Others

అలా.. అన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవకుశ ఫేం ఎ.శంకరరెడ్డి లలితా పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మించిన, తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘చరణదాసి’ (1956) రవీంద్రనాథ్ టాగూర్ వ్రాసిన ‘ది రెక్’ నవల ఆధారంగా రుూ చిత్రాన్ని నిర్మించారు. యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి, సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు జానకి, రేలంగి వంటి మేటి తారాగణమంతా నటించటంవల్ల యిది ఒక మల్టీస్టారర్ చిత్రం. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు సదాశివబ్రహ్మం వ్రాశారు. పాకానబడ్డ యస్.రాజేశ్వరరావు సంగీతం ప్రేక్షకులను అలరించింది. ఘంటసాల, పి.లీల పాడిన ‘గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసాలివే వికాసాలివే’ మరపురాని డ్యూయెట్ రుూ చిత్రంలోనిదే. సముద్రాల సీనియర్ వ్రాసిన రుూ పాట టైటిల్స్ రాగానే మొదలవుతుంది. సుప్రసిద్ధ నర్తకీమణులు రాగిణి, కమలా లక్ష్మణ్ అభినయించిన ‘స్వప్నవాసవదత్త’ రుూ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. ‘స్వప్నవాసవదత్త’ అంతర్నాటకం ‘మాయని మమత’ (1970) చిత్రంలో కూడా వుంది. ‘చరణదాసి’ ఆధారంగా జెమినీవారు రామానంద్‌సాగర్ దర్శకత్వంలో బీనారాయ్ ప్రదీప్‌కుమార్, భరత్‌భూషణ్‌లతో ‘ఘాంఘట్’ నిర్మించి అఖండ విజయం సాధించారు.