Others

మెకాలే నవ్వుతున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతిని సమైక్యంగా ఉంచేవి మతం, భాష. మతం ఒక్కటిగా భాషలు భిన్నంగాఉన్నా ఆ మతానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. ఎందువల్లనంటే సంస్కృతీ సంప్రదాయాలు నేర్పేది మతం. ఆచార వ్యవహారాలు, పూజలు పురస్కారాలు మతంనుండే గ్రహించబడేవి. అందువల్ల భాషలు వేరైనా, జాతీయుల మధ్య ఆత్మీయత పెంపొందుతుంది. ఉదాహరణకు- ఒక భాషకు చెందిన ప్రాంతంవారు వేరొక భాష మాట్లాడే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తన భాషలో మాట్లాడేవానిని చూడగానే ఆత్మీయతాభావం పెల్లుబుకుతుంది. అలాగే ఏ ప్రాంతానికి లేదా భాషకు చెందిన భారతీయుడు మరో దేశంలోనికి అడుగుపెట్టినప్పుడు అక్కడ తన దేశపు భాషలో మాటలు వినిపించినప్పుడు ఆతని హృదయం పులకిస్తుంది. భారతదేశంలో ఏ ప్రాంతంవాడనీ, ఏ భాషను మాట్లాడేవాడని ఆలోచించడు. భారతీయుడన్నదే ముఖ్యం. అలా చూచినట్లయితే జాతి సమైక్యతకు మతానికెంత ప్రాముఖ్యం ఉందో భాషకు అంతే ప్రాముఖ్యం ఉందని గమనించవచ్చు.
ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్న ఆంగ్లేయులు తమ భావజాలాన్ని ఈ దేశంపై రుద్దడంకోసం మొదట మాక్సుముల్లర్‌ను పంపించారు. ఆతడు అనుకున్నది సాధించకపోవడంతో మెకాలేను పంపించారు. మెకాలే ఆంగ్ల భావజాలాన్నీ, ఆంగ్ల మేధస్సును అభిమానించే, అభినయించే జాతిని ఈ దేశంలో తయారుచేయాలనుకున్నాడు. అయితే, అప్పటికే కొందరు ఇంగ్లాండు వెళ్ళి విద్యాభ్యాసం చేయడంతోపాటు, వారి నాగరికతను పూర్తిగా అనుకరించడమేకాక, ఈ దేశపు సంస్కృతి, మతం, చరిత్ర, భాష, సంప్రదాయాలను ఏవగింపు కలిగించుకుని ఉండడం చూసిన మెకాలేకు ‘‘్భరతీయులలో భారతీయత అన్నది అదృశ్యమవుతుండడంతో తను లక్ష్యించిన పని సులువైందని నవ్వుకున్నాడు. ఇలాంటి జాతి ప్రపంచంలో వేరెక్కడా లేదని మరీమరీ నవ్వుకున్నారు.
భారతదేశంలో 1835లో ఆంగ్ల భాషాబోధనకు శ్రీకారం చుట్టాడు. పైగా బ్రిటిష్ ప్రభుత్వంలో విద్యాశాఖకు ఉన్నత పదవిలో ఉండడంతో విద్యకు, భాషకు సంబంధించి ఈ జాతీయులను శాశ్వతంగా బానిసలుగా రూపొందించాలన్న పథకాన్ని ప్రవేశపెట్టాడు.
మెకాలే దుష్టసంకల్పం ఆయన మాటల్లోనే ‘మనకు కావల్సినది మనకూ భారతీయులకు మధ్య వారధిలా నిలిచే ఆంగ్లభాషను అభిమానిస్తూ, అనుకరిస్తూ, అభినయించే మరమనుషులను తయారుచేయడం... (1835 ఫిబ్రవరి 2న మినిట్స్‌లో రికార్డుచేయబడినది). మెకాలే ఆశ ఫలించడంతో తృప్తిగా నవ్వుకున్నాడు. భారతీయ భాషలకు పతనం ప్రారంభమయింది. ప్రజలు మాతృభాషలకు దూరమయ్యారు. ఆంగ్లభాష ఆధిపత్యం స్వాతంత్య్రం సిద్ధించిన 70 ఏళ్ళ తర్వాతకూడా ప్రాభవం పెరిగిందేకాని తరగలేదు. పుట్టగొడుగుల్లా ఆంగ్లమాధ్యమ పాఠశాలలు పుట్టుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ విషవాయువులు మరీ పెచ్చుమీరేయి. తెలుగు భాషపై మక్కువలో ఎంతమంది మేధావులు, కవులు మొరపెట్టుకున్నా అవి చెవిటివాడి ముందు శంఖం పూరించినట్లు ఉంది.
భారత ఉప రాష్టప్రతి శ్రీ వెంకయ్యనాయుడు ఎక్కడికి వెళ్ళినా మాతృభాషను మరువవొద్దని, మాతృభాషలోనే విద్యకొనసాగాలని ఉద్ఘోషిస్తున్నారు. మాతృభాష అసలైన కళ్ళనీ, పరాయి భాష కళ్ళద్దాల వంటివని హితవు చెబుతున్నారు. అవి ప్రజల హృదయాలను తాకడం లేదు. ఇదంతా ప్రేత రూపంలో ఈ దేశానికి వచ్చి చూస్తున్న మెకాలే విరగబడినవ్వుతున్నాడు. ఒక పాఠశాలలో టీచర్ విద్యార్థి క్లాసులో తెలుగు మాట్లాడాడని ఎండలో నిల్చుండబెట్టింది. మెకాలే చూసి నవ్వుకున్నాడు. ఒకే ఇంట్లోంచి చిన్నపిల్ల ఏడుపు వినిపించి అక్కడికి వెళ్ళాడు. ఆ పాప తల్లిని ‘మమీ’ అని పిలవలేదని చితకబాదింది. ‘అమ్మా! ఇంకెప్పుడూ అలా పిలవను’ అంటోంది. ‘అదిగో! మళ్ళీ అమ్మా అంటావా?’ మరీ మరీ చావబాదింది. అప్పుడా పాప ‘మమీ! స్పీక్ నో తెలుగు/ స్పీక్ ఇన్ ఇంగ్లీష్’ అంది. మెకాలే చూశాడు. ప్రాంతీయ భాషలు చచ్చిపోయి ఆంగ్లభాష ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది కదా! అని నవ్వుకున్నాడు.
‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు’అని పరాయి దేశస్థులే తెలుగు భాషను పొగిడారు. తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఎందరో గొప్పగా చెప్పారు. ‘‘కోటి కోయిల పాటల కొలువు తెలుగు...’’అని చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారంటే, ‘‘తెనుగునాడు నీది, తెనుగు బిడ్డవు నీవు... తెనుగు కనె్న జడల దీర్చి మక్కువ తోడ తెనుగు తోటలందు దిప్పినావు’’ అన్నారు దేవులపల్లి రామానుజరావుగారు. ‘‘తెలుగు పదాలలోన గల తీయదనమ్మును గూర్చి చెప్ప గలిగినవాడె ధన్యుడు జగాన...’’అని దాశరథి అంటే, ‘‘గోదావరి కృష్ణ తుంగభద్రా నదుల పారు సలిల లక్ష్మీధారలే సాక్షిగా ప్రఖ్యాత భాష తెలుగు...’’ అంటారు సి.నా.రె. ‘‘తేటతేనెల చిలుకపలుకు నా తెలుగు’’ అని వడ్డెపల్లి శ్రీకృష్ణ అంటే ‘‘తెలుగు నేలపైన తిరుగాడునప్పుడు, తెలుగుమాట నోట బలికినప్పుడు... పొంగిపోదు గర్వమున నేను అంటారు వేదుల సత్యనారాయణశాస్ర్తీగారు.
ఇంతగా ఎందరో కవులు పొగడిన తెలుగు భాషను చూస్తూ, వింటూ బాధపడినవారు వేటూరి సుందరరామమూర్తిగారు. వారంటారూ ‘తెలుగునాడు అన్న తెలుగు రాష్ట్రాన నాడు తెలుగు గాన నేడు లేదు- నేతి బీరలోన నేయక్కడుందిరా తెలుగువాడ నోడ తెలుగువాడ! అని బాధపడ్డారు.
ఇది చాలదన్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక విద్యాదశనుండి ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోను ఆంగ్లాన్ని మాథ్యమంగా ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. అది తెలుసుకున్న మెకాలే విరగబడి మరీ నవ్వాడు.
ఏ తావున ఉన్నాడో కాళోజీ పరుగుపరుగునవచ్చి ప్రభుత్వం పెద్దల్ని హెచ్చరిస్తూ ‘‘ఏ భాషరా నీది ఏమి వేషమురా- ఈ భాష ఈ వేష మెవరికోసమురా- ఆంగ్లమందున మాటలాడ నేర్వగనే సంతోషపడి యెదవు సంగతేమిటిరా! దేశభాషలందు తెలుగులెస్స యటంచు తెలుగుబిడ్డా ఎప్పుడు తెలుసుకొందువురా- తెలుగుబిడ్డవు రోరి! తెలుగు మాట్లాడుటకు సంకోచపడి యెదవు సంగతేమిటిరా’’-అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? అంటూ ఛడామడా వాయించారు.
చాటుగా వింటూ తన కుతంత్రాలను నిరసిస్తున్నవారికి మద్దతు పెరుగుతున్న విషయాన్ని తెలుసుకుని ఏడ్వలేక- నవ్వుతూనే పలాయనం చిత్తగించాడు మెకాలే.

- ఎ.సీతారామారావు 8978799864