Others

ఆ ట్రెండ్ మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ‘గరం’ చిత్రానికి కథ, మాటలు అందించి రచయితగా, దర్శకుడిగా తన కత్తికి రెండువైపులా పదునుందని నిరూపించుకున్న
గవిరెడ్డితో ఈవారం చిట్‌చాట్.
మీ నేపథ్యం?
వైజాగ్ దగ్గర నర్సీపట్నం వద్ద బయ్యవరం మావూరు. డిగ్రీ చదివాను. దర్శకత్వంపై ఆసక్తితో ఇలా వచ్చాను.
దర్శకుడిగా ఎలా?
పూరి జగన్నాథ్‌ది మా ప్రాంతమే. ఆయనే ఇన్‌స్పిరేషన్‌గా డైరెక్టర్ అవ్వాలనుకున్నా. చాలామంది సీనియర్ల దగ్గర దర్శకత్వం మెళకువలు నేర్చుకున్నా. ఎక్కువ కాలం డైరెక్టర్ మదన్ దగ్గర వర్క్ చేశా.
ఇష్టమైన జోనర్?
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగుతూ కామెడీ టచ్‌తోవుండే సబ్జెక్టులు ఇష్టం.
మరి.. హారర్, లవ్వులు?
అది ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారు. ఇటీవల హిట్టుకొట్టిన సినిమాలే అందుకు సాక్ష్యం. నేచురల్ టచ్‌తోసాగే కొత్తదనాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. హారర్, లవ్‌తో ఆడియన్స్ విసిగిపోయినట్టే.
ఇండస్ట్రీలో సమస్యలు?
కొత్త దర్శకులకు తప్పనివే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి వాతావరణమే ఉంది. కొత్త దర్శకులకు ప్రోత్సాహం దొరుకుతోంది. పెద్ద నిర్మాతలూ వారి కథలు వింటున్నారు. థియేటర్ సమస్యలు నా చిత్రానికి ఎదురుకాలేదు.
తరువాతి ప్రాజెక్టులు?
తొలి చిత్రంతోనే దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఓ మంచి కథతో త్వరలో పెద్ద హీరోతో సినిమా అనౌన్స్ కాబోతోంది. మరికొన్ని చర్చల్లో ఉన్నాయి.
దర్శకుడంటే?
తనకు నచ్చినదాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చూపేవాడు. లేదా ప్రేక్షకులకు నచ్చే అంశాన్ని తాను పూర్తిగా అర్థం చేసుకుని తీసేవాడు.

-శేఖర్