Others

ప్రణవనాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓంకారమే ప్రణవము. నటరాజ స్వామి ఆనంద నాట్యం చేసే సమయంలో ఆయన కాలి అందె యొక్క మువ్వ ఒకటి జారి క్రిందకు పడిందని, అదియే ఓంకార నాదం చేసిందని, సృష్టికి పూర్వం కేవలం ఓంకార శబ్దం మాత్రమే ఉన్నదని భక్తుల భావన. పవిత్ర బైబిల్ గ్రంథంలో కూడా (యోహాను 1.1) ‘‘ఆదియందు శబ్దము ఉండెను. అది దైవము వద్దనుండెను. అదియే దేవుడై ఉండెను’’ అని చెప్పబడియుంది.
ప్రణవము పరబ్రహ్మ రూపమని, సకల మంత్రములకు, వేదములకు మూలము. దేవతల స్వరూపం అని అంటారు. ప్రకృతిలో జనించిన ప్రణవము అందులోనే లయమవుతుంది. అ+ఉ+మ్ అనే శబ్దముల కలయికే ఓంకారము. ఇందులోని ‘అ’కారము సృష్టిని, ‘ఉ’కారము స్థితిని, ‘మ’కారము లయమును సూచిస్తుంది. ఆ మూడు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములు. కాలాతీతమైనదీ ప్రణవము. ఇంద్రియ నిగ్రహం కలిగి, పవిత్ర భక్తితో, ఓంకారాన్ని జపిస్తూ ఉపాసించే వారు దీర్ఘాయుష్కులై, బ్రహ్మ తేజస్వులై, అపార ప్రజ్ఞావంతులై ఉంటారంటుంది మనుస్మృతి.
ఓంకారాన్ని కులమతాలకు, జాతి, లింగ భేదాలకు అతీతంగా ఎవరైనా జపించవచ్చని శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, సద్గురు శ్రీ మలయాళస్వాముల వంటి మహనీయులెందరో చెప్పారు.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిమ్- అని భగవద్గీత 8వ అధ్యాయం- 13వ శ్లోకంలో చెప్పబడింది. ప్రాణ ప్రయాణకాలంలో ఏకాక్షరమై, బ్రహ్మ వాచకమగు ఓంకారాన్ని స్మరిస్తూ, ఓంకార రూపుడైన దేవుడిని భావిస్తూ ఎవరైతే దేహాన్ని వీడుతారో, అట్టివారు ఉన్న పరమగతియైన బ్రహ్మ పదమును పొందెదరని గీతాచార్యుడు చెప్పారు. ఇందులో కుల మతములుగానీ, స్ర్తి పురుషు భేదంగానీ, సంసారి, సన్న్యాసి అని గానీ విచక్షణ చేయబడలేదు. కనుక సర్వులు ప్రణవోపాసన చేయవచ్చును.
పతంజలి మహర్షి తన యోగ శాస్తమ్రులో ‘తస్య వాచకః ప్రణవః తజ్జప స్త దర్థ భావనమ్’ అన్నారు. పరబ్రహ్మమే ఓంకారం. ఆ ప్రణవాన్ని జపిస్తూ, దాని అర్థాన్ని భావిస్తూ ఉండాలన్నారు.
పవిత్ర కాశీనగరంలో ప్రాణం విడిచే జీవులకు పరమశివుడే ప్రణవం ఉపదేశిస్తాడని, అందువలన ఆ జీవులు సర్వపాప విముక్తి నొంది, శివలోకం పొందుతారని శివపురాణం చెబుతోంది. మార్కండేయుని తల్లి మరుద్వతి, మృగశృంగుని భార్యలు కాశీ విశే్వశ్వరుని ఓంకారోపదేశంవలన ముక్తి పొందుతారు. ఈ ఓంకారమునే యమధర్మరాజు నచికేతుడనే ఋషి పుత్రునకు (కథోపనిషత్తు), విష్ణువు తన సేవకుడైన గరుత్మంతునకు (గరుడపురాణం) ఉపదేశించినట్లు చెప్పబడింది.
‘ప్రణవః ప్రాణముచ్యతే’ - మంత్రములకు ప్రాణం ప్రణవము. ఓంకార సహితంకాని మంత్రం ప్రాణంలేనిదని, ‘‘ఓమిత్యేత ముద్గ్థీ ముపాసీత’- ఏకాక్షర స్వరూపమై, ఉద్గ్థీ అని కూడా పేరుగల ఓంకారము ఉపాసించదగినదని, ‘ఓంకార ప్రభవా వేదః’ వేదములన్నీ ఓంకారమునుండే పుటిటనవని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
పద్మాసన స్థితిలో కూర్చొని సాధకుడు, నిర్మల చిత్తుడై, ఉచ్చైస్వరంతో గానీ, మానసికంగా కానీ, ఓంకార నాదం చేస్తూ ఉంటే, కాలిగోటినుండి, శిరస్సు వరకు శరీర భాగాలన్నింటిలో, అద్భుత ప్రకంపనలు (వైబ్రేషన్స్) కలగడం, మానసిక ప్రశాంతత ఏర్పడడం అనేకమందికి అనుభవైకవేద్యమే! ఓంకారాన్ని విల్లుగా, బ్రహ్మము లక్ష్యంగా చేసుకొని ఆత్మ అనే బాణం వదిలితే అది లక్ష్యాన్ని గ్రుచ్చుకుని, అందులోనే మమేకం చెంది, అందే ఉండిపోతుంది. అంటే ఆత్మ బ్రహ్మలోనే లీనమవుతుంది అని ముండకోపనిషత్తు చెబుతుంది.
ఓంకారం విశ్వవ్యాపితమైనది. ఓంకార చిహ్నం దక్షిణ- తూర్పు దేశలైన థాయ్‌లాండ్, కంబోడియాలలో కూడా కన్పిస్తుంది. థాయ్‌లో ‘ఉనలోమ్’ లేక ‘అఉమ్’ అనే అక్షరాలు ఆ దేశ జెండా లేక అధికార చిహ్నాలపై కన్పిస్తాయి. కంబోడియా దేశపు రాజముద్రపై ఓం చిహ్నముంది. టిబెటన్ బౌద్ధం, జైన, సిక్కు మతాలలో ఓంకారం వివిధ రకాలుగా (చతుర్భుజ సదాక్షరీ పం, పంచ పరమేష్ఠి రూపం,, ‘ఇక్ ఓంకార’ రూపాలలో) ఆరాధింపబడుతోంది.
ప్రణవమైన ఓంకారనాదాన్ని అందరము సాధన చేసి ఆరోగ్యవంతులుగా, తేజోమంతులుగా, దైవోపాసకులుగా, పరిపూర్ణ మనశ్శాంతి కల్గిన వారిగా ఉందాము.

-గొల్లా పిన్ని సీతారామశాస్ర్తీ 9440781236