Others

కృత్రిమ మేధ జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ఆరంభమైంది. ఇది కృత్రిమమేధ (ఏఐ) నామ సంవత్సరం... దశాబ్దంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కీలక పాత్రను పోషిస్తున్న కృత్రిమ మేధ రాబోయే కాలంలో మరింత ముఖ్య భూమికను పోషించనున్నది.
తెలుగు నేలైన హైదరాబాద్‌లో ఈమేరకు అప్పుడే అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది రూ.3 వేల కోట్ల పెట్టుబడులు ఈ రంగంలోకి రానున్నాయని, అలాగే 200 స్టార్టప్ సంస్థలు స్థాపన జరగనున్నదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కొత్త సంవత్సరం ఆరంభంలో పేర్కొన్నారు. టి హబ్-2 కూడా ప్రారంభంకానున్నదని చెప్పారు. ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని అభివర్ణించారు.
కృత్రిమమేధ మెగా నగరాలకు, మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమేనన్న అపోహ క్రమంగా పటాపంచలవుతోంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన తదితర రంగాలలో అత్యంత కీలకంగా మారనున్నది. వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతీకరించేందుకు ‘ఏఐ’ విప్లవాత్మక పాత్రను పోషిస్తోంది. అనేకానేక సామాజిక సమస్యల పరిష్కారానికి ఏఐ ఆధారంగా స్టార్టప్ సంస్థలు ఇప్పటికే కృషిని ప్రారంభించాయి. వాటి ఫలితాలు వెలువడనున్నాయి.
కృత్రిమ మేధపై నీతి ఆయోగ్ రెండేళ్ళ క్రితమే ఒక వ్యూహాన్ని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై త్వరలో ఒక విధానాన్ని ప్రకటించనున్నది. దీని ద్వారా సామాన్యుడికి సైతం మేలుకలిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ రంగంలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండగలవని భావిస్తున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ‘ఏఐ’ని ప్రవేశపెట్టారు. మరికొన్నింటిలో ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయమై ఒక కమిటీ పనిచేయనున్నది. ‘టాస్క్’ద్వారా అధ్యాపకులకు శిక్షణనిచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే పట్టణ-గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన పెంపొందించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు సైతం కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధపై పది సంస్థలతో ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకుంది. కొత్త సంవత్సరంలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ ఒప్పంద కార్యక్రమం కొనసాగింది. కొన్ని మాసాల క్రితం కృత్రిమ మేధ వనరుల వేదిక (ఎన్‌ఎఐఆర్‌పీ)ని ఏర్పాటుచేయాలని ఆవిధంగా ఏఐపై జరిగే పరిశోధనలను ఒకే గొడగుకిందకు తీసుకురావాలని కేంద్రం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటి కేంద్ర ఐటి శాఖకు సూచించింది.
మనం చేసే ప్రయాణం, మన మొబైల్, మన వాహనం ఇప్పుడున్న రీతిలో ఇకముందు ఉండవన్నది యదార్థం. ఇప్పటికే డ్రైవర్ అవసరంలేని కార్ల తయారీ పెరిగింది. దీని వెనకాల ఉన్నది కృత్రిమ మేధనే. మన మొబైల్ మరింత స్మార్ట్‌గా పనిచేయడం వెనకాల సైతం కృత్రిమ మేధ దాగున్నది. అనూహ్యమైన పరిణామాలు కమ్యూనికేషన్స్ రంగంలో చోటుచేసుకోనున్నాయి. దానికంతటికి ఆధారం ఏఐ. మనం చేసే షాపింగ్ సైతం సరికొత్త అనుభూతిని కలిగించనున్నది. ఆన్‌లైన్ షాపింగ్ ప్రక్రియ అంతటా కృత్రిమమేధ దాగున్నది. ప్రజల జీవితాలు సుఖమయం- సౌకర్యవంతం చేసేందుకు కృత్రిమ మేధ మరింత వనె్నకెక్కుతోంది.
ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సైతం ఏఐ కోర్సు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఒక కేంద్రాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నది. మనిషి పరిష్కరించలేని అనేక సమస్యలకు ఏఐ పరిష్కారం చూపగలదని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘రూపా’నిధుల కింద ఓయూకు వంద కోట్లకు పైగా మంజూరయ్యాయి. ఇప్పటికే క్యాంపస్‌లో ఉన్న టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఈ నూతన ‘ఏఐ’కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు.
గగన్‌యాన్.. చందమామపైకి వెళ్ళే భారత వ్యోమగాముల ఎంపిక పూర్తయింది. చారిత్రాత్మకమైన, ఈ గగన్‌యాన్‌కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు పైలెట్లు శిక్షణకోసం త్వరలో రష్యాకు బయలుదేరనున్నారు.
భారతదేశ చరిత్రలో ఇదొక కీలక మలుపు. యావత్ దేశం గర్వించే గగన్‌యాన్‌లో దాదాపు ఏడుగురు సిబ్బంది ఉంటారని, అంతరిక్షంలో వీరు దాదాపు ఏడురోజులు తమకు నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇస్రో చైర్మన్ కె.శివన్ ఇటీవల తెలిపారు.
కొత్త దశాబ్దంలో సరికొత్త పరిణామమిది. ప్రపంచంతో కల్సి భారత్ అడుగేస్తోందని చాటి చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.
ఈలోగానే చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపడతామని శివన్ పేర్కొన్నారు. గత జూలై మాసంలో చంద్రయాన్-2 ప్రయోగం దాదాపు విజయవంతమైందని, ఈసారి ‘సాఫ్ట్‌లాండింగ్’ విషయంలో విజయం సాధిస్తామని శివన్ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే!
దేశ ఆర్థిక స్థితిగతులపై ఫిక్కీ ఇటీవల హైదరాబాద్‌లో గోష్ఠి నిర్వహించింది. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీశ్‌కుమార్ మాట్లాడుతూ.. భారత ఆర్థికవ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరగలదని, అందుకు నిర్దిష్టమైన సమయం చెప్పలేమని ఎంతో ఆశాజనకంగా మాట్లాడారు. ఇందుకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ, వౌలిక సదుపాయాల అభివృద్ధి, ఔత్సాహిక పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహం లాంటి అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. ఇందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కీలకమన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ముందడుగువేయాలని సూచించారు. ఆధునిక సాంకేతికత ఏఐ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ లాంటివి పట్టించుకోకుంటే వెనకబడతామని హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం సరైనదేనని కూడా ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రధానితో పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ ఇదే విషయం ప్రస్తావనకొచ్చింది. ఇది ఇలాఉంటే... ఐఐఎం, ఎం.బి.ఏ.లలో ప్రవేశంకోసం రాసిన ‘క్యాట్’లో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరి పర్సంటైల్ 99కి పైనే ఉంది. జాతీయస్థాయిలో రెండు లక్షలకు పైగా మంది పరీక్ష రాయగా తెలంగాణకు చెందిన ముగ్గురు టాపర్లుగా నిలవడమంటే రానున్న రోజులు ఎంత విజ్ఞానాన్ని వారు ఒడిసిపట్టనున్నారో బోధపడుతుంది. ఈ రకమైన ‘స్పర్ధ’ దేశవ్యాప్తంగా కనిపిస్తుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. సాంకేతికత, నైపుణ్యం, వనరులు, అవకాశాలు దండిగా ఉన్నాయి.
మడతపెట్టే స్మార్ట్ఫోన్లు.. ఈ సంవత్సరం మార్కెట్లోకి మడతపెట్టే స్మార్ట్ఫోన్లు రానున్నాయి. చైనాకు చెందిన హువాయే, గ్జియామి సంస్థలు ఈ ఫోన్లను తీసుకురానున్నాయి. ఈమేరకు ఆ కంపెనీలు పెటెంట్లను పొందినట్టు సమాచారం. భారతదేశంలో వీటి వాడుకతోపాటు 5జి టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఇప్పటికే హువాయే వేగంగా పావులు కదుపుతోంది. ఈ టెక్నాలజీవల్ల డేటా బట్వాడా వేగం అనూహ్యంగా పెరగనున్నది. ఇంటర్నెట్ వేగం పెరగడమంటే మనిషి ఆలోచనల వేగం పెరగడమే.

- వుప్పల నరసింహం.. 9985781799