లేదా బ్రహ్మాండము నందలి సృష్టి, స్థితి, లయల గురించిన జ్ఞానాన్నిస్తుంది. అంతేకాదు మానవ జీవితానికి అంతిమలక్ష్యమైన ఆత్మను గురించి తెలియపరుస్తుంది. ఈ సమస్త విశ్వము యొక్క జీవమునకు ఆధారమైన పరమశక్తిని గురించిన అమూల్యమైన జ్ఞానము హిందూ ధర్మ గ్రంథాలలో లభ్యవౌతుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఈ పరమశక్తియొక్క గుణగణాలు, అవతారాలు, అది చేసే పనులను గురించే వర్ణిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నీ లోపల ఉన్నదే బయటకూడా ఉన్నదని హిందూ తత్త్వశాస్త్రాలు చెప్తున్నాయి. పూర్వీకుల పాపపుణ్యాల భారాన్ని ఎవరిపైనా హిందూ ధర్మం మోపలేదు. ఆత్మగాతమైన శాంతియే హిందూ ధర్మము లక్ష్యం. పాశ్చాత్య దేశాలకు యోగ, ధ్యానము, ఆయుర్వేదం ద్వారానే హిందుత్వం గురించి ఎక్కువగా పరిచయం అయ్యింది. గ్లోబలైజేషన్ పుణ్యమాని భారతదేశానికి చెందిన ఎన్నో సుసంపన్నమైన విషయాలు ప్రపంచం నలుమూలలకూ చేరుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసం ద్వారా ప్రయోజనాలను పొందుతున్నారు. హిందూతత్త్వ చింతలోని విశిష్టతను తెలుసుకుంటున్నారు. యోగాభ్యాసము వలన శరీరము, మనస్సుపై సంభవిస్తున్న సత్పరిణామాలు హిందూ సంస్కృతి, సంప్రదాయముల ఔన్నత్యాన్ని గురించి మరింతగా తెలుసుకునేందుకు పాశ్చాత్య దేశాలవారికి ప్రేరణనిస్తోంది. ఆయుర్వేదానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గుర్తింపు లభించింది కూడా.
ఇక శాకాహారం పట్ల పాశ్చాత్య దేశాలలో ఆదరణ పెరుగుతోంది. శాకాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పట్ల దృష్టి పెడుతున్నారు. మాంసాహారం ఉత్పత్తికోసం ఏర్పాటుచేయబడ్డ కబేళాలు వాతావరణ కాలుష్యానికి ఏవిధంగా కారణవౌతున్నాయో వారు తెలుసుకుంటున్నారు. అందువల్ల ‘‘పచ్చదనం, శాకాహారం’’ పాశ్చత్య దేశాలలో తాజా ట్రెండ్ అయ్యింది. జంతువుల పట్ల అహింసను పాటించాలని చెప్పే హిందుత్వం పట్ల సహజంగానే వారు ఆకర్షితులవుతున్నారు.
శ్రీకృష్ణతత్త్వాన్ని ప్రచారం చేస్తున్న ఇస్కాన్ కార్యకలాపాల పట్ల పలు దేశాలలో విశేష స్పందన లభిస్తోంది కూడా. నిత్యజీవితంలో భగవద్గీత బోధల ప్రాముఖ్యాన్ని వారు గుర్తిస్తున్నారు. ఇక ‘హరేకృష్ణ’ భజనలు వారి మనసులను భక్తిసాగరంలో ముంచెత్తుతున్నాయి. ఇంగ్లాండ్, అమెరికా, ఆఫ్రికా, రష్యా, చైనా తదితర దేశాలలో శ్రీకృష్ణతత్త్వాన్ని గురించి ఇస్కాన్ ప్రచారం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాస్తికులు కృష్ణ్భక్తులుగా మారుతున్నారు.
సంస్కృతం సకల భాషలకూ తల్లి. సంస్కృతంలో విస్తృతమైన సాహితీ సంపద ఉంది. నేటి ఆధునిక కాలానికి మార్గదర్శనం చేసే ఎన్నో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విశేషాలు ఆ భాషలో ఉన్నాయి. ఖగోళ శాస్త్రం, నిర్మాణ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, గణిత శాస్త్రం ఇంకా ఎన్నో శాస్త్రాలకు సంబంధించిన విలువైన సమాచారం సంస్కృత గ్రంథాలలో ఉన్నాయి. వివిధ దేశాలలోని ఎన్నో విశ్వవిద్యాలయాలలో సంస్కృత భాష బోధింపబడుతోంది. దీనివల్ల కొత్తతరం విద్యార్థులకు హిందుత్వాన్ని గురించి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. హిందువుల పండుగలకు శాస్ర్తియ నేపథ్యం ఉంది. అవన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. హిందూత్వంలో కర్మకాండల కన్నా జ్ఞానానికే పెద్దపీట వేయబడింది. కర్మకాండలు కొందరికే పరిమితం. జ్ఞానం అందరికీ చెందినది కదా. అందుకే హిందుత్వం ఒక మతం కాదనీ, అదొక జీవన విధానమనీ చికాగోలో 1893లో జరిగిన విశ్వమత మహాసభలలో స్వామీ వివేకానందుడు ఎలుగెత్తి చాటాడు. దీనిని బట్టి హిందుత్వం శాశ్వతం, విశ్వజనీనం అయినదని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన సంక్షోభంలో చిక్కుకొని ఉంది. ఈ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని ఒక్క హిందుత్వం మాత్రమే బయటపడవేయగలదు. హిందుత్వం వల్ల మాత్రమే ప్రపంచానికి శాంతి చేకూరుతుంది.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690