Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నేల ఒక విధి యుక్త సంస్కార క్షేత్రం
ఇక్కడ ప్రతి ప్రాణం
పూవు పొత్తిళ్ళలో తేలే ఒక తేనె చుక్క
ఋషులు ఆత్మ సింధువులో మనకలు వేస్తూ
చరిత్ర పుటల్ని తిరగేస్తే చిందిన చిరంతన తర్పణం
ఏ ఆదిమ నిశలో
అనంత సూర్యగోళ నివహ ప్రస్తావన వుందో
అక్కడ ఒక శిశువై మానవతా రూపశిల్పంతో
తయారైన చేతో విధి...
ఇదంతా మృదుల హింసా రిరంస లోంచి
మెడ బైట పెట్టే హంస దౌత్యం...
‘‘జీవకళలుట్టిపడునొక చిత్రమగుచు
ప్రకృతి నాదూత్మ లోపల ప్రతిఫలించ
‘శారద’ దినాంత రమణీయ సాంధ్యరాగ
విమల పథములు హృదయాన వెల్లి విరిసె’’
***
చివురు జొంపాల వెచ్చని కవుగలింత
పూల చిరునవ్వులో పొంగు పొలుపు నిగ్గు
పులుగు గొంతున తీయని పులకరింత
చిందు వారెను మధుర మరంద లహరి
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404