Others

ప్రవాసీ భారతీయ దివస్ నేపథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఏటా జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్’ జరుపుకుంటారు. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకుని దీన్ని నిర్వహిస్తారు. ఆయన వచ్చిన వెంటనే స్వాతంత్య్రోద్యమానికి శ్రీకారం చుట్టి భారతీయుల జీవితాల్లో మరుపులేని మార్పును తెచ్చారు. ప్రవాసీ భారతీయ దివస్‌ని 2003నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, భారత దేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తుచేసుకుంటారు. గతంలో ఎల్.ఎం. సింఘ్వీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రవాస భారతీయులపై అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగా అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ అటల్‌బిహారీ వాజ్‌పాయి ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ)ను జరపాలని నిర్ణయించారు.
బ్రిటీష్ పాలనలో వేలాది మంది భారతీయులు ఆఫ్రికా తూర్పుతీరం, వెస్ట్ ఇండీస్, ఫిజీ, మారిషస్ తదితర ప్రాంతాలకు కార్మికులుగా వలస వెళ్లారు. తదనంతరం ఆ దేశ సంస్కృతిలో కీలకంగా మారారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లోనేకాక రాజకీయంగానూ సత్తాచాటారు. మారిషస్, ఫిజీ వంటి దేశాల్లో భారత సంతతికి చెందినవారు అత్యున్నత కొలువులను అందుకోవడం విశేషం. 1970 తర్వాత గల్ఫ్ దేశాల్లో చమురు నిల్వలు బయటపడటంతో మధ్యప్రాచ్యానికి లక్షలాది భారతీయులు ఉపాధి నిమిత్తం వెళ్లారు. నిరంతర శ్రమతో ఆ దేశపు పురోభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఖతార్‌లో భారతీయుల సంఖ్య ఆ దేశ జనాభాలో సగ భాగం ఉందంటే దేశంనుంచి వలసలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. విదేశానికి వలసవెళ్లిన భారతీయ పౌరులను ప్రవాస భారతీయులంటారా.. భారతదేశం వెలుపల జన్మించిన భారతీయ మూలంగల వ్యక్తిని లేదా శాశ్వతంగా భారతదేశం వెలుపల స్థిరపడిన భారత సంతతి, వ్యక్తిని భారత సంతతి వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషిచేసినవారికి ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారాన్ని అందజేస్తారు. 2015లో ప్రవాసీ భారతీయ ఉత్సవాలను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించారు. మహాత్మాగాంధీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు అయిన సందర్భంగా వీటిని ఘనంగా నిర్వహించారు. 15వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలను 2019లో జనవరి 21నుంచి 23వరకు వారణాసిలో నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలు, న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో, ప్రవాసీ భారతీయుల ప్రతినిధులు పాల్గొనడానికి వీలుగా 15వ ప్రవాస భారతీయ దివస్ వేడుకలు జనవరి 9కి బదులుగా జనవరి నుంచి 21నుంచి 23 వరకు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలను రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రవాసీలు భారత్‌కు చెందినవారే అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రవాసీ భారతీయులను భారతదేశ ప్రచార కార్యదర్శులుగా అభివర్ణించారు. ఈ ఉత్సవాలను జరుపుకోవడం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు ఒక్కచోటుకు చేరి మాట్లాడుకునేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఈ సదస్సులు భారతీయ సంతతికి ఎంతగానో ఉపయోగపడతాయి. తమ పూర్వీకులు నివసించిన దేశంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో పాటు పరస్పర ప్రయోజనం పొందే రీతిలో ఇవి ఉపయోగపడతాయి. అంతేగాక వివిధ రంగాల్లోని తమ అనుభవాలను కలబోసుకోవడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి. భారతీయులకు చెంది న అనేక సంఘాల్లో తెలుగువారికి చెందిన తానా, ఆటా, టాంటెక్స్ వంటి సంస్థ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ మూలాలను గుర్తుచేస్తున్నాయి. సొంత గడ్డపై పలు సంక్షేమ పథకాల్లో భాగస్వాములుగా నిలుస్తున్నాయి. ప్రవాస భారతీయులు 200 దేశాలకు విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయంగా ఖ్యాతి, ప్రాముఖ్యం లభించడానికి వారే కారణమని ప్రధాని పేర్కొన్నారు. వారి కష్టంలో, నైపుణ్యంలో, ప్రతిభలో మాతృదేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా పెంపొందిస్తున్నారు. భారతీయ ప్రవాసీయులు దేశానికి గొప్ప సంపద వంటివారని చెప్పడంలో సందేహం లేదు.

- కె. రామ్మోహన్‌రావు, 9441435912