Others

కృష్ణవేణి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1971లో కన్నడ భాషలో విడుదలైన సినిమా -శరపంజర. ఆ చిత్రాన్ని తెలుగు రీమేక్‌గా కృష్ణవేణి పేరిట గోపీకృష్ణ బ్యానర్‌పై నటుడు కృష్ణంరాజు నిర్మించి మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది వి మధుసూదనరావు. కన్నడ చిత్ర మూలకథను తీసుకుని తెలుగు వాతావరణానికి అనువైన మార్పులు చేసి చక్కటి తారాగణం, మంచి లొకేషన్లు, వీనుల విందైన సంగీతంతో అత్యద్భుతంగా మలచి ప్రతిభను నిరూపించుకున్నారు మధుసూదనరావు. ఒక పెళ్లిలో కృష్ణంరాజు, వాణిశ్రీల మధ్య కలిసిన తొలిచూపులు ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిస్తారు. కృష్ణవేణి నదిలో ఎన్ని ఆటు పోట్లున్నాయో కథానాయకి కృష్ణవేణి (వాణిశ్రీ) జీవితంలో అన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి. అభిమానంగా చూసే భర్త వేరే స్ర్తితో సంబంధం పెట్టుకుని తనకు దూరమవడంతో అతనిపై విరుచుకుపడుతుంది. బాధతో తన ప్రవర్తన మారిపోవడంతో -పిల్లలు తల్లిని చూసి భయపడే పరిస్థితి వస్తుంది. ఆమె ప్రవర్తన, మానసిక స్థితి చూసి అంతా ఆమెను ‘పిచ్చిది’ అని ముద్రవేసి మరింత కుంగదీస్తారు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన భర్తకు తెలిసి తనను దూరం చేస్తున్నాడన్న విషయం గ్రహించి ఆత్మాభిమానంతో ‘కొందరి ఆడవాళ్ల జీవితంలో తారసపడిన సంఘటనలలో స్ర్తిలకు ఒక న్యాయం, పురుషులకు మరో న్యాయమా?’ అని ప్రశ్నించి.. భర్త చేతిలోనే మరణిస్తుంది కృష్ణవేణి (వాణిశ్రీ). ఈ చిత్రంలో వాణిశ్రీ నటన ఎవరెస్టు శిఖరాన్ని తాకుతుంది. భర్త అనుమానించి దూరంగా ఉన్నప్పుడు, పిల్లలు భయంతో దగ్గరకు రానపుడు, గతంలో తన జీవితంలో జరిగిన దుస్సంఘటన గుర్తుకొచ్చినపుడు, తనకింద పనిచేసిన వారే తనను పూచికపుల్లలా తీసిపడేసి పిచ్చిది అన్న సన్నివేశాల్లో కళాభినేత్రి వాణిశ్రీ అభినయాన్ని మాటల్లో చెప్పలేం. ఆమె భర్తగా కృష్ణంరాజు, వంటవాడిగా రాజబాబు, గోడచాటు కామాక్షిగా రమాప్రభ తమ అభినయంతో సినిమాకు వనె్న తెచ్చారు. సంగీత దర్శకుడు విజయభాస్కర్ స్వర రచనలో రామకృష్ణ, సుశీల గానం చేసిన సినారె, ఆరుద్రలు రచించిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి’, ‘సంగీతం మధుర సంగీతం’ వంటి పాటలు నేటికీ అలరిస్తున్నాయి. మహిళా ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాలను ఆకట్టుకున్న చిత్రం ‘కృష్ణవేణి’. ఇదొక రీమేక్ అన్న విషయాన్ని ఏమాత్రం గుర్తుకు రాకుండా అద్భుతాన్ని సృష్టించిన చిత్రబృందం మొత్తం అభినందనీయులు.

-ఎస్ సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం