Others

నాకు నచ్చిన సినిమా..గులేబకావళి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1962లో ఒకే నెలలో విడుదలైన రెండు జానపద చిత్రాలు -జగదేకవీరుని కథ, గులేబకావళి కథ. రెంటిలో రామారావు హీరో. ఇక ముక్కామల రాజుగా, లంక సత్యం, పేకేటి శివరాం, కెవిఎస్ శర్మ, ఋషేంద్రమణి, ఛాయాదేవి, హేమలత, సురభి బాలసరస్వతి, బాలకృష్ణ, పద్మనాభం లాంటి వారంతా చిత్రంలో ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తారు. బాలకృష్ణ, సురభి బాల సరస్వతి రెండు హాస్య పాత్రల్లో రాణించారు. గులేబకావళి చిత్రం నుంచే జోస్యపు కృష్ణమూర్తి (ఈయనే విజయా కృష్ణమూర్తి), సి నారాయణరెడ్డిలను పరిచయం చేశారు రామారావు. రాజును మోసంచేసే దుష్టబుద్ధుల పన్నాగాలు, దద్దమ్మ కొడుకులు, దురాశగల రెండో భార్య, హీరో అన్ని కష్టాలను ఎదుర్కోవడం, కథ సుఖాంతం కావడం మామూలే. సినిమాలో నాయికా నాయకులుగా జమున, రామారావు జీవించారు. నల్ల రామ్మూర్తి కూడా ఓ పాత్రలో కనిపిస్తారు. సినారె రాసిన ‘నన్నుదోచుకుందువటే’ పాట మధురంగా ఉంటుంది. ‘మదనా సుందర నా దొరా’ అనే శుద్ధ శాస్ర్తియ జావళిని సుశీల అద్భుతంగా పాడారు. 1938లో ఇదే పేరుతో ఓ సినిమా విడుదలైంది. నాయికగా అందులో కన్నడ నటి నాగరత్న నటించారు. తమిళ చిత్రంలో జి వరలక్ష్మి నటించారు. ఎప్పటికీ నూటికి నూరుపాళ్లు వినోదాత్మక జానపద చిత్రం -గులేబకావళి కథ. అందుకే నాకు ఇష్టం.

-కెఎస్, కావలి