Others

కొన ఊపిరిలో తెలుగు సినిమా హాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు కథావస్తువు ఏదైనా కావొచ్చు. కానీ -ఆ వస్తువు నుంచే హాస్యం పుట్టి, అందులోనే మిళితమైన ఉన్నపుడే జనరంజకం అవుతుంది. స్వర్ణయుగం కాలంలో అలాంటి హాస్య పాత్రల్లో నటించి రక్తికట్టించిన జంటలను మనమింకా మర్చిపోలేక పోతున్నాం. అందుక్కారణం -ఆయా కథా వస్తువుల నుంచి పుట్టించిన సున్నితమైన హాస్యం, ఆ హాస్యానికి ప్రాణం పోస్తూ పాత్రల్లో ఒదిగిపోయిన గొప్ప నటుల ప్రావీణ్యం. ఆ హాస్య పాత్రలకు సన్నివేశానుగుణంగా పాటలూ ఉండేవి. నిజానికి ప్రధాన డ్యూయట్లు, సోలోసాంగ్స్ కంటే ఈ హాస్యపాటలే పామర జనం పెదాలపై అమితంగా వినపడుతుండేవి. అలా రేలంగి- గిరిజ, పద్మనాభం- గీతాంజలి, రాజబాబు- రమాప్రభ జంటలను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. నేటి చిత్రాల్లో ఆ హాస్య జంట అనే పేరే వినబడట్లేదు. హాస్య సన్నివేశాలు కేవలం అతుకుల బొంతలా తయారవుతున్నాయి. జంధ్యాల, ఇవివిలాంటి వారు లేకపోవటంతో అసలు హాస్యం అనేదానే్న పూర్తిగా మర్చిపోవాల్సి వస్తోంది. స్వర్ణయుగంలోని ఆఖరి హాస్య జంటల్లో ఒకటైన రాజబాబు- రమాప్రభను ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్‌లో వెంకటేశ థియేటర్‌లో జరిగిన ‘క్రిష్ణవేణి’ సినిమా శత దినోత్సవ సభకు హాజరై వేదికను అలంకరించినప్పటి అరుదైన చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717