Others

నాకు నచ్చిన పాట --జన్మమెత్తితిరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ నటించిన గుడిగంటలు చిత్రంలో సినారె గీతం -జన్మమెత్తితిరా/ అనుభవించితిరా. ఈ పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించడమేకాదు ఆలోచింప చేసింది. ఆవేశంతో వ్యవహరించే వ్యక్తుల జీవిత గమ్యాలు ఎంత విషాదభరితంగా ఉంటాయో తెలియజెప్పే పాత్ర ఎన్టీఆర్‌ది. రెండు కాళ్లు పోగొట్టుకుని ఆవేశంతో, అనుమానంతో సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించి, విధివశాత్తూ రక్షించబడి తిరిగి కాళ్లు బాగుపడిన సందర్భంలో పశ్చాత్తాప హృదయంతో ఆలపించిన గీతాన్ని ఘంటసాల స్వర రచన చేసి అద్భుతంగా పాడారు. స్వార్థం అనే పిశాచి మదిలో వుంటే బ్రతుకంతా ప్రళయంగా మారుతుందని, దైవశక్తి మృగత్వాన్ని సంహరించి యుద్ధ్భూమిలాంటి మదిలో శాంతి పొందేలా చేస్తుందని తెలియజేస్తూ పాట సాగుతుంది. క్రోధం, లోభం, మోహం లాంటి అరిషడ్వర్గాలు పడగలెత్తితే గుండెలో విషం కక్కుతాయని, ధర్మజ్యోతి మదిలో ఆవరిస్తే దివ్యమందిరంగా మనసు మారుతుందని రచయిత చెప్పారు. మట్టిలో మాణిక్యంలా ప్రతి మనిషిలోనూ మహాత్ముని చూడవచ్చని, ప్రతి గుండెలోనూ గుడిగంటలు న్యాయపథం చూపుతాయని తెలిపే గీతం. పరివర్తన చెందిన మనిషి ఆత్మఘోషను ఘంటసాల తన గాత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ అపూర్వ నటనతో ప్రేక్షకులను అలరించారు.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం